BJP Operation Kamalam In Country: 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాక పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి బీజేపీ గద్దెనెక్కింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైనా తన బలంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. ఫలితంగా కాంగ్రెస్ రెండు రాష్ట్రాలకే పరిమితం అయింది ఈ నేపథ్యంలో బీజేపీ మంత్రంతో కాంగ్రెస్ ను అన్ని ప్రాంతాల్లో మట్టి కరిపిస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ కు నిరాశే మిగులుతోంది. ప్రస్తుతం మహారాష్ట్ర సంక్షోభంతో అక్కడ కూడా బీజేపీ అధికారం చేపట్టడం ఖాయంగానే కనిపిస్తోంది.

modi, amit shah
2014లో అరుణాచల్ ప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 60 స్థానాలకు గాను 42 స్థానాల్లో విజయం సాధించి అధికారం చేపట్టినా అది ఎంతో కాలం నిలవలేదు. 2016లో ముఖ్యమంత్ర నేతృత్వంలోనే 41 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి బీజేపీలో చేరారు దీంతో అక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. బీజేపీ తన వ్యూహాలతో ఎదుటి వారిని తమ పార్టీలోకి ఆహ్వానించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటూ పోతోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరంగా పోతోంది.
Also Read: Pawan Kalyan: ఆంధ్ర రాజకీయ ముఖ చిత్రం మారబోతుంది
2015లో బిహార్లో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. కానీ బీజేపీ వారిలో అనైక్యత సృష్టించి 2017లో నితీష్ కుమార్ నేతృత్వంలోనే బీజేపీ ప్రభుత్వం కొలువు దీరడం గమనార్హం. మధ్యప్రదేశ్ లో 2018లో కమల్ నాథ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కింది. కానీ 121 మంది బలమున్నా జ్యోతిరాదిత్య సింథియా ఆధ్వర్యంలో 26 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో ప్రబుత్వంలో చీలిక ఏర్పడింది. దీంతో శివరాజ్ సింగ్ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం సంచలనమే.

modi amit shah
మణిపూర్ లో 60 స్థానాలుండగా 28 స్థానాల్లో కాంగ్రెస్, 21 స్థానాల్లో బీజేపీ గెలిచింది. కానీ తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొని బీజేపీ ప్రభుత్వం గద్దె ఎక్కడం తెలిసిందే. గోవాలోనూ అదే పరిస్థితి. నలభై స్థానాలున్న గోవా అసెంబ్లీలో 17 స్థానాల్లో గెలిచి కాంగ్రెస్ పెద్ద పార్టీగా అవతరించగా బీజేపీకి 13 స్థానాలే దక్కాయి. కానీ ఇతర పార్టీలకు చెందిన పది మంది సభ్యులు, కాంగ్రెస్ కు చెందిన ఓ ఎమ్మెల్యే మద్దతుతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2019లో మరో 15 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు.
2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 104 సీట్లు వచ్చినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంఖ్య లేకపోవడంతో జేడీఎస్, కాంగ్రెస్ సంకీర్ణ సర్కారు కొలువుదీరింది. కానీ 2019లో బీజేపీ వారిలో అనైక్యత సృష్టించి వారి ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకుని సర్కారు గద్దెనెక్కింది. దీంతో కాంగ్రెస్ కు నిరాశే మిగిలింది. ఇలా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బీజేపీ తన హవా కొనసాగిస్తూ కాంగ్రెస్ ను అధికారానికి దూరం చేస్తోంది. ఈ పరిస్థితి వచ్చే ఎన్నికల్లో కూడా స్పష్టంగా కనిపించనుందని తెలుస్తోంది.
Also Read:Minister KTR Tours: కేటీఆర్ కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నది అందుకేనా?