Skanda Movie: స్కంద మూవీలో బ్లండర్ మిస్టేక్… వీడియోతో అడ్డంగా బుక్ అయిన బోయపాటి!
నటుడు శరత్ కుమార్ సినిమాలో జైలర్ గా కనిపించాడు. ఆయన మరణించినప్పుడు న్యూస్ స్క్రోలింగ్ లో సీఐ మరణం అని వేశారు. జైలర్ ని సీఐ అని తప్పుగా వేశారని అడగ్గా… అది మా మిస్టేక్, క్షమించండని అనిల్ రావిపూడి మీడియా ముఖంగా చెప్పారు.

Skanda Movie: సినిమాల్లో లాజిక్స్ ఉండవు. ఆర్ట్ సినిమాలు మినహాయిస్తే యాక్షన్ కమర్షియల్ చిత్రాల్లో చూపించేదంతా మాయే. లాజిక్ లేకుండా మ్యాజిక్ తో లాగించేస్తారు. ఈ క్రమంలో కొన్ని మిస్టేక్స్ కూడా దొర్లుతుంటాయి. హడావుడి కారణంగానో, ఎవరూ గమనించకో సినిమాల్లో తప్పులు చోటు చేసుకుంటాయి. అవి ఆడియన్స్ దృష్టికి వెళితే దర్శకుడు అభాసుపాలు కాక తప్పదు. భగవంత్ కేసరి మూవీలో జరిగిన చిన్న మిస్టేక్ గురించి ఓ మీడియా ప్రతినిధి దర్శకుడు అనిల్ రావిపూడిని అడిగాడు.
నటుడు శరత్ కుమార్ సినిమాలో జైలర్ గా కనిపించాడు. ఆయన మరణించినప్పుడు న్యూస్ స్క్రోలింగ్ లో సీఐ మరణం అని వేశారు. జైలర్ ని సీఐ అని తప్పుగా వేశారని అడగ్గా… అది మా మిస్టేక్, క్షమించండని అనిల్ రావిపూడి మీడియా ముఖంగా చెప్పారు. అలాగే లేటెస్ట్ రిలీజ్ స్కందలో ఇలాంటి మిస్టేక్ జరిగింది.
ఓ యాక్షన్ ఎపిసోడ్ లో రామ్ ఓ వ్యక్తిని గన్ తో కాల్చి చంపుతాడు. నెక్స్ట్ షాట్ లో విలన్ శరత్ లోహితష్వ వెనుక చనిపోయిన వ్యక్తి ఉంటాడు. బోయపాటి శ్రీను ఈ బ్లండర్ మిస్టేక్ చూడలేదు. ఓటీటీలో స్కంద విడుదల కాగా ఈ తప్పు గమనించిన ఓ నెటిజెన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో బోయపాటిని నెటిజెన్స్ ఆడేసుకుంటున్నారు. సెప్టెంబర్ 28న విడుదలైన స్కంద బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
లాంగ్ వీకెండ్ తో పాటు సెలవు రోజుల్లో విడుదలైనా కూడా సత్తా చాటలేకపోయింది. మూవీపై హైప్ నేపథ్యంలో భారీ ధరలకు థియేట్రికల్ హక్కులు అమ్మారు. రికవరీ చేయడంలో స్కంద ఫెయిల్ అయ్యింది. స్కంద 2 అంటూ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాడు బోయపాటి. స్కంద చిత్రంలో రామ్ పోతినేనికి జంటగా శ్రీలీల నటించింది. థమన్ సంగీతం అందించారు.
— Actual India (@ActualIndia) November 2, 2023
