BJP Vs KCR: జగన్ తో కేసీఆర్ ను కొట్టిస్తున్న బీజేపీ పెద్దలు
ఏపీలో ప్రజామోదంతో గెలిచిన జగన్ కు సీబీఐ కేసులు వీడడం లేదు. ఇవి చాలవన్నట్టు బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసు మరింత బిగుసుకుంటోంది. ఇప్పుడు తన వారిని కేసుల బారి నుంచి కాపాడుకోవడం జగన్ కు పెద్ద టాస్కుగా మారిపోయింది.

BJP Vs KCR: జగన్ భుజాన గన్ పెట్టి బీజేపీ కేసీఆర్ ను టార్గెట్ చేసిందా? వారిద్దరి మధ్య స్నేహాన్ని విడగొట్టేందుకు డిసైడ్ అయ్యిందా? సీబీఐ కేసుల బూచీతో జగన్ సైతం మెత్తబడ్డారా? బీజేపీకి సహకరించేందుకు నిర్ణయించుకున్నారా? అంటే ఢిల్లీ వర్గాలు అవుననే సమాధానం చెబుతున్నాయి. జగన్, కేసీఆర్ లు మొన్నటివరకూ మంచి మిత్రులే. మధ్యలో బీజేపీ ఎంటరయ్యేసరికి రహస్య మిత్రులైపోయారు.2019 ఎన్నికల్లో తెలంగాణలో నాలుగు ఎంపీ స్థానాలు బీజేపీకి వచ్చేసరికి కేసీఆర్ తో చెడింది. ఏపీలో మాత్రం జగన్ తో బీజేపీ స్నేహం కొనసాగుతోంది. కేసీఆర్ తో స్నేహాన్ని జగన్ సైతం కొనసాగిస్తున్నారు. అందుకే ఇప్పుడు బీజేపీ ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. రహస్య మిత్రుల మధ్య కొత్త చిచ్చుకు ప్రయత్నిస్తోంది.
ఏపీలో ప్రజామోదంతో గెలిచిన జగన్ కు సీబీఐ కేసులు వీడడం లేదు. ఇవి చాలవన్నట్టు బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసు మరింత బిగుసుకుంటోంది. ఇప్పుడు తన వారిని కేసుల బారి నుంచి కాపాడుకోవడం జగన్ కు పెద్ద టాస్కుగా మారిపోయింది. తాజాగా ఆయన కేసీఆర్ కుటుంబాన్న తీవ్రంగా ఇబ్బంది పెట్టేందుకు రెడీ అయినట్లుగా ఢిల్లీలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను ఇరికించేందుకు సాయం చేస్తానని జగన్ ఢిల్లీ పెద్దలకు హమీ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఆ సాయం శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారడమేనన్న టాక్ నడుస్తోంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒక కుదుపు కుదిపేసింది. ఈ కేసులో శరత్ చంద్రారెడ్డి చాలా కాలం పాటు జైల్లో ఉన్నారు. తన భార్యకు ఆరోగ్యం బాగో లేదన్న కారణం చెప్పి బెయిల్ తెచ్చుకుని ప్రస్తుతం బయట ఉన్నారు. అరబిందో వారసుడు అయిన శరత్ చంద్రారెడ్డి మద్యం వ్యాపారం చేయడం ఏమిటో చాలా మందికి అర్థం కాలేదు. ఈ కారణంగా అరబిందో షేర్ కూడా పడిపోయింది. తర్వాత అరబిందోలో ఉన్న పదవుల నుంచి ఆయనను తప్పించారు. ఈ మొత్తం వ్యవహారంలో అనవసరంగా ఇరుక్కుపోయానని శరత్ చంద్రారెడ్డి అంతర్మథనం చెందుతున్నారు. ఎలాగైనా కేసు నుంచి బయటపడాలని భావిస్తున్నారు.
కేసీఆర్ కుమార్తె కవిత, అరబిందో శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ్ కలిసే లిక్కర్ వ్యాపారం చేసి స్కాంకు పాల్పడ్డారని సీబీఐ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారితే.. కవితను పూర్తి స్థాయిలో కార్నర్ చేయవచ్చని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. అందుకే జగన్ ద్వారా ఈ కార్యం సాధించుకోవాలని చూస్తున్నట్టు సమాచారం. అందుకే తాజాగా అమిత్ షాతో భేటీ అయిన జగన్ శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ అవుతారన్న సంకేతాలు ఇచ్చారని సమాచారం. అందులో భాగంగానే శరత్ చంద్రారెడ్డికి వై కేటగిరి భద్రతను కేంద్రం కేటాయించినట్టు తెలుస్తోంది.
తెలంగాణలో బీజేపీకి మైలేజీ రావాలంటే ఈ కేసు కీలకమని హైకమాండ్ పెద్దలు భావిస్తున్నారు. అదే సమయంలో ఏపీలో జగన్ సర్కారుకు వివేకా హత్య కేసు విచారణ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇటీవల కేసు వాదనలో జగన్ పేరును సీబీఐ ప్రస్తావించింది. దాదాపు చివరి దశకు వచ్చినట్టు తెలుస్తోంది. దీని నుంచి బయటపడేందుకు జగన్ కేంద్ర పెద్దలను ఆశ్రయించారు. దీంతో మద్యం స్కాం కేసు బిగుసుకుంటే.. అక్కడ ఉపశమనమిస్తామని పెద్దలు షరతు పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాను క్షేమంగా బయటపడడం ఉత్తమమని జగన్ భావిస్తున్నారు. అందుకే కేసీఆర్ కుటుంబాన్ని బలిపశువు చేసేందుకు సిద్ధపడ్డారని వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే జగన్, కేసీఆర్ ల మధ్య కొత్త యుద్ధం ప్రారంభమయ్యే చాన్స్ ఉంది.
