Bigg Boss 6 Telugu TRP Rating: బిగ్ బాస్ తెలుగు హిస్టరీ లో ఈ సీజన్ కి వచ్చినంత తక్కువ TRP రేటింగ్స్ ఇంతకు ముందు ఎప్పుడూ కూడా రాలేదని చెప్పొచ్చు..ముందు సీజన్స్ తో పోలిస్తే ఈ సీజన్ పెద్ద ఫ్లాప్..అయితే టాస్కులలో అనూహ్యమైన మార్పులు మరియు ఆసక్తికరంగా టాస్కులను మలచడం లో బిగ్ బాస్ గత కొద్దివారాల నుండి సఫలీకృతం అవుతూ వస్తున్నాడు..అందుకే ఈమధ్య TRP రేటింగ్స్ పర్వాలేదు అనే రేంజ్ లో వస్తున్నాయి కానీ..గత సీజన్స్ తో పోలిస్తే మాత్రం చాలా తక్కువ..ముందు సీజన్స్ లో ప్రారంభ ఎపిసోడ్ కి 15 కి పైగానే TRP రేటింగ్స్ వచ్చేవి.

Bigg Boss 6 Telugu TRP Rating
కానీ ఈ సీజన్ ప్రారంభ ఎపిసోడ్ కి మాత్రం కేవలం 7.5 రేటింగ్స్ మాత్రమే వచ్చాయి..అలా ఈ సీజన్ కి రేటింగ్స్ పడిపోవడానికి కారణం హోస్ట్ అని అంటున్నారు విశ్లేషకులు..సీజన్ 3 నుండి సీజన్ 6 వరుకు అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ వచ్చాడు..ప్రేక్షకులు నాగార్జున ని చూసి చూసి బాగా బోర్ ఫీల్ అయ్యారని విశ్లేషకుల అభిప్రాయం.
అందుకే తదుపరి సీజన్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని రంగం లోకి దించబోతున్నట్టు తెలుస్తుంది..బిగ్ బాస్ సీజన్ 1 కి జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు..ఈ సీజన్ బంపర్ హిట్ అయ్యింది..ఆ తర్వాత వచ్చిన సీజన్స్ అన్నీ ఒకదానిని మించి ఒకటి సూపర్ హిట్ అవుతూ వచ్చాయి..కానీ సీజన్ 6 కి చాలా నష్టాలు వాటిల్లిందని..హోస్ట్ ని మారిస్తే తదుపరి సీజన్ లో జనాల అటెన్షన్ ని బాగా గ్రాబ్ చెయ్యొచ్చని బిగ్ బాస్ టీం ఆలోచిస్తుందట..ఇక గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ని మాత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందట బిగ్ బాస్ టీం.

Bigg Boss 6 Telugu TRP Rating
ఈ ఎపిసోడ్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా హాజరు కాబోతున్నాడట..ఇదే వేదిక మీద తదుపరి సీజన్ కి వ్యాఖ్యాతగా జూనియర్ ఎన్టీఆర్ వ్యవహరించబోతున్నట్టు అధికారిక ప్రకటన కూడా చేయించబోతున్నారట బిగ్ బాస్ టీం..ఇదే ప్లాన్ తో ముందుకు పోతే మాత్రం బిగ్ బాస్ తదుపరి సీజన్ ఊహించినదానికంటే పెద్ద హిట్ అవుతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు.