Gujarath cm Bhupendra Patel: గుజరాత్ సీఎంగా ఎవరూ ఊహించని వ్యక్తి

Gujarath cm Bhupendra Patel:ప్రధాని మోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షాల సొంత రాష్ట్రం గుజరాత్. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీషాలకు వారి సొంత రాష్ట్రంలో అధికారంలో ఉండడం అత్యంత అవశ్యం. ఇంట గెలవకపోతే రచ్చ గెలవడం కష్టం. అందుకే ఇప్పుడున్న సీఎం విజయ్ రూపానిని రాజీనామా చేయించి తాజాగా ఒక సాధారణ బీజేపీ ఎమ్మెల్యేను సీఎంను చేసేశారు. మంత్రి కూడా బీజేపీ ఎమ్మెల్యే భూపేంద్ర పటేల్ ను గుజరాత్ సీఎంగా ప్రకటించారు. మొత్తానికి గుజరాత్ లో బలమైన […]

  • Written By: NARESH ENNAM
  • Published On:
Gujarath cm Bhupendra Patel: గుజరాత్ సీఎంగా ఎవరూ ఊహించని వ్యక్తి

Gujarath cm Bhupendra Patel:ప్రధాని మోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షాల సొంత రాష్ట్రం గుజరాత్. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీషాలకు వారి సొంత రాష్ట్రంలో అధికారంలో ఉండడం అత్యంత అవశ్యం. ఇంట గెలవకపోతే రచ్చ గెలవడం కష్టం. అందుకే ఇప్పుడున్న సీఎం విజయ్ రూపానిని రాజీనామా చేయించి తాజాగా ఒక సాధారణ బీజేపీ ఎమ్మెల్యేను సీఎంను చేసేశారు. మంత్రి కూడా బీజేపీ ఎమ్మెల్యే భూపేంద్ర పటేల్ ను గుజరాత్ సీఎంగా ప్రకటించారు. మొత్తానికి గుజరాత్ లో బలమైన సామాజికవర్గమైన పటేల్ లకే ముఖ్యమంత్రి పీఠాన్ని బీజేపీ అధిష్టానం కట్టబెట్టింది.

గుజరాత్ కొత్త సీఎంగా భూపేంద్రపటేల్ ఎన్నికయ్యారు. బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ఈ మేరకు ఇవాళ ఎన్నుకున్నారు. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి, నరేంద్రతోమర్ లు గాంధీనగర్ లో నిర్వహించిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

బీజేపీ శాసనసభా పక్ష సమావేశం ఘట్లొడియా నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన భూపేంద్ర పటేల్ ను గుజరాత్ సీఎంగా ఎన్నుకున్నారు. సీఎం పదవికి రాజీనామా చేసిన విజయ్ రూపానీ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈయనే భూపేంద్రను నామినేట్ చేయగా.. ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఈ మేరకు కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్ ‘భూపేంద్ర’ గుజరాత్ సీఎం అని అధికారికంగా ప్రకటించారు.

గుజరాత్ రాష్ట్రంలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చడంలో విజయ్ రూపానీకి బదులుగా మరో నేతను ఎంపిక చేయాలని ఆ పార్టీ భావించింది. ఈ మేరకు తాజాగా భూపేంద్రపటేల్ ను ఎన్నుకుంది.

మోడీషాలు తమ సొంత రాష్ట్రంలో వ్యూహాత్మకంగా రాజకీయ పావులు కదుపుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఆరుదఫాలుగా గుజరాత్ లో బీజేపీ అధికారంలో ఉంది. పైగా మోడీషాల సొంత రాష్ట్రం. బీజేపీపై వ్యతిరేకత సహజం. అందుకే వచ్చే ఏడాది డిసెంబర్ లో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటినుంచే బీజేపీ అడుగులు వేస్తోంది. మొత్తం 182 మంది సభ్యులు ఉన్న గుజరాత్ అసెంబ్లీలో తిరిగి అధికారం దక్కించుకునేందుకు వ్యూహాత్మకంగా కదులుతున్నారు. అందులో భాగంగానే ప్రస్తుత గుజరాత్ సీఎం విజయ్ రూపాని తన పదవికి రాజీనామా సమర్పించారు. దీనికి అసూలు కారనం కొత్త సీఎం ఆధ్వర్యంలో ఎన్నికలకు సమాయత్తం కావటమేనని స్పష్టం అవుతోంది. విజయ్ రూపానీ రాజీనామా చేయడంతో ఇప్పుడు కొత్త సీఎంగా భూపేంద్ర పటేల్ ఎన్నికయ్యారు.

గుజరాత్ లో పటేల్ సామాజికవర్గం అత్యం త ప్రభావవంతమైంది. క్రీయాశీలకమైంది. ఈ క్రమంలోనే పటేల్ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసి అతడి నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్లాలని.. లేదంటే వారి నుంచి వ్యతిరేకత ఓటమి ఎదురవుతుందన్న భయం బీజేపీ హైకమాండ్ ను వెంటాడుతోంది.

ఇప్పటికే గుజరాత్ లో కాంగ్రెస్ కు అధికారం కోల్పోకూడదని.. ఇన్నేళ్ల పాలనలోని వ్యతిరేకతను అధిగమించడానికే కొత్త వారికి పదవులుఇవ్వాలని.. పటేల్ సామాజికవర్గాన్ని తృప్తి పరచాలని మోడీషాలు ఈ ఎత్తుగడ వేసినట్టు తెలుస్తోంది. పక్కా లెక్కలు వేసే ఎవరికి సీఎం పీఠం కట్టబెట్టాలనే నిర్ణయానికి బీజేపీ హైకమాండ్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆదివారం కొత్త సీఎంగా భూపేంద్రపటేల్ ను బీజేపీ ప్రకటించింది.

Read Today's Latest National politics News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు