AP BJP: ఏపీలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. పొత్తులు, ఎత్తులతో రసవత్తరంగా మారుతోంది. ఓ పార్టీ ఏపీలో జెండా పీకేస్తోందని ప్రచారం జరుగుతోంది. 2024 ఎన్నికలే ఆ పార్టీకి చివరి ఎన్నికలని చర్చ నడుస్తోంది. ఇంతకీ జెండా పీకేసే పార్టీ ఏది ? ఆ పార్టీని ఏపీ నుంచి లేపేసే స్కెచ్ ఎవరు వేశారు ? ఇవన్నీ తెలుసుకోవాలంటే స్టోరీ చదివేయండి.

vishnu vardhan reddy
ఏపీ బీజేపీ నేత విష్లువర్దన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఏపీ హాట్ టాపిక్ గా మారాయి. 2024 ఎన్నికల తర్వాత ఏపీలో ఓ పార్టీ జెండా పీకేస్తోందని కామెంట్ చేశారు. వైసీపీలో ఏక్ నాథ్ షిండేలు ఉన్నారని వ్యాఖ్యానించారు. వైసీపీలో ఉన్న ఏక్ నాథ్ షిండేలు ఎవరన్న చర్చ జరుగుతోంది. వైసీపీలోని కొందరు కీలక నేతలతో మొదటి నుంచి బీజేపీ నేతలు టచ్ లో ఉన్నారని తెలుస్తోంది.
ఏపీలోని ఓ జిల్లా నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు అయ్యారు. అదే జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత తన ప్రత్యర్థుల్లాగే సీఎం కావాలని ఎంతో ఆశతో ఉన్నారని గతంలో ప్రచారం జరిగింది. అదే సందర్భంలో సీఎం జిల్లాకు చెందిన కీలక నేత జాతీయ పార్టీతో టచ్ లో ఉన్నారని తెలుస్తోంది. సీఎం నుంచి ఏదైనా వ్యతిరేకత ఎదురైతే వెంటనే జాతీయ పార్టీలోకి తన అనుచర వర్గ ఎమ్మెల్యేలతో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.

vishnu vardhan reddy
ఏపీలో ఓ పార్టీ జెండా పీకేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు విష్ణువర్దన్ రెడ్డి చెప్పారు. అదే సందర్భంలో వైసీపీలో ఏక్ నాథ్ షిండేలు ఉన్నట్టు చెప్పారు. ఈ రెండు వ్యాఖ్యల్ని ఒకచోటుకు చేర్చి చూస్తే బీజేపీ చెబుతున్న జెండా పీకేసే పార్టీ వైసీపీనేనా ? అన్న అనుమానం కలుగక మానదు. వైసీపీ నేతలు ఢిల్లీలో తరచూ బీజేపీ నేతల్ని కలుస్తుంటారు. ఇలా కలవడం పై కూడా జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఏపీలో ఏదో ఒక పార్టీని ఖాళీ చేసి ఆ స్థానాన్ని భర్తీ చేయాలన్న ఆలోచన బీజేపీలో ఉన్నట్టు తెలుస్తోంది. మహారాష్ట్ర తరహా రాజకీయం చేస్తే ఏపీలో వైసీపీకి ఇబ్బందే.
బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, వైసీపీలోని పరిస్థితుల్ని చూస్తే బీజేపీ స్కెచ్ వేసింది వైసీపీకేనా అన్న అనుమానం కలుగుతోంది. వైసీపీ కాంగ్రెస్ పునాదుల పై నిర్మించిన పార్టీ. కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వచ్చిన కార్యకర్తలకు ఇంకో పార్టీలోకి వెళ్లడం పెద్ద ఇబ్బందేం కాదు. ఇప్పటికే జగన్ పై సీబీఐ కేసులు ఉన్నాయి. ఆ కేసుల్లో తీర్పు జగన్ కు వ్యతిరేకంగా వస్తే వైసీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. ఏపీలో మనుగడ సాగించే పరిస్థితి మృగ్యం అవుతుంది. ఇదే అవకాశంగా బీజేపీ వైసీపీ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉంది. దీని కోసం బీజేపీ భారీ స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది.