Bigg Boss Telugu 7: బిగ్ బాస్ షో… ఆ కంటెస్టెంట్ కి తీవ్ర గాయాలు!
ఏది ఏమైనా ఫైనల్ గా మూడో పవర్ అస్త్ర గెలిచి కంటెండర్ అయ్యే అవకాశం ప్రియాంక, శోభా శెట్టికి దక్కింది. వీరిద్దరిలో గెలిచినవారు మూడో కంటెండర్ అవుతారు. యంత్రపు ఎద్దు మీద ఎక్కి ఎక్కువ సమయం క్రింద పడకుండా ఉన్నవారు విజేతలని బిగ్ బాస్ చెప్పాడు.

Bigg Boss Telugu 7: బిగ్ బాస్ హౌస్లో జీవితం అంత సులభం కాదు. మానసికంగా, శారీరకంగా శ్రమించాలి. ముఖ్యంగా ఫిజికల్ టాస్క్స్ లో గాయాలపాలయ్యే ప్రమాదం ఉంది. గతంలో కీర్తి భట్, సింగర్ శ్రీరామచంద్ర తో పాటు పలువురు ప్రమాదాలకు గురయ్యారు. తాజాగా కంటెస్టెంట్ శోభా శెట్టికి ప్రమాదం జరిగింది. మూడవ కంటెండర్ కోసం ప్రియాంక, శోభా శెట్టి, ప్రిన్స్ యావర్ పోటీపడ్డారు. ప్రిన్స్ యావర్ అనర్హుడని ప్రియాంక, శోభా శెట్టి నిర్ణయించడంతో అతడు గోల్డెన్ ఛాన్స్ కోల్పోయాడు. అసలు ప్రత్యర్థిని తొలగించే హక్కు ప్రత్యర్దులకు ఇవ్వడమేంటో అర్థం కాలేదు.
ఏది ఏమైనా ఫైనల్ గా మూడో పవర్ అస్త్ర గెలిచి కంటెండర్ అయ్యే అవకాశం ప్రియాంక, శోభా శెట్టికి దక్కింది. వీరిద్దరిలో గెలిచినవారు మూడో కంటెండర్ అవుతారు. యంత్రపు ఎద్దు మీద ఎక్కి ఎక్కువ సమయం క్రింద పడకుండా ఉన్నవారు విజేతలని బిగ్ బాస్ చెప్పాడు. ప్రియాంక, శోభా ఎక్కువ సమయం ఎద్దు మీద ఉండే ప్రయత్నం చేశారు. కాగా ఎద్దు కుదుపులకు శోభా శెట్టి కిందపడిపోయింది. దాంతో ఆమెకు గాయాలు అయ్యాయి.
ఆమె చేతికి గాయమైనట్లు తెలుస్తుంది. శోభా బాధతో అల్లాడుతుంటే తోటి కంటెస్టెంట్స్ ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆమెకు ఏ మేరకు గాయాలు అయ్యాయో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాలి. పవర్ అస్త్ర ఇద్దరిలో ఎవరు గెలిచారనే ఉత్కంఠ కూడా ఉంది. ప్రియాంక, శోభా శెట్టిలో ఎవరు గెలిచినా… పవర్ అస్త్రతో పాటు మూడు వారాల ఇమ్యూనిటీ లభిస్తుంది.
ఆట సందీప్, శివాజీ ఆల్రెడీ పవర్ అస్త్ర గెలిచారు. వీరికి ఇమ్యూనిటీ లభించింది. ఇక మూడో వారం పూర్తి కానుంది. వీకెండ్ కూడా వచ్చేసింది. ఈ ఆదివారం ఒకరు ఎలిమినేట్ కానున్నారు. మొదటి వారం కిరణ్ రాథోడ్, రెండవ వారం షకీలా ఎలిమినేట్ అయ్యారు. అమర్ దీప్, ప్రియాంక, దామిని, శుభశ్రీ, గౌతమ్ కృష్ణ, రతికా రోజ్, ప్రిన్స్ యావర్ నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు.
