Megastar Chiranjeevi- BJP: చిరంజీవిని కాషాయ దళంలోకి తేవాలన్న ఏ ప్రయత్నమూ వర్కవుట్ కావడం లేదు. గత కొద్దిరోజులుగా బీజేపీ నేతలు చిరంజీవి కోసం రకరకాలుగా ప్రయత్నాలు చేశారు. కానీ అవి విఫలయత్నాలుగా మారాయి. తాజాగా ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ఇండియా అవార్డు ప్రదానోత్సవంలో కూడా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ కూడా ఇటువంటి ప్రయత్నమే చేశారు. కానీ చిరంజీవి నుంచి దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చి ఆయన నోటి నుంచి మాట రాకుండా చేశారు. చిరంజీవికి అవార్డు ప్రకటించగానే ప్రధాని మోదీతో పాటు బీజేపీ అగ్రనేతలు వరుసగా శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు సినిమా పరిశ్రమ కంటే బీజేపీ నేతలు ట్విట్లు, అభినందనలతో చిరంజీవిని ఆకాశానికెత్తేశారు. అవార్డు ప్రదానోత్సవం గోవాలో నిర్వహించారు. అవార్డు గ్రహీత చిరంజీవితో పాటు బీజేపీ సానుభూతిపరులైన బాలివుడ్ అగ్ర కథానాయకులతో పాటు ప్రముఖులు హాజరయ్యారు. ఆ ఆనంద సమయంలో చిరంజీవి నుంచి సానుకూలత వస్తుందని అనుకున్నారో ఏమో కానీ మంత్రి అనురాగ్ ఠాగూర్ చిరంజీవిని ఒక ప్రశ్న అడిగేశారు. సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చినట్టే రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఎప్పుడని అడిగేశారు.

Megastar Chiranjeevi- BJP
అయితే అనురాగ్ ఠాగూర్ ఉద్దేశ్యం అందరికీ తెలిసిందే, సినిమాల్లో రెండో సారి ఎంట్రీతో సక్సెస్ అయినట్టే.. పొలిటికల్ గా ఎంట్రీ ఇస్తే సక్సెస్ తప్పదని చిరంజీవికి ఆశ కల్పించారు. అందునా గత కొంతకాలంగా చిరంజీవిని బీజేపీ ద్వారా ఎంట్రీ ఇవ్వాని అగ్రనాయకులు ప్రయత్నించిన తరుణంలో అనురాగ్ ఠాగూర్ ప్రశ్నించేసరికి…చిరంజీవి నుంచి ఎటువంటి మాట వస్తుందా? అని అందరు ఆసక్తిగా ఎదురుచూశారు. బీజేపీ హైకమాండ్ ఇచ్చిన ఆఫర్ పై సానుకూలంగా స్పందన వస్తుందని అంతా భావించారు. కానీ చిరంజీవి ఆఫర్లకు టెంప్ట్ కాలేదు సరికదా. స్ట్రయిట్ గా సమాధానం చెప్పారు. తాను పొలిటికల్ గా రీఎంట్రీ ఇచ్చే అవకాశమే లేదని తేల్చేశారు. ప్రాణమున్నంతవరకూ సినిమా రంగానికే అంకితమని ప్రకటించారు. పది సంవత్సరాలు సినిమా రంగానికి దూరమై రాజకీయాల్లోకి వెళ్లానని.. ఎంతో మిస్సయ్యానని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. దీంతో బీజేపీ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. చిరంజీవిని ఎలాగోలా బుట్టలో వేసుకోవాలన్న ప్రయత్నాలు వర్కవుట్ కాలేదు. సాక్షాత్ ప్రధాని మోదీ మంచిగా దువ్వే ప్రయత్నం చేసినా.. అదే మంచితనంతో చిరంజీవి కూడా తిరస్కరించారు.
అయితే చిరంజీవి పొలిటికల్ గా యాక్టివ్ గా లేకున్నా సోదరుడు పవన్ కు అనుకూలంగా మాట్లాడుతున్నారు. భవిష్యత్ లో జనసేన ఉన్నత స్థానానికి వెళుతుందని కూడా భావిస్తున్నారు. చాలా సందర్భాల్లో కూడా చెప్పుకొస్తున్నారు. దీంతో అధికార వైసీపీ కూడా చిరంజీవిని దూరం పెట్టడం ప్రారంభించింది. అయినా చిరంజీవి లైట్ తీసుకుంటున్నారు. జనసేనతో పాటు పవన్ పట్ల సానుకూలంగా మాట్లాడుతున్నారు. ఇప్పటికే మెగా అభిమానులంతా జనసేన గూటికి చేరుతున్నారు. కానీ బీజేపీ మాత్రం చిరంజీవిపై చాలా హోప్స్ పెట్టుకుంది. చిరంజీవిని తమ పక్కకు తిప్పుకుంటే ఏపీలో బీజేపీని బలమైన ఫోర్స్ గా మార్చుకోవచ్చని హైకమాండ్ భావించింది. ఇప్పటికే పవన్ మిత్రపక్షంగా ఉన్నా..బీజేపీ మాత్రం సొంతంగా ఎదగాలని చూస్తోంది. అందుకే పవన్ ను బీజేపీలో విలీనం చేయాలని కోరినట్టు వార్తలు వచ్చాయి. అది వర్కవుట్ కాకపోయేసరికి చిరంజీవిని రంగంలోకి దించాలన్న ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఆ వ్యూహం సైతం బెడిసి కొట్టింది.

Megastar Chiranjeevi- BJP
వాస్తవానికి చిరంజీవి కోసం బీజేపీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. గత ఎన్నికల్లో రెండోసారి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావడంతో ఏపీలో ఏంచేయాలన్న దానిపై పునరాలోచన చేసింది. అప్పటి నుంచే చిరంజీవిపై ఫోకస్ పెంచింది. చరిష్మ ఉన్న హీరో.. ఆపై పీఆర్పీలో 60 లక్షలకుపైగా ఓట్లు సాధించిన విషయాన్ని గుర్తుచేస్తూ.. చిరంజీవిని బీజేపీలోకి తెస్తే బలమైన కాపు సామాజికవర్గంతో పాటు మెగా అభిమానులు తోడవుతారని అంచనా వేసింది. అదే లెక్కలు వేసుకొని సోదరుడు పవన్ కళ్యాణ్ తో చేతులు కలిపింది. క్రమేపీ చిరంజీవి కూడా దగ్గరైతే అధికార వైసీపీకి దీటుగా ప్రతిపక్ష పాత్ర పోషించవచ్చని బీజేపీ హైకమాండ్ నేతలు భావించారు. కానీ చిరంజీవి సున్నితంగా తిరస్కరించి బీజేపీ నేతల అంచనాలు,ఆశలను తారుమారు చేశారు.