Bigg Boss 7 Telugu: ఎపిసోడ్ హైలెట్స్… బయటపడ్డ గ్రూప్ రాజకీయాలు, రైతుబిడ్డ రేస్ నుండి అవుట్, తేజాకు పనిష్మెంట్!
మొదటగా బాల్స్ పట్టుకునే టాస్క్ ఇచ్చాడు. పైపు నుండి వస్తున్న బాల్స్ సేకరించి తమ వద్ద ఉన్న సంచిలో వేయాలి. ఈ టాస్క్ జరుగుతుండగానే మరొక టాస్క్ ఇచ్చాడు. జంపింగ్ జపాంగ్ అనే టాస్క్ లో ఇరు టీమ్స్ బెలూన్స్ ఊది.

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్లో మంగళవారం నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. అమర్ దీప్, అర్జున్, తేజ, ప్రియాంక, శోభా, భోలే, యావర్, రతిక నామినేట్ అయ్యారు. వీరిలో ఒకరు ఈ ఆదివారం ఇంటిని వీడనున్నారు. ఇక బుధవారం కెప్టెన్సీ టాస్క్ మొదలైంది. ఇంటి సభ్యులను బిగ్ బాస్ వీర సింహాలు, గర్జించే పులులుగా భిజించాడు. వీర సింహాలు టీమ్ లో యావర్, గౌతమ్, భోలే, రతిక, శోభా శెట్టి, తేజ ఉన్నారు. ఇక గర్జించే పులులు టీమ్ లో శివాజీ, అర్జున్, పల్లవి ప్రశాంత్, ప్రియాంక, అశ్విని ఉన్నారు.
మొదటగా బాల్స్ పట్టుకునే టాస్క్ ఇచ్చాడు. పైపు నుండి వస్తున్న బాల్స్ సేకరించి తమ వద్ద ఉన్న సంచిలో వేయాలి. ఈ టాస్క్ జరుగుతుండగానే మరొక టాస్క్ ఇచ్చాడు. జంపింగ్ జపాంగ్ అనే టాస్క్ లో ఇరు టీమ్స్ బెలూన్స్ ఊది. అక్కడ ఉన్న టైర్స్ లో ఫిట్ చేయాలి. ఏ టీమ్ ఎక్కువ బెలూన్స్ ని టైర్స్ లో ఫిట్ చేస్తుందో ఆ టీమ్ గెలిచినట్లు లెక్క. ఈ టాస్క్ లో వీరసింహాలు టీమ్ గెలిచింది. దీంతో వారికి ఒక పోస్ట్ వచ్చింది.
ఆ పోస్ట్ లో ప్రత్యర్థి టీం నుండి ఒకరిని పోటీ నుండి తొలగించే అవకాశం గెలిచిన వీర సింహాలు టీమ్ కి దక్కింది. గౌతమ్ తన టీమ్ తో డిస్కస్ చేసి… ప్రశాంత్ ని తప్పింద్దాం అన్నాడు. గౌతమ్ నిర్ణయం ప్రకారం ప్రశాంత్ ని గర్జించే పులులు టీమ్ నుండి తప్పించారు. అతని మెడలో డెడ్ బోర్డు వేశాడు. అతడు తన టీమ్ తరపున ఆడే అవకాశం కోల్పోయాడు. దీనికి పల్లవి ప్రశాంత్ చాలా బాధపడ్డాడు. నువ్వు చాలా స్ట్రాంగ్, నువ్వు గేమ్లో ఉంటే గెలవలేరని వాళ్ళు ఒప్పుకున్నారని శివాజీ ఓదార్చాడు.
ఇక హౌస్లో గ్రూప్ రాజకీయాలు జరిగాయి. శివాజీ, యావర్, రతిక, ప్రశాంత్ ఒక గ్రూప్ గా… అమర్, గౌతమ్, శోభా శెట్టి, అశ్విని ఒక గ్రూప్ గా ఏర్పడి ఒకరిపై మరొకరు చాడీలు చెప్పుకున్నారు. శివాజీ నన్ను జీరో చేశాడు. విలన్ గా చిత్రీకరించే ప్రయత్నం చేశాడని అమర్ తన గ్రూప్ తో అన్నాడు. శివాజీ కూడా అమర్ గురించి తన గ్రూప్ తో ఆరోపణలు చేశాడు. జాగ్రత్తగా ఆడాలి, ఓవర్ అగ్రెసివ్ కాకూడని యావర్, ప్రశాంత్ లకు సలహాలు ఇచ్చాడు.
ఇక నిద్రపోయిన తేజకు బిగ్ బాస్ పనిష్మెంట్ ఇచ్చాడు. అమ్మాయి గెటప్ ధరించాలని చెప్పాడు. శోభా అతడిని స్వయంగా అలంకరించింది. నేను అమ్మాయినే కాబట్టి అమ్మాయిలను హగ్ చేసుకుంటే తప్పులేదని లేడీ కంటెస్టెంట్స్ ని హగ్ చేసుకున్నాడు తేజ… ఇలాంటి ఆసక్తికర పరిణామాలతో బుధవారం ఎపిసోడ్ ముగిసింది…
