BJP vs BRS: బీఆర్‌ఎస్‌ను భయపెడుతున్న బీజేపీ.. గండి కొట్టేది ఆ పార్టీ అభ్యర్థులే!

ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.. తెలంణలో బీఆర్‌ఎస్‌ వ్యతిరేక ఓట్లు.. దాదాపుగా కాంగ్రెస్‌వైపు మళ్లే అవకాశం కనిపిస్తోంది. గత ఎన్నికల్లో మహాకూటమిగా కాంగ్రెసై బరిలో దిగింది.

  • Written By: Raj Shekar
  • Published On:
BJP vs BRS: బీఆర్‌ఎస్‌ను భయపెడుతున్న బీజేపీ.. గండి కొట్టేది ఆ పార్టీ అభ్యర్థులే!

BJP vs BRS: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల యుద్ధం మూడు ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీగా సాగుతోంది. సర్వేలు బీఆర్‌ఎస్‌కు మొగ్గు చూపుతుండగా, మౌత్‌టాక్‌.. కాంగ్రెస్‌కు ఊపి తెస్తోంది. మరోవైపు బీజేపీ తగ్గేదేలే అంటోంది. దీంతో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్లో త్రిముఖ పోరు తప్పేలా లేదు. దీంతో మూడు పార్టీల్లో ఏ పార్టీ ఎవరి ఓట్లకు గండి కొడుతుందో అన్న ఆందోళన కనిపిస్తోంది. ప్రధానంగా అధికార బీఆర్‌ఎస్‌కు ఈ టెన్షన్‌ మరింత ఎక్కువగా ఉంది.

కాంగ్రెస్‌వైపే వ్యతిరేక ఓట్లు..
ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.. తెలంణలో బీఆర్‌ఎస్‌ వ్యతిరేక ఓట్లు.. దాదాపుగా కాంగ్రెస్‌వైపు మళ్లే అవకాశం కనిపిస్తోంది. గత ఎన్నికల్లో మహాకూటమిగా కాంగ్రెసై బరిలో దిగింది. టీడీపీ, టీజేఎస్, వామపక్షాలు కలిసి రావడంతో నాడు తెలంగాణ ఓటర్లు బీఆర్‌ఎస్‌వైపే మొగ్గు చూపారు. బీజేపీ ఓట్లు కూడా ఎక్కువగా బీఆర్‌ఎస్‌కు పోలయ్యాయి. కానీ ఇప్పుడు బీఆర్‌ఎస్‌ వ్యతిరేక ఓట్లు దాదాపుగా కాంగ్రెస్‌వైపు మళ్లుతాయని అంచనా వేస్తున్నారు.

గండి కొట్టేది బీజేపీనే..
ఇక బీజేపీకి తెలంగాణలో ప్రత్యేమైన ఓటు బ్యాంకు ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 7 శాతం ఓట్లు బీజేపీకి పోలయ్యాయి. ఇందుకు కారణం, కాంగ్రెస్‌ వ్యతిరేక ఓట్లతోపాటు బీజేపీ ఓట్లు కూడా బీఆర్‌ఎస్‌కే పోలయ్యాయి. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. ఈ ఎన్నికల్లో ఏకంగా 27 శాతం ఓట్లతోపాటు 4 ఎంపీ స్థానాలు గెలిచింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నాటికి బీజేపీ ఓట్ల శాతం 37కు పెరిగింది. 48 కార్పొరేట్‌ స్థానాలు నెగ్గింది. దుబ్బాక, హుజూరాబాద్, నాగార్జునసాగర్, మునుగోడులో బీజేపీ ఓటు బ్యాంకు బాగా పెరిగింది. దీంతో వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓట్లు చీల్చేది బీజేపీనే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

త్రిముఖ పోరుతో బీజేపీకే లబ్ధి..
ఇత తెలంగాణలో ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే 30 నుంచి 40 స్థానాల్లో త్రిముఖ పోరు తప్పేలా లేదు. ఈ స్థానాల్లో బీఆర్‌ఎస్‌ ఓట్లను బీజేపీ చీలుస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కామారెడ్డిలో బీఆర్‌ఎస్‌ వ్యతిరేక ఓట్లను చీల్చడం ద్వారా కాంగ్రెస్‌ గెలిచే అవకాశం ఉందని అంటున్నారు. కేసీఆర్‌కు ఇక్కడ పరాభవం తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలా ఉత్తర తెలంగాణలో 15 స్థానాలు, దక్షిణ తెలంగాణలో 10 నియోజకవర్గాలు, గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 5 నుంచి 10 స్థానాల్లో బీజేపీ ప్రభావం ఉంటుందని తెలుస్తోంది. ప్రభుత్వ వ్యతిరే ఓట్లు కాంగ్రెస్‌వైపు మళ్లి, బీఆర్‌ఎస్‌ ఎట్లను బీజేపీ చీలిస్తే.. తీవ్రంగా నష్టపోతామని గులాబీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు.

Read Today's Latest Telangana politics News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు