Gujarat Elections 2022- BJP: మరి కొద్ది రోజుల్లో బిజెపి ఎన్నికలు జరగబోతున్నాయి.. గతంలో కాంగ్రెస్, బిజెపి మధ్య పోటీ ఉండేది.. కానీ ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ చేరింది.. ఎవరికివారు పోటా పోటీగా ప్రచారం చేస్తున్నారు. అలవికాని హామీలు ఇస్తున్నారు. అయితే ఈ మూడింటిలో గత 25 ఏళ్లుగా గుజరాత్ రాష్ట్రాన్ని పాలిస్తున్న భారతీయ జనతా పార్టీపై అందరి కళ్ళు ఉన్నాయి.. మరి ముఖ్యంగా ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం కావడంతో అందరూ ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. 2024 లో కేంద్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడుతుందో ఎన్నికలు నిర్దేశిస్తాయని విశ్లేషకులు అంటున్నారు.

Gujarat Elections 2022- BJP
కొత్త అస్త్రాలు వెతుక్కుంది
గతంలో హిందూత్వను, కాంగ్రెస్ బాధిత అనే అస్త్రాలతో బిజెపి ప్రచారం చేసింది. వీటి ఆధారంగానే 25 ఏళ్ల పాటు అధికారాన్ని చేజిక్కించుకుంది.. ఈ దశలో బిజెపిని నిలువరించకపోవడం కాంగ్రెస్ చేసిన అతి పెద్ద తప్పు. పైగా ఈ సమయంలో కాంగ్రెస్ ను బిజెపి చీల్చుకుంటూ వచ్చింది. 2017లో అతిపెద్ద పాటిదారుల ఉద్యమం జరిగినప్పటికీ బీజేపీ గెలిచిందంటే అందుకు కారణం అదే.
ఈసారి కొత్త అస్త్రాలు
భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో కొత్త అస్త్రాలను తెరపైకి తీసుకొచ్చింది. ఆ మధ్య జరిగిన రాహుల్ గాంధీ జోడో యాత్రలో మేధాపాట్కర్ పాల్గొన్నారు.. ఆయనతో కలిసి నడిచారు.. దీనిని భారతీయ జనతా పార్టీ విస్తృతంగా ప్రచారం చేసుకుంది.. ఎందుకంటే గతంలో గుజరాత్ రాష్ట్రంలో నిర్మించిన నర్మదా ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళనల్లో మేధాపాట్కర్ పాల్గొన్నారు. నర్మద ప్రాజెక్టును గుజరాత్ ఆశాకిరణంగా గతంలో మోడీ పలుమార్లు ప్రస్తావించారు.. ఈ క్రమంలో మేధాపాట్కర్ చేసిన ఆందోళనల వల్ల గుజరాత్ ప్రభుత్వం సుప్రీంకోర్టు దాకా వెళ్లాల్సి వచ్చింది.. అయితే ఇప్పుడు అదే విషయాన్ని బిజెపి నాయకులు తమ ప్రచార అస్త్రాలుగా వాడుకుంటున్నారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులను అయితే ఒక రకంగా చెడుగుడు ఆడుకుంటున్నారు.. సత్యేంద్ర జైన్ ఉదంతం, ఢిల్లీ లిక్కర్ స్కాం, స్కూళ్ళ గదుల నిర్మాణ కుంభకోణాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు.

Gujarat Elections 2022- BJP
అభివృద్ధి కోణం కూడా
ఇక తాము గత 25 ఏళ్లుగా ఏం చేశామో చెప్పుకుంటున్న బిజెపి నాయకులు… గుజరాత్ రాష్ట్రానికి పెట్టుబడుల విషయంలో ఇతర రాష్ట్రాలకు అన్యాయం చేసేందుకు కూడా వెనుకాడటం లేదు. ఉదాహరణకి మహారాష్ట్రలో వేదాంత ఫాక్స్ కాన్ టెక్నాలజీ చిప్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేద్దామని అనుకుంది. దీనికి 1,50,000 కోట్లు పెట్టుబడిగా పెడతామని ప్రకటించింది.. అని చివరి నిమిషంలో అమిత్ షా చక్రం తిప్పడంతో అది గుజరాత్ వెళ్లిపోయింది. ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం 33 వేల కోట్ల రాయితీ ఇచ్చింది. ఇక కేంద్రం ప్రకటించిన గిఫ్ట్ సిటీలు, తెలంగాణకు రావలసిన ఆయుష్ కేంద్రాలు కూడా గుజరాత్ వెళ్లిపోయాయి. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి తరలిపోయిన ప్రాజెక్టులు చాలా ఉంటాయి. మహారాష్ట్రలో తమ సొంత పార్టీ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా గుజరాత్ ప్రయోజనాల విషయంలో నరేంద్ర మోడీ వెనక్కు తగ్గలేదు. ఇక బిల్కిన్ భానో కేసులో నిందితుల విడుదలలో గుజరాత్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు పలు విమర్శల పాలైంది. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే బిజెపి వ్యవహరిస్తున్న తీరు గతం కంటే భిన్నంగా ఉంది. తన సెంటిమెంట్ అయిన హిందుత్వ కు దూరం జరగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.