Bigg Boss OTT: తెలుగు ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ అప్పుడే నామినేషన్ ప్రక్రియ మొదలైపోయింది. ఇప్పటికే 17 మంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించిన హోస్ట్ నాగార్జున కాస్త మసాలా దట్టించేలా పాత కంటెస్టెంట్లతోనే ప్రయోగాలు చేశారు. ఈ సారి గ్లామర్ డోస్ కాస్త అదిరిందనే చెప్పాలి. అందెగత్తెలు, హాట్ బ్యూటీలు హౌస్ లో కావాల్సినంత కంటెంట్ ఇస్తున్నారు.
మొదటి రోజు నుంచే అరియానా, ముమైత్ ఖాన్ లో ప్రేమలు ఒలకబోస్తున్నారు. వివాదాలు రాజేస్తున్నారు. తేజస్విని , సరయూల హాట్ అందాలు మురిపిస్తున్నాయి. అయితే ఈ వీకెండ్ ముగియడంతో నామినేషన్ ప్రక్రియ మొదలైంది. మొత్తం 17 మందిలో ఈసారి సెలబ్రెటీలే తొలివారం నామినేట్ కావడం విశేషం.
బిగ్ బాస్ మొదలై వారం గడవకముందే తొలి వారంలో హాట్ బ్యూటీలు, వివాదాస్పద ప్రముఖులు నామినేట్ అయ్యారు. తొలి వారంలో సరయూ, ముమైత్ ఖాన్, అఖిల్, హమీద, నటరాజ్ మాస్టర్, అరియానాలు నామినేట్ అయ్యారు.
ఈ ఆరుగురిలో అత్యంత డేంజర్ జోన్ లో సరయూ, నటరాజ్ మాస్టర్, ముమైత్ ఖాన్ ఉన్నారు.వీరిలో సరయూ లాంటి హాట్ బ్యూటీని ఇదివరకే తెలుగు బిగ్ బాస్ లో మిస్ అయ్యారు. ఈసారి ఆమెను పంపిచే సాహసం చేయకపోవచ్చు. ఇక ముమైత్ లాంటి ఐటెం బాంబ్ ను వివాదాల కోసం మరికొద్దిరోజులు ఉంచొచ్చు. ఈ క్రమంలోనే అంతగా పర్ ఫామెన్స్ కంటెంట్ ఇవ్వని నటరాజ్ మాస్టర్ ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ కావచ్చని సోషల్ మీడియా ట్రెండ్స్ ను బట్టి అర్థమవుతోంది. మరి వచ్చే వారం వరకూ ఆ ఎలిమినేట్ ఎవరు అవుతారన్నది తేలనుంది.