Margadarshi Case : మార్గదర్శిలో నల్లధనం.. వాళ్లందరికీ షాక్
దీంతో రామోజీ అండ్ కోలో ఆందోళన మొదలైంది. సీఐడీ 800 మంది డిపాజిటర్లకు నోటీసులిచ్చిన క్రమంలో మార్గదర్శి యాజమాన్యం ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. తాము చిట్ ఫండ్స్, ఆదాయపు పన్ను చట్టాలను పాటిస్తున్నామని చెప్పింది. అయితే ఎక్కడ ఆర్బీఐ, సీబీడీటీ నిబంధనలు పాటిస్తున్నామని చెప్పలేకపోవడం గమనార్హం.

Margadarshi Cae : ‘మార్గదర్శి’ అక్రమాల కేసులో ఏపీ సీఐడీ పట్టు బిగుస్తోంది. ఇప్పటికే కీలక ఆస్తులను అటాచ్ చేసిన సీఐడీ.. ఇప్పుడు మార్గదర్శిలో డిపాజిట్లు చేసిన నల్ల కుభేరుల జాబితాను బయటకు తీసే పనిలో పడింది. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది తమ నల్లధనాన్ని దాచుకునే వేదికగా మార్గదర్శిని మార్చుకున్నారని అనుమానిస్తోంది. అందుకే కోటి రూపాయలకుపైగా డిపాజిట్లు చేసిన వారిని గుర్తించింది. వారిని నోటీసులు అందిస్తోంది. అంత ధనం ఎలా అర్జించారు? వాటికి పన్నులు కట్టారా? లేదా? అన్న ఉక్కిరిబిక్కిరి ప్రశ్నలను సంధిస్తోంది. ఇప్పటివరకూ 800 మందికి నోటీసులు జారీచేసినట్టు తెలుస్తోంది. అయితే వీరి సంఖ్య వెయ్యి మందికి పైగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
