Viral Video : ఆ తండ్రి ప్రేమకు ఫిదా అయిన స్టార్ హీరో.. వైరల్ అవుతున్న వీడియో
ఇదే వీడియోను ఆయన ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో షేర్ చేశారు. రితీష్ చేసిన ఈ వీడియో బాగా వైరల్ అవడమే కాదు ఏకంగా 10 లక్షల పైగా వ్యూస్‌తో పాటు వేలకొద్దీ కామెంట్లను పొందింది.

Viral Video : భారతీయులు ఎలాంటి సమస్యకైనా సింపుల్ సొల్యూషన్ కనిపెట్టడంలో ముందుంటారు. ఎండలో, వానలో, చలిలో కాలం ఏదైనా సమస్య ఎంత పెద్దది అయినా సమస్యకు పరిష్కారం రావాల్సిందే. ఇక తల్లిదండ్రి ప్రేమ గురించి చెప్పాల్సిన పనిలేదు. పిల్లలు బాధ పడుతున్నారు అంటే చూడలేరు. అసలు బాధనే దరిచేరకుండా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అచ్చం ఇలాగే ఓ తండ్రి తన కొడుకు కోసం ఓ మంచి పని, సెలబ్రెటీలను సైతం ఆకట్టుకునే పని చేశాడు ఇంతకీ ఏంటి అనుకుంటున్నారా?
అయితే దేశీయ జుగాడ్‌లకు సంబంధించిన వీడియోలు ఇప్పటికే ఎన్నో వైరల్ అయి ప్రపంచవ్యాప్తంగా చాలామందిని ఆకట్టుకున్నాయి. అలాంటి వీడియో మరొకటి తాజాగా సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.ఆ వీడియోలో ఒక పాల వ్యాపారి తన కుమారుడిని పాల డబ్బాలో కూర్చోబెట్టుకొని దానిని బైక్‌కి తగిలించుకొని వెళ్తున్నాడు. ఇలా పాల డబ్బాలో కూర్చోబెట్టడం వల్ల ఆ పిల్లోడు కింద పడే ఛాన్సెస్ తక్కువ.
నిజానికి చిన్నపిల్లలు బైక్ వెనుక కూర్చున్నప్పుడు అలసిపోయి ఈజీగా నిద్రలోకి జారుకుంటారు. గతుకులు ఉన్న రోడ్డులో ప్రయాణాలు చేస్తుంటే ఈ రిస్కు మరింత ఎక్కువగా ఉంటుంది. అందుకే తల్లిదండ్రులు తమ వెనుక కూర్చున్న పిల్లలపై చాలా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. అలాగే రైడింగ్ పై కూడా వారి ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు వారికి రైడింగ్ కొద్దిగా సవాల్‌గా అనిపించవచ్చు. అందుకే ఈ సమస్యకు సదరు పాల వ్యాపారి తెలివిగా చెక్ పెట్టాడు.తన కుమారుడుని పాల డబ్బాలో కూర్చోబెట్టారు.అందులోనుంచి ఆ బాలుడు కింద పడే ఛాన్స్ లేదు.
ఆ తండ్రి తన బాలుడిని పైకి లేపి కింద పెడితే తప్ప అతను కింద పడడు. ఈ విధంగా సదరు పాల వ్యాపారి పెద్దగా ఇబ్బంది లేకుండా, అలాగే బాలుడు కింద పడుతాడేమోననే భయం లేకుండా బైక్ రైడ్ చేసుకుంటూ వెళ్లగలుగుతాడు. అంతేకాదు బాలుడు కూడా ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా హాయిగా నిల్చోని, లేదంటే కూర్చొని ప్రయాణాన్ని పూర్తి చేయవచ్చు. అయితే ఈ వీడియోపై బాలీవుడ్ యాక్టర్ రితేష్ దేశ్‌ముఖ్ స్పందించారు. ఇదే వీడియోను ఆయన ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో షేర్ చేశారు. రితీష్ చేసిన ఈ వీడియో బాగా వైరల్ అవడమే కాదు ఏకంగా 10 లక్షల పైగా వ్యూస్‌తో పాటు వేలకొద్దీ కామెంట్లను పొందింది.
Jugadu Baap…. pic.twitter.com/bCe1Eurs32
— Riteish Deshmukh (@Riteishd) September 16, 2023
