Jithender Reddy Open Heart With RK: ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే: కెసిఆర్ కోసమే బండి సంజయ్ ని మార్చారా? నీళ్లు నమిలిన జితేందర్ రెడ్డి
“పార్టీ అన్నాకా ఒడిదుడుకులు సహజం.. దీనికి భారతీయ జనతా పార్టీ అతీతం కాదు. దీనిని భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు. బండి సంజయ్ మూడు సంవత్సరాల పాటు అధ్యక్షుడిగా పని చేశారు. ఆయన టర్మ్ అయిపోయింది కాబట్టి కొత్త అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమించారు.

Jithender Reddy Open Heart With RK: తెలంగాణ మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా గత నాలుగు రోజుల నుంచి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ని మార్చిన ఉదంతం చర్చ నీయాంశంగా మారింది. దీనికి తోడు ఆ పార్టీలో నాయకులు రోజుకు ఒక రకంగా మాట్లాడుతుండడం, బండి మార్పు వెనుక కేసీఆర్ ఉన్నట్టు ప్రచారం జరుగుతుండడం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ బిజెపి సీనియర్ నాయకుడు జితేందర్ రెడ్డిని ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా గత కొంతకాలంగా భారతీయ జనతా పార్టీలో చోటుచేసుకుంటున్న పరిస్థితుల గురించి ఆయనదైన శైలిలో జితేందర్ రెడ్డిని ప్రశ్నించారు. పలు కీలకమైన ప్రశ్నలు సంధించి.. వాటికి సమాధానాలు రాబట్టారు.
ఒడిదుడుకులు సహజం
“పార్టీ అన్నాకా ఒడిదుడుకులు సహజం.. దీనికి భారతీయ జనతా పార్టీ అతీతం కాదు. దీనిని భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు. బండి సంజయ్ మూడు సంవత్సరాల పాటు అధ్యక్షుడిగా పని చేశారు. ఆయన టర్మ్ అయిపోయింది కాబట్టి కొత్త అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమించారు. ఇందులో ఎటువంటి అతిశయోక్తి లేదు..” కథ కొంతకాలంగా పార్టీలో చోటు చేసుకున్న పరిస్థితులపై జితేందర్ రెడ్డి చెప్పగా.. వేమూరి రాధాకృష్ణ స్పందించారు.” మీరు నీళ్లు నమిలినప్పుడే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతున్నది. దీనికి కొత్తగా మినహాయింపులు ఇవ్వాల్సిన అవసరం లేదు.” అని ఆర్కే చెప్పగానే జితేందర్ రెడ్డి ఒక నవ్వు నవ్వారు. దీనిని ఆర్కే మరింత లాగే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తోంది. మరోవైపు కిషన్ రెడ్డిని నియమించింది కేసీఆర్ కోసమే కదా అని ఆర్కే ప్రశ్నిస్తే జితేందర్ రెడ్డి, మౌనాన్ని ఆశ్రయించారు. గతంలో కేసీఆర్ మోదిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేవాడు. ఇప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు అని ఆర్కే ప్రశ్నిస్తే.. “నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడితే బొక్కలో వేస్తామని బెదిరించాడు. అందుకే కేసీఆర్ మోదీని విమర్శించడం లేదని” జితేందర్ రెడ్డి మరో మాటకు తావు లేకుండా బదులిచ్చాడు.
ఇప్పుడు బాగానే ఉన్నాయి
మీకు రేవంత్ రెడ్డి ఫోన్ చేసి కాంగ్రెస్ లోకి రావాలి అని ఆహ్వానించారు? ఇది నిజమే కదా? అని ఆర్కే జితేందర్ రెడ్డిని ప్రశ్నిస్తే.. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ హవా నడుస్తోంది అనడం కంటే .. దానికి బలుపు మాత్రమే పెరిగింది.. అది వాపు అనుకుంటే ఎవరూ ఏమీ చేయలేరు. రేవంత్ రెడ్డి ది హవా మాత్రమే అని కొట్టి పారేసిన జితేందర్ రెడ్డి.. వాడు నాకు ఎట్టి పరిస్థితుల్లో ఫోన్ చేయడు అంటూ కుండ బద్దలు కొట్టారు.. తనకు ఎంతో విలాసవంతమైన ఫామ్ హౌస్ లు ఉన్నాయని జితేందర్ రెడ్డి చెప్పగా.. ఆ ఫామ్ హౌస్ లోనే కదా ఈటెలకు వ్యతిరేకంగా మాట్లాడింది అని ఆర్కే కౌంటర్ ఇచ్చారు.. ఇప్పుడు అందరం బాగానే ఉన్నామని జితేందర్ రెడ్డి బదులిచ్చారు..ఇలా హాట్ హాట్ గా సాగిన ఇంటర్వ్యూ ప్రోమో ప్రస్తుతానికి విడుదలైంది. పూర్తి ఎపిసోడ్ ఈ ఆదివారం ప్రసారం అవుతుంది.
