Bigg Boss Vasanthi: సినిమాలు/సీరియల్స్ తో దూసుకుపోతున్న బిగ్ బాస్ బ్యూటీ వాసంతి.. పాపం వాళ్లిద్దరి కెరీర్ నాశనం!
బిగ్ బాస్ షో నుండి బయటకి రాగానే ఈమె స్టార్ మా ఛానల్ లో ప్రసారమైన ‘బీబీ జోడి’ ప్రోగ్రాం లో తన తోటి కంటెస్టెంట్ అర్జున్ కళ్యాణ్ తో కలిసి అద్భుతంగా డ్యాన్స్ చేసింది.ఈమెలో ఇంత టాలెంట్ ఉందా అని చూసిన ప్రతీ ఒక్కరు ఆశ్చర్యానికి గురయ్యారు.

Bigg Boss Vasanthi: తెలుగు బుల్లితెర పై సంచలనం సృష్టించిన రియాలిటీ షోస్ లో ఒకటి బిగ్ బాస్.ఈ రియాలిటీ షో ద్వారా ఎంతోమంది సెలెబ్రిటీలు బయటకి వచ్చి నేడు ఇండస్ట్రీ లో చేతినిండా అవకాశాలతో దూసుకుపోతున్నారు. అయితే ఆరవ సీజన్ అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయిన సంగతి మన అందరికీ తెలిసిందే.
కారణం ఏదైనా కానీ ఈ సీజన్ స్టార్ మా ఛానల్ కి భారీ గా నష్టాలను తెచ్చిపెట్టింది.కానీ ఈ సీజన్ పాల్గొన్న కంటెస్టెంట్ వాసంతి కి మాత్రం బిగ్ బాస్ చేసిన మేలు మామూలుది కాదు.ఈ షో లో పాల్గొనక ముందు ఈమె ఎవరో కూడా తెలుగు ప్రేక్షకులకు తెలియదు.కానీ బిగ్ బాస్ లో పాల్గొన్న తర్వాత ఈమెకి క్రేజ్ బాగా పెరిగిపోయింది.ఈ షో తర్వాత ఈమె డేట్స్ కోసం సినిమాలు మరియు సీరియల్స్ దర్శక నిర్మాతలు క్యూలు కట్టేస్తున్నారు.
బిగ్ బాస్ షో నుండి బయటకి రాగానే ఈమె స్టార్ మా ఛానల్ లో ప్రసారమైన ‘బీబీ జోడి’ ప్రోగ్రాం లో తన తోటి కంటెస్టెంట్ అర్జున్ కళ్యాణ్ తో కలిసి అద్భుతంగా డ్యాన్స్ చేసింది.ఈమెలో ఇంత టాలెంట్ ఉందా అని చూసిన ప్రతీ ఒక్కరు ఆశ్చర్యానికి గురయ్యారు.ఇక ఆ తర్వాత ఈమెకి ప్రస్తుతం స్టార్ మా ఛానల్ లో మంచి TRP రేటింగ్స్ తో దూసుకుపోతున్న ‘అవును..వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ అనే సీరియల్ లో హీరోయిన్ గా నటిస్తూ మంచి క్రేజ్ ని సంపాదించుకుంది.ఈ సీరియల్ లో ఆమె నటన చూసి అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కామెడీ టైమింగ్ తో పాటు ఎమోషన్స్ పలికించడం లో కూడా ఆమె ప్రేక్షకుల చేత శబాష్ అనిపించుకుంది.ఈమె రేంజ్ ఇలా ఉంటే టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిల్చిన శ్రీ సత్య కి మాత్రం చేతిలో ప్రస్తుతం ఎలాంటి సినిమాలు కానీ, సీరియల్స్ కానీ లేవు.
బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టకముందు ఈమె సీరియల్స్ లో పాపులర్ లేడీ విలన్ గా కొనసాగింది.ఆ సీరియల్స్ అన్నీ మధ్యలోనే వదులుకొని బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది, మంచి క్రేజ్ సంపాదించింది కానీ, అవకాశాలు మాత్రం రావడం లేదు.మరో పక్క ఇనాయ సుల్తానా పరిస్థితి కూడా ఇలాగే ఉంది.కానీ వాసంతి మాత్రం సినిమాల్లో కూడా అవకాశాలు సంపాదిస్తూ ముందుకు దూసుకుపోతుంది.
