Bigg Boss5: బుల్లితెరపై నంబర్ 1 రియాలిటీ షో ‘బిగ్ బాస్’. ప్రతి సంవత్సరం అనామకులైన వారిని సెలబ్రెటీలుగా మార్చేస్తూ అత్యధిక వ్యూయర్ షిప్ టీఆర్పీ రేటింగులు ఇది సాధిస్తోంది ఈ షో. ఈ సంవత్సరం కూడా రెడీ అయిపోయింది. ఈ ఆదివారం సెప్టెంబర్ 5 నుంచి స్టార్ మాటీవీలో బిగ్ బాస్ షో మొదలు కానుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో బిగ్ బాస్ మేనియా ఊపందుకుంది.
బిగ్ బాస్ లో ఇప్పటికే 16 మంది కంటెస్టెంట్లను ఖరారు చేసినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ జాబితాలో ప్రియ, నటరాజ్ మాస్టర్, అనీ మాస్టర్, శ్వేతా వర్మ, ఉమాదేవి, మానస్, షణ్ముఖ్, విజే సన్నీ, ప్రియాంక సింగ్, లోబో, శ్రీరామ్, ఆర్జే కాజల్, జశ్వంత్, లహరి, సిరి హనుమంతు, సరయు, విష్ణు ఉన్నట్టుగా దాదాపు ఒక నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం వీరందరూ క్వారంటైన్ లో ఉన్నట్టుగా సమాచారం.
మొదటి ఎపిసోడ్ లోనూ వీరందరూ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ కానున్నారు. ఇక వీరందరిలో కార్తీకదీపం ఫేమ్ ఉమాదేవి, అనీ మాస్టర్, షణ్ముఖ్ జశ్వంత్, యాంకర్ రవి, సీనియర్ ఆర్టిస్ట్ ప్రియ అత్యధిక పారితోషికం అందుకుంటున్న వారిలో ఉన్నట్టు తెలుస్తోంది. వీరందరికీ వారానికి రూ.40వేలకు పైగా అందుకుంటున్నారని టాక్. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.