BJP Vs KCR : కేసీఆర్ అవినీతిపై బీజేపీ తొలి అస్త్రం.. సంచలనం

BJP Vs KCR : భారత రాష్ట్ర సమితి పేరుతో దేశ రాజకీయాల్లోకి వెళ్లిన కేసీఆర్.. తనను ప్రతిపక్ష పార్టీలకు చైర్మన్ గా నియమిస్తే.. 2024 లో ప్రతిపక్ష పార్టీల ఎన్నికల ఖర్చు మొత్తం బరాయిస్తాడు” అని ఈమధ్య ఇండియా టుడే జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ చెప్పాడు కదా.. దీంతో దేశవ్యాప్తంగా ఒక చర్చ నడుస్తోంది.. ఇదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా కెసిఆర్ దగ్గర అంత డబ్బు ఉందా అని ఆశ్చర్యం వ్యక్తం […]

  • Written By: Bhaskar
  • Published On:
BJP Vs KCR : కేసీఆర్ అవినీతిపై బీజేపీ తొలి అస్త్రం.. సంచలనంBJP Vs KCR :
భారత రాష్ట్ర సమితి పేరుతో దేశ రాజకీయాల్లోకి వెళ్లిన కేసీఆర్.. తనను ప్రతిపక్ష పార్టీలకు చైర్మన్ గా నియమిస్తే.. 2024 లో ప్రతిపక్ష పార్టీల ఎన్నికల ఖర్చు మొత్తం బరాయిస్తాడు” అని ఈమధ్య ఇండియా టుడే జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ చెప్పాడు కదా.. దీంతో దేశవ్యాప్తంగా ఒక చర్చ నడుస్తోంది.. ఇదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా కెసిఆర్ దగ్గర అంత డబ్బు ఉందా అని ఆశ్చర్యం వ్యక్తం చేసినట్టు వార్తలు వచ్చాయి. కానీ మోదీ దానిని అంతటితోనే వదిలేయలేదు. కేంద్ర దర్యాప్తు సంస్థలు కేసీఆర్ మరకల మీద, ఆయనకున్న నలుపుల మీద కూపీ లాగుతున్నట్టు సమాచారం. అసలు కెసిఆర్ దగ్గర అంత డబ్బు ఎక్కడిది? ఎక్కడి నుంచి వచ్చింది? ఏం మార్గం ద్వారా ఆయనకు అందింది? ఈ విషయాలపై భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా సైలెంట్ గా ఏమీ ఉండటం లేదు. తమకు అచ్చి వచ్చిన ఐటీ సెల్ ద్వారానే భారత రాష్ట్ర సమితిని, కేసీఆర్ ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు.

ఇందులో భాగంగానే ఒక వీడియోను విడుదల చేశారు. ఇందులో ముఖ్యమంత్రి కెసిఆర్ కేంద్రం ద్వారా వచ్చే నిధులతో రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ వంటి పథకాలను అమలు చేస్తున్నట్టు అందులో చూపించారు. ఆ పథకాలకు కూడా నిధులు సక్రమంగా ఖర్చు చేయకుండా తన సొంత ఖజానాలోకి మళ్లిస్తున్నట్టు చూపించారు. ఇక ఇందులో కేటీఆర్ ను కూడా ప్రస్తావించారు. ఆయన ఏకంగా కారులో వస్తున్నట్టు, తెలంగాణ పథకాల్లో అవినీతికి పాల్పడి భారీగా వెనకేసుకుంటున్నట్టు చూపించారు. ఇక ఈ ఖజానా లో బోగయిన డబ్బులు పోగయిన డబ్బులు, బంగారం ద్వారా కల్వకుంట్ల కవిత ఎంజాయ్ చేస్తున్నట్టు చూపించారు.

ఇక కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులను సొంతానికి మళ్లించుకుంటున కేసీఆర్.. ఆ డబ్బులతో అంతకంతకు పెరిగిపోతున్నారని ఈ వీడియోలో చూపించారు. 2014లో స్వల్ప మొత్తంలో ఉన్న కేసీఆర్ ఆదాయం 2023 కు వచ్చేసరికి భారీగా పెరిగిపోయిందని ఈ వీడియోలో ప్రస్తావించారు. కెసిఆర్ డబ్బులు సంపాదించింది ప్రధానమంత్రి కావడానికని, ఇందులో భాగంగానే భారత రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేశారని రాజకీయాలో ప్రస్తావించారు. కెసిఆర్ భారత రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసిన అనంతరం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి అభినందిస్తున్నట్టు ఆ వీడియోలో చూపించారు.. ఇందులో ఫైనల్ ట్విస్ట్ ఏంటంటే.. తన తండ్రి జాతీయ పార్టీ పెట్టి ప్రధానమంత్రి అవుతానని ప్రకటన చేస్తుండగా.. ఆయన కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎగిరి గంతేస్తుంది. కానీ ఈడి అధికారులు ఆమెను అరెస్టు చేసేందుకు వస్తారు. బేడీలు చూపించగానే ఆమె భయపడి పోతారు. అంటే లిక్కర్ కేసులో కవితను ఈడీ అరెస్ట్ చేయబోతుందా? భారత రాష్ట్ర సమితి అధినేత కేసిఆర్ కు బిజెపి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదేనా? ఇన్నాళ్లు గోకుతున్న కేసీఆర్ ను, బిజెపి తిరిగి ఇలా గోకనుందా? ఈ వీడియో ద్వారా ఇచ్చే సంకేతాలు అవేనా? అంటే అవును అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

మరి కొందరు మాత్రం భారత రాష్ట్ర సమితి అవినీతి మీద కేంద్రానికి స్పష్టమైన సమాచారం ఉండి ఉంటే ఎందుకు కాలయాపన చేస్తోంది అని ప్రశ్నిస్తున్నారు. టెన్త్ హిందీ ప్రశ్న పత్రం లీకేజీ కేసులో బండి సంజయ్ ని అరెస్టు చేసి ” బిడ్డా మా జోలికి, నా బిడ్డ జోలికి వస్తే మర్యాద దక్కదు” అని కెసిఆర్ హెచ్చరించాడు.. అది కూడా ప్రధాని తెలంగాణ పర్యటనకు మూడు రోజుల ముందు.. మరి పైనే భారతీయ జనతా పార్టీ సరైన కౌంటర్ ఇవ్వలేకపోయింది.. ఇక లిక్కర్ స్కాం మీద ఏం ఇస్తుంది? కవితలు ఇంకెప్పుడు అరెస్టు చేస్తుంది? అనే వాదనలు కూడా లేకపోలేదు.. కానీ గతానికంటే భిన్నంగా దేశంలో ఇంతమంది ప్రతిపక్ష పార్టీ నాయకులను వదిలిపెట్టి కేవలం కేసీఆర్ మీదనే వీడియో రూపొందించి పోస్ట్ చేసింది అంటే.. గులాబీ పార్టీకి ముందున్నది ముందున్నది మొసళ్ళ పండగేనా?!

Tags

Read Today's Latest Politics News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube