Bigg Boss 7 Telugu Day 20 Highlights: బిగ్ బాస్ డే 20 హైలెట్స్… సందీప్ కి స్ట్రాంగ్ వార్నింగ్, మూడో కంటెండర్ ఎవరంటే?

కంటెస్టెంట్స్ కి కొత్త టాస్క్ ఇచ్చాడు,టాస్క్ ఏంటంటే హౌస్ లో సేఫ్ ప్లేయర్ ఎవరు గేమ్ చేంజెర్, ఎవరు సేఫ్ ప్లేయర్ అని చెప్పమని నాగార్జున చెప్పగా ,ప్రిన్స్ కి గేమ్ చెంగేర్ నాలుగు బ్యాడ్జీలు ,తేజ కి సేఫ్ ప్లేయర్ గా నాలుగు బ్యాడ్జీలు వచ్చాయి .

  • Written By: Shiva
  • Published On:
Bigg Boss 7 Telugu Day 20 Highlights: బిగ్ బాస్ డే 20 హైలెట్స్… సందీప్ కి స్ట్రాంగ్ వార్నింగ్, మూడో కంటెండర్ ఎవరంటే?

Bigg Boss 7 Telugu Day 20 Highlights: వీకెండ్ వచ్చేసింది , నాగార్జున ఎంట్రీ ఇచ్చాడు ,రావడంతోనే ఫ్రైడే ఎపిసోడ్ స్క్రీన్ పై చూపించాడు. ఇక ఆలస్యం లేకుండా మన టీవీ అంటూ కంటెస్టెంట్స్ తో ఇంటరాక్ట్ అయ్యాడు . ఇక సంచాలక్ సందీప్ కి గట్టిగా తిట్లు పడ్డాయి . సంచాలక్ గా ఫెయిల్ అయ్యావని నాగ్ చెప్పారు . బుల్ టాస్క్ ఎవరు గెలిచి ఉంటారు అనుకుంటున్నావు అని సందీప్ ని అడిగాడు . ప్రియాంక పేరు చెప్పాడు సందీప్,కానీ పన్నెండు సెకెన్ల తేడా తో శోభా ,ప్రియాంక పై విజయం సాధించింది అని నాగార్జున చెప్పారు . సంచలక్ గా తన విధులు సరిగా అర్థం చేసుకోలేదు అని ఫెయిల్ అయ్యాడని సందీప్ పవర్ బ్యాటరీ డౌన్ చేసాడు నాగ్. పవర్ బ్యాటరీ గ్రీన్ నుంచి యెల్లో కి పడిపోయింది . పవర్ అస్త్ర సాధించిన శోభా మూడవ ఇంటి సభ్యురాలిగా తన స్థానాన్ని పదిలం పరుచుకుంది .

కంటెస్టెంట్స్ కి కొత్త టాస్క్ ఇచ్చాడు,టాస్క్ ఏంటంటే హౌస్ లో సేఫ్ ప్లేయర్ ఎవరు గేమ్ చేంజెర్, ఎవరు సేఫ్ ప్లేయర్ అని చెప్పమని నాగార్జున చెప్పగా ,ప్రిన్స్ కి గేమ్ చెంగేర్ నాలుగు బ్యాడ్జీలు ,తేజ కి సేఫ్ ప్లేయర్ గా నాలుగు బ్యాడ్జీలు వచ్చాయి . ప్రిన్స్ పై ప్రశంసల వర్షం కురిపించిన, తేజ కి వారం మొత్తం అంట్లు కడగాలి అని పనిష్మెంట్ ఇస్తాడు నాగార్జున .

ఇది ఇలా ఉండగా కంటెస్టెంట్స్ తో మాట్లాడుతూ వారు చేసిన తప్పులు గుర్తుచేస్తూ ఆటాడేసుకున్నాడు . అమరదీప్ ,గౌతమ్ ,మీ ఆట అసలు కనిపించలేదు అంటూ ఫైర్ అయ్యాడు . అమర్ నువ్వు ఆటలో అరటిపండు అంటూ సామెత వేసాడు . గౌతమ్ ,శోభా తో నీ గొడవ షో ఆఫ్ లా కనిపించింది అంటూ చురకలు అంటించాడు .ప్రశాంత్ ఏడిస్తే బిగ్ బాస్ కనుకరించడు ,ఆట ఆడి గెలవటం నేర్చుకోమని వార్నింగ్ ఇచ్చాడు . శుభశ్రీ ,దామిని గేమ్ ను ఇంప్రూవ్ చేసుకోవాలి అని సూచించాడు.

రతిక నువ్వు అసలు ఉన్నావా గేమ్ ఆడుతున్నావా అని నిలదీశారు . తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గుర్తొచ్చి గేమ్ పై ఫోకస్ చేయలేక పోయాను అని చెప్పుకొచ్చింది . ఎక్స్ అంటే పాస్ట్ ,దాని గురించి వదిలేయ్ పాస్ట్ గురించి ఆలోచిస్తే ప్రెసెంట్ ,ఫ్యూచర్ రెండు పోతాయి అని చాలా సున్నితంగా చెప్పాడు . ఇక నామినేషన్స్ విషయానికొస్తే సిల్లీ రీసన్స్ తో నామినెట్ చెయ్యొద్దు అని చెప్పారు . శనివారం ఎపిసోడ్ ఇలా ముగిసింది .

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు