Amit Shah: తెలంగాణలో ఏదో పెద్ద ప్లానే చేస్తోన్న అమిత్ షా
అమిత్‌షా ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానం ద్వారా ఆదివారం మధ్యాహ్నం 2.50 గంటలకు ఏపీలోని గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.

Amit Shah: బీజేపీ ఖమ్మం బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ‘రైతుగోస.. బీజేపీ భరోసా’ పేరిట ఖమ్మంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఈ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హాజరుకానున్నారు. ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ కాలేజీ మైదానంలో నిర్వహిస్తున్న ఈ సభలో అమిత్‌షా రైతు డిక్లరేషన్ ప్రకటించనున్నారు. తాము అధికారంలోకి వచ్చాక అన్నదాతల సంక్షేమానికి చేపట్టే కార్యక్రమాల గురించి ప్రకటన చేయనున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఈ సభ వేదికపైనుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. కాగా, పలు పార్టీలకు చెందిన నాయకులు అమిత్ షా సమక్షంలో బీజేపీ కండువా కప్పుకోనున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. సభ నేపథ్యంలో ఖమ్మంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఖమ్మం సభ మొదటిది కావడం విశేషం. ఈ సభకు లక్షమంది జనం హాజరవుతారని ఆ పార్టీ వర్గాల అంచనా వేసి, అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే కాకుండా సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల నుంచి జనసమీకరణ చేయనున్నారు.
ప్రత్యేక విమానం ద్వారా ఢిల్లీ నుంచి..
కాగా, అమిత్‌షా ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానం ద్వారా ఆదివారం మధ్యాహ్నం 2.50 గంటలకు ఏపీలోని గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 3.30 నిమిషాలకు ఖమ్మం చేరుకుంటారు. 3.40 గంటలకు ఖమ్మం సభకు చేరుకుని 3.45 నుంచి 4.35 పాటు సభలో పాల్గొంటారు. అనంతరం 4.40 గంటల నుంచి 5.30 వరకు వరకు పార్టీ రాష్ట్ర నేతలతో భేటీ అవుతారు. ఆ తర్వాత 5.45కు హెలికాప్టర్‌లో విజయవాడకు వెళ్లనున్నారు. మరోవైపు, అమిత్‌షా భద్రాచలం పర్యటన మరోసారి రద్దయింది. ఒకప్పుడు కమ్యూనిస్టుల కోటగా నిలిచిన ఖమ్మం నగరంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కాలేజీ మైదానంలో భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలో నిర్వహిచే ఈ సభలో అమిత్‌షా రైతు డిక్లరేషన్ ప్రకటించనున్నారు. తాము అధికారంలోకి వచ్చాక అన్నదాతల సంక్షేమానికి చేపట్టే కార్యక్రమాల గురించి ఆయన ప్రకటన చేయనున్నారు. రాబోయే ఎన్నికల్లో పాగా వేయాలన్న లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ సభా వేదికగానే ఎన్నికల శంఖారావం కూడా పూరించనున్నారు.
బీ టీం ముద్ర చెరిపి వేసేందుకు..
కాగా గత కొద్ది రోజులుగా బీఆర్‌ఎస్, బీజేపీ బీటీం అన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఖమ్మంలో జరగనున్న ఈ సభకు మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. సభలో అమిత్‌షా ఎలాంటి ప్రకటనలు చేయబోతున్నారు. ఆయన ప్రసంగం ఎవరికి వ్యతిరేకంగా సాగనుందన్న అంశాలపై రాష్ట్ర ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ఈ సభ ద్వారా బీఆర్‌ఎస్, సీఎం కేసీఆర్ పట్ల తెలంగాణలో బీజేపీ వైఖరిపై అమిత్‌షా స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఖమ్మం సభ మొదటిదికావడం విశేషం. బీజేపీ వర్గాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ సభకు ఏర్పాట్లు చేశాయి. ఖమ్మం ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కాలేజీ మైదానంలో నిర్వహిస్తున్న ఈ సభకు లక్షమంది జనం హాజరవుతారని ఆ పార్టీ వర్గాల అంచనావేసి, అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు పూర్తి చేశారు. వర్షాకాలం నేపథ్యంలో బహిరంగ సభ నిరహణకు ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా మైదానంలో ప్రత్యేకంగా షెడ్లు ఏర్పాటు చేశారు. సభకు సంబంధించి జనసమీకరణ కోసం సుమారు వెయ్యి బస్సుల వరకు ఏర్పాటు చేశారు. వాటితోపాటుగా కార్లు, ట్రక్కులు, ట్రాలీ ఆటోల్లో జనాలను తరలించేందుకు బీజేపీ నాయకులు ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే కాకుండా సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల నుంచి జన సమీకరణ చేయనున్నారు. మాజీ ఎంపీ గరికపాటి మోహన్‌రావు పర్యవేక్షణలో బీజేపీ రాష్ట్ర నేతలు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, బీజేపీకి కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్య క్షుడు గల్లా సత్యనారాయణ, బిజెపి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుడు కె.వి.రంగా కిరణ్ ఆధ్వర్యంలో సభ ఏర్పాట్లు జరిగాయి. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తోపాటు పలువురు బీజేపీ నేతలు ఖమ్మం సభ జయప్రదం చేయాలని ఉమ్మడి జిల్లాలో పార్టీ కార్యకర్తలు సమావేశంలో పాల్గొన్నారు.
అమిత్‌షా పర్యటన ఇలా..
ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానం ద్వారా సోమవారం మధ్యాహ్నం 2.50గంటలకు గన్నవరం ఏయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో మధ్యాహ్నం 3.30నిమిషాలకు ఖమ్మం చేరుకుంటారు. 3.40గంటలకు ఖమ్మం ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ మైదానానికి చేరుకుని 3.45 నుంచి 4.35పాటు ఆయన సభలో పాల్గొంటారు. అనంతరం 4.40గంటల నుంచి 5.30వరకు వరకు రాష్ట్ర నేతలతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత హెలీకాప్టర్ ద్వారా విజయవాడ వెళ్తారు. అమిత్‌షా సభ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. అది వారం ఉదయం ట్రయిల్‌రన్ నిర్వహించారు.
