రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన దేశంలో కరెన్సీ నోట్లను ముద్రిస్తుందనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన దేశ కరెన్సీలో చాలా రకాల నోట్లు ఉండగా ఆర్బీఐ భద్రత విషయంలో ఏ మాత్రం రాజీ పడదనే సంగతి తెలిసిందే. మన దేశ కరెన్సీ నోట్లలో ప్రతి నోటుకు కొన్ని సెక్యూరిటీ ఫీచర్లు ఉంటాయి. ఈ సెక్యూరిటీ ఫీచర్ల సహాయంతో అసలు కరెన్సీ నోటుకు, నకిలీ కరెన్సీ నోటుకు మధ్య తేడాను గుర్తించే ఛాన్స్ అయితే ఉంటుంది.
నోటులో ఉండే చిన్నచిన్న గుర్తులను గుర్తించడం ద్వారా ఫేక్ కరెన్సీకి సులభంగా అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుంది. 2016 సంవత్సరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నోట్ల రద్దు చేయగా నోట్ల రద్దు వల్ల కరెన్సీ నోట్లకు సంబంధించిన ముద్రణలో కీలక మార్పులు చోటు చేసుకోవడం గమనార్హం. 100, 500, 2000 రూపాయల నోట్లపై నల్లగా ఉండే గీతలు ఎందుకు ఉంటాయనే ప్రశ్నకు చాలామందికి సమాధానం తెలియదు.
కరెన్సీ నోట్లపైన ఇలా గీతలను గుర్తించడానికి ముఖ్యమైన కారణమే ఉంది. అంధులు కరెన్సీ నోట్లను సులభంగా గుర్తించాలనే ముఖ్య ఉద్దేశంతో కరెన్సీ నోట్లపై నల్లటి గీతలను ముద్రించడం జరుగుతుంది. 100 రూపాయల కరెన్సీ నోటుపై (|| ||) గీతలు, 200 రూపాయల కరెన్సీ నోటుపై గీతలతో పాటు చుక్కలు (|| o o ||), 500 రూపాయల నోట్లపై 5 గీతలు (|| | ||), 2,000 రూపాయల నోటుపై 7 గీతలు (| || | || |) ఉండే అవకాశం ఉంది.
నోటుపై ఈ గీతలను తాకడం ద్వారా సులువుగా నోటును గుర్తు పట్ఱే వీలు ఉంటుంది. కరెన్సీ నోట్ల ముద్రణ గురించి కనీస అవగాహన ఉన్నవాళ్లకు ఈ నోట్ల ముద్రణకు సంబంధించిన అన్ని విషయాల గురించి అవగాహన ఉంటుంది.
Also Read: Bheemla Nayak: మీనన్ ముద్దుగుమ్మల మధ్యలో ‘పవన్ – రానా’ !