Bigg Boss 7 Telugu: భుజాలు తడుముకున్న గుమ్మడికాయ దొంగలు… రతికకు అతడిపై గాలి మళ్లిందట!
గౌతమ్ ఒక వైపు గాలి ఎక్కువ మళ్లింది అని చెప్పాడు. రతిక రీ ఎంట్రీ తో హౌస్ లోకి వచ్చిన దగ్గర నుంచి ఎక్కువ యావర్ తోనే ఉంటుంది. కాబట్టి దానిని ఉద్దేశించి గౌతమ్ మాట్లాడడంతో పక్కనే ఉన్న యావర్ ఏయ్ అని మధ్యలోకి దూరాడు.

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 తొమ్మిదో వారం నామినేషన్స్ ప్రక్రియ ఆసక్తికరంగా సాగుతుంది. సోమవారం మొదలైన నామినేషన్ ప్రక్రియ ఈ రోజు కూడా కొనసాగుతుంది. దీనికి సంబంధించిన తాజా ప్రోమో లో ఎప్పుడూ హాట్ హాట్ గా సాగే నామినేషన్స్ లో ఫన్ జెనరేట్ చేశారు కంటెస్టెంట్స్. ఇందులో ముందుగా కెప్టెన్ గౌతమ్ కూల్ గా తన నామినేషన్ స్టార్ట్ చేశాడు. మొదటగా రతికని నామినేట్ చేశాడు. టాస్క్ పర్ఫామెన్స్ లో ఇంకా హౌస్ లో కలుపుగోలుతనం లో నువ్వు అంతగా కనిపించలేదు అని గౌతమ్ చెప్పాడు.దానికి రతిక నేను అందరితో సరిగా లేనా అని అడిగింది.
దానికి గౌతమ్ ఒక వైపు గాలి ఎక్కువ మళ్లింది అని చెప్పాడు. రతిక రీ ఎంట్రీ తో హౌస్ లోకి వచ్చిన దగ్గర నుంచి ఎక్కువ యావర్ తోనే ఉంటుంది. కాబట్టి దానిని ఉద్దేశించి గౌతమ్ మాట్లాడడంతో పక్కనే ఉన్న యావర్ ఏయ్ అని మధ్యలోకి దూరాడు. ‘గుమ్మడి కాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకోవడం అంటే ఇదే ‘ అంటూ సామెత వేశాడు గౌతమ్. దీంతో యావర్ ఇంకా రతిక తెగ నవ్వుకున్నారు.
తర్వాత అశ్విని,యావర్ ని నామినేట్ చేసింది. అసలు నీకు తెలుగొచ్చా .. అని అడిగింది. యావర్ అడ్డంగా తలూపాడు. మరి ఎందుకు వచ్చావ్ అంటూ ఫైర్ అయింది అశ్విని. నీ మాట కరెక్ట్ కాదు .. ఎందుకు వచ్చావ్ ఏంటి అంటూ యావర్, అశ్విని ని నిలదీసాడు. నేను బిగ్ బాస్ అని మెన్షన్ చేయలేదు కదా అంటూ కవర్ చేయడానికి ట్రై చేసింది. ఒక ఆడ పిల్లని చేసి నన్ను ఇక్కడ ఆడుకుంటున్నావ్ నాకు అర్ధమౌతుంది అంటూ సంబంధం లేకుండా వాదించింది అశ్విని.
ఆ తర్వాత గౌతమ్ తన సెకండ్ నామినేషన్ అమర్ దీప్ ని చేశాడు.గత వారం కెప్టెన్సీ రేస్ లో భాగంగా జరిగిన ‘ఫ్లోట్ ఆర్ సింక్’ టాస్క్ లో సంచాలక్ గా గౌతమ్ వ్యవహరించాడు. ఆ టాస్క్ లో అమర్ ఫౌల్ గేమ్ ఆడిన సంగతి తెలిసిందే. కాగా సంచాలక్ గా ఉన్న నన్ను కూడా నువ్వు మాన్యు ప్లేట్ చేయడానికి ట్రై చేశావు అంటూ పాయింట్ రైజ్ చేశాడు గౌతమ్. నిన్ను సంచాలక్ గా సెలెక్ట్ చేసుకుందే నేను రా .. అంటూ అమర్ కవర్ చేశాడు. చివర్లో అశ్విని ఇంకా యావర్ వాదించుకున్నారు. అసలు నువ్వు నా మైండ్ లోనే లేవు .. ఇది నా రివెంజ్ అంటూ అశ్విని ఇచ్చిపడేసింది.
Watch the Housemates get into heated debates filled with twists and turns, after the nominations in the Bigg Boss House. The housemates must make their choices and face the consequences. @iamnagarjuna @DisneyPlusHSTel https://t.co/wBhkufChiB
— Starmaa (@StarMaa) October 31, 2023
