Bigg Boss 7 Telugu: టాస్క్లో పల్లవి ప్రశాంత్ తలకు గాయం… కుప్పకూలిపోయిన రైతుబిడ్డ!
కంటెస్టెంట్స్ వారి దగ్గర ఉన్న కాయిన్స్ పెంచుకోవడానికి ,వారి ప్రత్యర్థులను ఓడించాల్సి ఉంటుంది,ఆట పూర్తయ్యే సమయానికి ఎవరి దగ్గరైతే ఎక్కువ బీబీ కాయిన్స్ ఉంటాయో వారు నాలుగో పవర్ అస్త్ర కోసం పోటీ పడే కన్టెండర్ గా నిలుస్తారు అని చెప్పాడు బిగ్ బాస్ .

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 రసవత్తరంగా సాగుతోంది. ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా కొత్త కొత్త టాస్కులతో మెప్పిస్తున్నాడు బిగ్ బాస్ . ఇక ఈ వారం కూడా పవర్ అస్త్ర కోసం పోటీ పడటానికి కంటెస్టెంట్స్ సిద్ధంగా ఉన్నారు . ఇందులో భాగంగా ఈ వారం బిగ్ బాస్ ఇల్లు బ్యాంకు గా మారింది . కంటెస్టెంట్స్ కి కొత్త టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్ . ఆ వివరాలు చూస్తే ఇప్పుడు బిగ్ బాస్ ఇల్లు బ్యాంకుగా మారింది. బ్యాంకర్స్ గా ఆట సందీప్ , శివాజీ ,శోభా శెట్టి లు వ్యవహరిస్తారు అని చెప్పాడు .
కంటెస్టెంట్స్ వారి దగ్గర ఉన్న కాయిన్స్ పెంచుకోవడానికి ,వారి ప్రత్యర్థులను ఓడించాల్సి ఉంటుంది,ఆట పూర్తయ్యే సమయానికి ఎవరి దగ్గరైతే ఎక్కువ బీబీ కాయిన్స్ ఉంటాయో వారు నాలుగో పవర్ అస్త్ర కోసం పోటీ పడే కన్టెండర్ గా నిలుస్తారు అని చెప్పాడు బిగ్ బాస్ .
సమయానుసారంగా బిగ్ బాస్ ఇచ్చిన టాస్కల్లో ఆడి,గెలిచిన సభ్యుల కాయిన్స్ పెరుగుతాయి . ఈ క్రమంలో ముందుగా బజర్ రౌండ్ ఉంది . బజర్ ని అందరికంటే ముందుగా నొక్కిన కంటెస్టెంట్ కి తన ప్రత్యర్థిని ఎంచుకునే అవకాశం ఉంటుంది . కంటెస్టెంట్స్ అందరూ వరుసగా నించుని ,బజర్ నొక్కడానికి పరుగులు తీశారు . బజర్ ప్రెస్ చేయడానికి పోటీ పడ్డారు .
ముందు బజర్ నేను నొక్కా నేనే నొక్కాను అంటూ అమర్ రంకెలేశాడు .బజర్ ప్రెస్ చేయడానికి పరుగెత్తే క్రమంలో తోపులాట జరిగింది . పల్లవి ప్రశాంత్ గాయపడ్డాడు . దెబ్బ బాగా గట్టిగానే తగిలినట్లుంది . నొప్పి తట్టుకోలేక రైతు బిడ్డ ప్రశాంత్ కింద పడిపోయాడు . ట్రీట్మెంట్ కోసం మెడికల్ రూమ్ కి పంపించారు కంటెస్టెంట్స్ . పవర్ అస్త్ర పోరులో ఇంకా ఏమేమి జరగనున్నాయో. ఈ వారం పవర్ ఎవరికి దక్కనుందో చూడాలి. ఇప్పటికే సందీప్,శివాజీ ,శోభా శెట్టి ముగ్గురూ పవర్ అస్త్రాలు సాధించి ఇంటి సభ్యులుగా మారారు . ఇక నాలుగవ పవర్ అస్త్ర సాధించి హౌస్ మేట్ ఎవరు అవుతారనేది ఉత్కంఠగా మారింది.
