Bigg Boss Non Stop: ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’లో కూడా రోజురోజుకు ఎమోషనల్ రివెంజ్ డ్రామాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా కంటెస్టెంట్ లు బ్యాచ్ లుగా విడిపోయి మరి పగలు ప్రతీకారాలు తీర్చుకుంటున్నారు. అసలు బిగ్ బాస్ అంటేనే గొడవలకు పుట్టినిల్లు, ఘాటు ప్రేమలకు మెట్టినిల్లు లాంటిది. పైగా ఇది ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ అయ్యే. మరి ఘాటు వ్యవహారాలు, మోటు సరసాలు లేకుండా ఎలా ఉంటాయి.

Tejaswi Madivada
ఏది ఏమైనా ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ జనాలకు బాగా కనెక్ట్ అవుతుంది. దానికి తోడు హౌస్ లో భారీ టాస్క్ లు స్టార్ట్ అయ్యాయి. టాస్క్ లు స్టార్ట్ అవ్వడం అంటే.. ఒక విధంగా గొడవలకు పునాధులు వేయడం.. అలాగే ఎలిమినేషన్ కి గ్రాండ్ వెల్ కమ్ చెప్పడమే. మొత్తానికి ఐదో వారం తేజస్వి మదివాడ కూడా హౌస్ లో నుంచి బయటకు వచ్చేసింది
మరోపక్క తేజస్వి మదివాడ అసలు ఎలిమినేట్ ఎందుకు అయ్యింది ? అంటూ చాలామంది ఈ విషయాన్ని అంగీకరించలేక పోతున్నారు. సరే.. ఈ వ్యవహారం ఇలా ఉంటే హౌస్ నుంచి వచ్చేసిన తేజస్వి.. తాజాగా బిగ్ బాస్ బజ్ లో పాల్గొంది. ఈ సందర్భంగా యాంకర్ రవి దగ్గర హౌస్‌మేట్స్ పై తన అభిప్రాయాలతో పాటు బాధ పడిన విషయాలు కూడా చెప్పి ఎమోషనల్ అయ్యింది.
ఇంతకీ తేజస్వి ఎవరి గురించి ఏమి చెప్పింది అంటే.. అఖిల్ ని హీరో అంది, స్రవంతిని ఇక మిర్చి అంది, మిత్ర కాకరకాయ అని, నటరాజ్ మాస్టర్ ను రాడ్ అంది. అలాగే అనిల్ ను కేటుగాడు అని అంది. ఇక తనకు తుపాకీతో ఎవరిని అయినా లేపేసే ఛాన్స్ వస్తే.. క్షణం కూడా ఆలోచించుకోకుండా నటరాజ్ మాస్టర్ ను లేపేస్తాను అంటూ చెప్పింది.
కారణం.. నటరాజ్ మాస్టర్ ను ఒక తండ్రిగా భావిస్తే.. అతను తన పట్ల కఠినంగా ఉన్నాడు అని ఆమె చెప్పుకొచ్చింది. అందుకే.. నటరాజ్ లాంటి తండ్రి తనకు వద్దంది తేజస్వి. ఇక పనిలో పనిగా పక్కనవాళ్లను తొక్కుకుంటూ పోయే వ్యక్తులు కూడా తనకు అస్సలు నచ్చరంటూ హీరోయిన్ బిందుమాధవి ఫొటోను చించి పక్కన పడేసింది.