Bigg Boss 7 Telugu Nominations : పనికిమాలిన నామినేషన్స్ తో కొనసాగుతున్న బిగ్ బాస్.. వీళ్లు ఇక మారరా

మొత్తానికి ఈ వారం నామినేషన్ లిస్ట్‌లో ఏడుగురు ఉన్నారు. 12 మంది కంటెస్టెంట్లలో ఆట సందీప్, శివాజీ ఇప్పటికే హౌస్ మెట్స్ కావడంతో వాళ్లకి 4 వారాల ఇమ్యూనిటీ ఉంది

  • Written By: Vishnupriya
  • Published On:
Bigg Boss 7 Telugu Nominations : పనికిమాలిన నామినేషన్స్ తో కొనసాగుతున్న బిగ్ బాస్.. వీళ్లు ఇక మారరా

Bigg Boss 7 Telugu Nominations : బిగ్ బాస్ సీజన్ సెవెన్.. రెండు వారాలు.. ఇద్దరు ఎలిమినేట్ ..అయిన తర్వాత మూడో వారం నామినేషన్లు నిన్న హాట్ హాట్ గా జరిగాయి. నిజం చెప్పాలి అంటే ప్రేక్షకులు శనివారం, ఆదివారం ఎపిసోడ్స్ కన్నా కూడా సోమవారం ఎపిసోడ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు.

ఒకరి ఒకరు ఎందుకు నాన్న చేస్తున్నారు అసలు ఆ ఇంట్లో ఉన్న వారు చేస్తున్న తప్పు లేనిది అనేది తెలిసేది సోమవారం ఎపిసోడ్ లోనే. అంతేకాదు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వారికి కూడా నామినేషన్ అనేది చాలా ముఖ్యమైన ప్రక్రియ. నామినేషన్ చేసేటప్పుడే మైండ్ ఎక్కువగా ఉపయోగించాల్సి ఉంటది. మరి బిగ్ బాస్ షో లో నామినేషన్ కి అంత ఇంపార్టెన్స్ ఉంది.

కాగా అలాంటి నామినేషన్స్ ని అల్లా టప్పా యవ్వారంగా చూస్తున్నారు ఈసారి బిగ్ బాస్ కంటెస్టెంట్స్. అంతెందుకు ప్రేక్షకులే కాదు ఈవారం కంటెస్టెంట్లు చెప్పిన రీజన్లు చూసి బిగ్‌బాస్‌కే చిరాకు వచ్చేసింది. ఫుడ్ బాలేదని.‌ వాటర్ ఇవ్వలేదని.. గిన్నెలు తోమ లేదని.. ఏవేవో ఎదవ కారణాలు చెబుతూ నామినేషన్లు చేశారు.

ముఖ్యంగా మన కార్తీక దీపం విలన్ మోనిత శుభశ్రీ ని నామినేట్ చేస్తూ చెప్పిన కారణం అందరినీ ఆశ్చర్యపరిచింది. నువ్వు హౌస్‌లో రోటీలు మాత్రమే చేస్తున్నావ్.. గిన్నెలు తోమడం లేదు.. పైగా రెండు వారాలుగా నామినేట్ కాలేదు.. కనుక చేస్తున్నాను అని చెప్పింది శోభా. అసలు ఇది ఒక కారణమా అంటూ నవ్వుతున్నారు సోషల్ మీడియా యూజర్స్.

ఇక మరొక కంటెస్టెంట్ ప్రియాంక.. నీ యాటిడ్యూట్ నచ్చలేదంటూ యావర్‌ను నామినేట్ చేసింది. ఆ తర్వాత ఇంటి పనులు ఏమీ చేయడం లేదంటూ గౌతమ్‌ను కూడా నామినేట్ చేసింది. ఇలా ఎంతసేపు ఇంటి పనుల పైన పడి నామినేట్ చేస్తున్నారు ఏమిటి అని ప్రేక్షకులు చిరాకుగా ఉన్న క్షణంలో రైతు బిడ్డ ప్రశాంత్ మరో విభిన్నమైన నామినేషన్ వేసి ఇంకొంచెం చిరాకు తెప్పించారు.

రైతు బిడ్డ ప్రశాంత్‌కి.. గత వారం తాను తొడ కొట్టడం నచ్చలేదని చెప్పినందుకు తేజను నామినేట్ చేస్తున్నట్లు చెప్పాడు. ఇది విని హౌస్ మేట్స్ అంతా నవ్వుకున్నారు. బిగ్‌బాస్ కూడా ప్రశాంత్ మీరు సరైన రీజన్ చెప్పాలని కలుగజేసుకున్నాడు. ఆ తర్వాత ఆలోచించి ఇంకో సిల్లీ రీజన్ చెప్పి తేజను నామినేట్ చేశాడు రైతు బిడ్డ. ఇలా అసలు అర్థం లేని కారణాలు చెబుతూ ఇంకా వీరు మారరా అని ప్రేక్షకులు అనుకునేటట్టు చేశారు.

మొత్తానికి ఈ వారం నామినేషన్ లిస్ట్‌లో ఏడుగురు ఉన్నారు. 12 మంది కంటెస్టెంట్లలో ఆట సందీప్, శివాజీ ఇప్పటికే హౌస్ మెట్స్ కావడంతో వాళ్లకి 4 వారాల ఇమ్యూనిటీ ఉంది. సో వాళ్లని ఎవరూ నామినేట్ చేసే అధికారం లేదు. ఇక బిగ్‌బాస్ ఇచ్చిన ట్విస్ట్‌తో ఊహించని విధంగా అమర్ దీప్ నామినేషన్ లిస్ట్‌లోకి వచ్చాడు. ఇక ఈవారం మీ మహానుభావుల్లో ఎవరు ఎలిమినేట్ అవుతారో వేచి చూడాలి.

Read Today's Latest Pratyekam News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు