BJP : సౌత్ లో నమ్మదగిన మిత్రుడు ఆయనేనట.. ఫిక్సవుతున్న బీజేపీ
ఇప్పుడున్న పరిస్థితుల్లో దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి నమ్మదగిన మిత్రుడు ఏపీ సీఎం జగన్ గా ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం ఆయన కాంగ్రెస్ కు వ్యతిరేకి కావడమే. కాంగ్రెస్ ను బీజేపీ ఎంత ద్వేషిస్తుందో… జగన్ కూడా అంతే ద్వేషిస్తారు.

CM Jagan – BJP : కర్నాటక ఎన్నికల్లో ఓటమితో బీజేపీలో అంతర్మథనం ప్రారంభమైంది. వచ్చే సార్వత్రిక ఎన్నికలను టార్గెట్ చేసుకొని బీజేపీ కీలక నిర్ణయాలు దిశగా అడుగులేస్తున్నట్టు తెలుస్తోంది. ఒక వేళ మెజార్టీ మార్కుకు కూతవేటు దూరంలో నిలిచిపోతే ఏంచేయాలి? అనేదానిపై సీరియస్ గా ఆలోచన ప్రారంభించినట్టు సమాచారం. ఉత్తరాది రాష్ట్రాల్లో పర్వాలేకున్నా.. దక్షిణాది రాష్ట్రాల విషయంలో ఏంచేయాలి? అనేదానిపై పోస్టుమార్టం చేస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా నమ్మదగిన నాయకులు ఎవరు? మధ్యలో హ్యాండిచ్చేది ఎవరు? అన్నదానిపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.
కేసీఆర్ కాంగ్రెస్ వైపు..
తెలంగాణలో కేసీఆర్ పై గట్టిగా పోరాడుతున్న క్రమంలో ఆయన బీజేపీ వైపు వచ్చే చాన్సే లేదు. గతంలో కేసీఆర్ కాంగ్రెస్ తో కలిసి పనిచేసిన సందర్భాలున్నాయి. యూపీఏ గవర్నమెంట్ లో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. అటు తెలంగాణ ఇచ్చిన క్రెడిట్ కాంగ్రెస్ పై ఉండడంతో ఒక వేళ ఆలోచన చేస్తే కేసీఆర్ ఆ పార్టీ వైపే మొగ్గుచూపే చాన్స్ ఉంది. ఈ ఏడాది చివర్లో తెలంగాణ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటివరకూ బీఆర్ఎస్ కు పోటీ తామేనంటూ బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలో రెండు పార్టీల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. అదే కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే కేసీఆర్ కు ఆ స్థాయిలో వ్యతిరేక ధోరణి లేదు. అందుకే కేసీఆర్ బీజేపీ వైపు వెళ్లే చాన్సేలేదు.
చంద్రబాబును నమ్మలేం..
చంద్రబాబు విషయానికి వస్తే అవసరం కోసం ఎంతకైనా తెగిస్తారని బీజేపీ అనుమానిస్తోంది. ఒక వేళ పొత్తులో భాగంగా టీడీపీకి ఎక్కువ ఎంపీ సీట్లు వస్తే అయినదానికి కానిదానికి బేరం పెడతారని భావిస్తోంది. యూపీఏకు అనుకూల వాతావరణం ఏర్పడితే అటువైపు చూసినా ఆశ్యర్యపోనవసరం లేదని బీజేపీ పెద్దలు భావిస్తున్కనారు. గత ఎన్నికల ముందు చంద్రబాబు వ్యవహార శైలిని గుర్తుచేసుకుంటున్నారు. నిన్నటివరకూ వెంపర్లాడిన చంద్రబాబు కర్నాటక రిజల్డ్స్ తో వెనక్కి తగ్గడాన్ని కూడా ఉదహరిస్తున్నారు. అందుకే ఆయన నమ్మదగని మిత్రుడిగా భావిస్తున్నారు.
జగన్ ది కాంగ్రెస్ వ్యతిరేక స్టాండ్..
ఇప్పుడున్న పరిస్థితుల్లో దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి నమ్మదగిన మిత్రుడు ఏపీ సీఎం జగన్ గా ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం ఆయన కాంగ్రెస్ కు వ్యతిరేకి కావడమే. కాంగ్రెస్ ను బీజేపీ ఎంత ద్వేషిస్తుందో… జగన్ కూడా అంతే ద్వేషిస్తారు. తనను అకారణంగా జైలుపాలు చేసిందని.. సీబీఐ కేసులు నమోదుచేయించిందని ఇప్పటికీ జగన్ బాధపడుతుంటారు. చంద్రబాబు, కేసీఆర్ లా జగన్ కాంగ్రెస్ వ్యతిరేక స్టాండ్ మారదని బీజేపీ పెద్దలు నమ్ముతున్నారుట. దీంతో ఇపుడు బీజేపీ ముందు రెండు ఆప్షన్లు ఉన్నాయి. అందుకే ఏపీలో పొత్తుల విషయంలో బీజేపీ ఒక నిర్ణయానికి రాలేకపోతోంది. పొత్తులతో రెండు, మూడు సీట్లు తెచ్చుకోవడం కంటే.. జగన్ కు తెరవెనుక సాయమందించి ఎంపీ సీట్లను గెలిపించుకుంటే ప్రభుత్వ ఏర్పాటుకు పనికొస్తాడని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే అది ఎంతవరకూ వర్కవుట్ అవుతుందో చూడాలి మరీ.
