Bigg Boss 7 Telugu : నా జోలికొస్తే తొక్క తీస్తానన్న శివాజీ… నీకు ఆటం అర్థం కాలేదన్న గౌతమ్!

ఈసారి కెప్టెన్ ఎవరవుతారనే ఉత్కంఠ కొనసాగుతుంది. రెండు టీమ్స్ లో గెలిచిన టీం సభ్యులు కెప్టెన్సీ కంటెండరు రేసులో ఉంటారు.

  • Written By: NARESH
  • Published On:
Bigg Boss 7 Telugu : నా జోలికొస్తే తొక్క తీస్తానన్న శివాజీ… నీకు ఆటం అర్థం కాలేదన్న గౌతమ్!

Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ ఈ వారం ఇచ్చిన కెప్టెన్సీ లో హౌస్ మేట్స్ వీర సింహాలు,గర్జించే పులులు అంటూ రెండు టీమ్స్ గా డివైడ్ చేసిన సంగతి తెలిసిందే.నిన్నటి బాల్స్ కలెక్టింగ్ టాస్క్ ఈ రోజుకి కొనసాగుతుంది. అయితే బిగ్ బాస్ గోల్డెన్ బాల్ ఎవరి దగ్గర ఉంది చెప్పమని అడిగారు. దాంతో గౌతమ్ వీర సింహాలు టీం దగ్గర ఉంది అని చెప్పాడు.దాంతో టీం కి మరో స్పెషల్ పవర్ ఇచ్చాడు బిగ్ బాస్. మీ టీం లో ని ఒక వీకెస్ట్ పర్సన్ ని ఆపోజిట్ టీం లో నుంచి మీరు కోరుకున్న ఒకరితో స్వాప్ చేసుకోవచ్చు అని ట్విస్ట్ ఇచ్చారు. దీంతో వీర సింహాలు టీం అర్జున్ ని భోలే తో స్వాప్ చేసారు.

తర్వాత మళ్లీ గేమ్ మొదలైంది. అవతలి టీం కి దొరక్కుండా బాల్స్ ని అడ్డుకునే ప్రయత్నం చేశాడు అర్జున్. దీంతో అర్జున్ పైకి ఎక్కి మరీ ఆపాలని ట్రై చేసాడు అమర్ దీప్. ఇక ఈ రోజు టాస్క్ సమయం ముగిసింది. మీ దగ్గర ఉన్న బాల్స్ ని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి అని బిగ్ బాస్ చెప్పారు. ఇక తేజ ,అర్జున్ దగ్గరికి వెళ్లి వాళ్ళ బ్యాగులు,బంతులు ఎక్కడున్నాయో నీకు తెలుసు.. ఈ రోజు రాత్రి వాళ్ళు నిద్రపోకూడదు చెబుతున్న అని తేజ అన్నాడు.

తొక్క తీస్తా నా వాటి జోలికొస్తే ఎవరైనా అంటూ శివాజీ వార్నింగ్ ఇచ్చాడు. తర్వాత అమర్ దగ్గరున్న బాల్స్ కొట్టేయడానికి రతిక,యావర్,గౌతమ్ ట్రై చేసారు. దీంతో శివాజీ ఇలా అన్ ఫెయిర్ గేమ్ వద్దు అంటూ గౌతమ్ తో చెప్పాడు.కాగా గౌతమ్ అసలు ఇది అన్యాయం ఎలా అవుతుంది.. మీకు ప్రాసెస్ కంప్లీట్ గా అర్ధం కావట్లేదు అని అన్నాడు. నాకు అర్థం కావట్లేదా.. సరే తీసుకోండి.. నేను వదిలేస్తున్న ఇప్పుడు చెప్తున్నా నావి అక్కడే పెడతా తీసుకోండి అంటూ శివాజీ ఛాలెంజ్ చేశాడు.

తర్వాత తేజ శనివారం రోజు నేను నాగార్జున సార్ ని అడుగుతా ఇది గేమ్ సార్.. తీసుకోవచ్చా లేదా అని అడుగుతా అంటూ గౌతమ్ తో చెప్పాడు. అన్న ఇది ఫిక్స్ అంటూ శివాజీ అన్నాడు తేజ. శివాజీ మాత్రం ఏం మాట్లాడలేదు. ఈసారి కెప్టెన్ ఎవరవుతారనే ఉత్కంఠ కొనసాగుతుంది. రెండు టీమ్స్ లో గెలిచిన టీం సభ్యులు కెప్టెన్సీ కంటెండరు రేసులో ఉంటారు.

Read Today's Latest Pratyekam News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు