Bigg Boss 7 Telugu Voting: బిగ్ బాస్ ఊహించని నిర్ణయం… ఇక ఓటింగ్ మామూలుగా ఉండదు!
సినీ నటి షకీలా, హీరో శివాజీ , కొరియోగ్రాఫర్ సందీప్, సీరియల్ హీరో అమర్ దీప్ లాంటి వాళ్ళు హౌస్ లోకి వెళ్లారు. వాళ్లతో పాటు హీరో నవీన్ పోలిశెట్టి కూడా హౌస్ లోకి వెళ్లడం విశేషం.

Bigg Boss 7 Telugu Voting: తెలుగు లో సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న షో ఏమిటంటే బిగ్ బాస్ అనే చెప్పాలి. అసలు ఇలాంటి షో లు తెలుగులో ఆదరణకు నోచుకుంటాయా అనే అనుమానాలను పటాపంచలు చేస్తూ వరుసగా ఆరు సీజన్స్ ఒక ఒటిటి సీజన్ ను విజయవంతంగా పూర్తి చేసుకున్న తెలుగు బిగ్ బాస్ ఏడో సీజన్ ను గత ఆదివారం (సెప్టెంబర్ 3) మొదలుపెట్టింది. మొదటిరోజు హౌస్ లోకి 14 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు.
సినీ నటి షకీలా, హీరో శివాజీ , కొరియోగ్రాఫర్ సందీప్, సీరియల్ హీరో అమర్ దీప్ లాంటి వాళ్ళు హౌస్ లోకి వెళ్లారు. వాళ్లతో పాటు హీరో నవీన్ పోలిశెట్టి కూడా హౌస్ లోకి వెళ్లడం విశేషం. ఇక ముందు నుంచి చెపుతున్నట్లు ఏడో సీజన్ ఉల్టా – పల్టా గా ఉండబోతుంది. ఈ విషయం మొదటి రోజే ప్రేక్షకులకు దాదాపుగా అర్ధం అయ్యింది. గత సీజన్ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో ఈ సీజన్ ను సరికొత్తగా డిజైన్ చేసినట్లు తెలుస్తుంది.
ముఖ్యంగా ఓటింగ్ విషయంలో భారీ మార్పులు తీసుకు వచ్చారు. మొదటి నుండి బిగ్ బాస్ ఓటింగ్ మీద విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇందులో ఎక్కువగా ఫేక్ ఓటింగ్ జరుగుతుందని ప్రధాన వాదన. దానిని చెక్ పెట్టె కోణంలో సరికొత్త ఓటింగ్ విధానాన్ని తీసుకుని వచ్చింది బిగ్ బాస్ టీం. గతంలో ఓటింగ్ గూగుల్ ద్వారా జరిగేది. గూగుల్ లో Bigg Boss Telugu Vote అని టైప్ చేస్తే వచ్చే పేజ్‌లో తమకు నచ్చిన కంటెస్టెంట్లకు పది ఓట్లు వేసే అవకాశం కల్పించారు. ఆ తర్వాత దీన్ని మార్చి ‘డిస్నీ ప్లస్ హాట్‌స్టార్’ ఓటింగ్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చారు.
తాజాగా ఈ సీజన్ నుంచి ఒక్కో హాట్ స్టార్ యూజర్ కు కేవలం ఒక్క ఓటు మాత్రమే వేసే అవకాశాన్ని ఇచ్చింది బిగ్ బాస్ టీం. గతంలో మాదిరి నచ్చిన కంటెస్టెంట్ కు 10 ఓట్లు వేసే అవకాశం లేదు. కేవలం ఒక్క ఓటు మాత్రమే వేయాలి. ఇదే విషయాన్ని మొదటిరోజే నాగార్జున తెలియచేశాడు. దీంతో పీఆర్ టీం లు పెట్టుకొని హౌస్ లోకి వచ్చిన కంటెస్టెంట్స్ కు భారీ షాక్ అనే చెప్పాలి. హౌస్ లో సరైన గేమ్ ఆడినవాళ్ళే ఉంటారు, మిగతావాళ్ళు ఎలిమినేట్ కావడం ఖాయం అనే మాటలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ తీసుకొచ్చిన ఈ కొత్త ఓటింగ్ విధానం పై ప్రేక్షకుల నుంచి కూడా మద్దతు లభిస్తుంది
