Bigg Boss 7 Telugu Nominations: 15వ రోజు హైలెట్స్… నామినేషన్స్ లో ఆ ఏడుగురు, వచ్చే వారం మరో టాప్ కంటెస్టెంట్ అవుట్?

బిగ్ బాస్ నామిషన్స్ ప్రక్రియ మొదలుపెట్టాడు. గార్డెన్ ఏరియాలోకి అందరు కంటెస్టెంట్స్ ని పిలిచారు. ప్రతి కంటెస్టెంట్ ఇద్దరిని నామినేట్ చేయాలి. కారణాలు చెప్పి నామినేట్ చేసిన కంటెస్టెంట్ ముఖానికి పోమ్ స్ప్రే చేయాలని చెప్పాడు.

  • Written By: SRK
  • Published On:
Bigg Boss 7 Telugu Nominations: 15వ రోజు హైలెట్స్…  నామినేషన్స్ లో ఆ ఏడుగురు, వచ్చే వారం మరో టాప్ కంటెస్టెంట్ అవుట్?

Bigg Boss 7 Telugu Nominations: ప్రతి సోమవారం బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్ ప్రక్రియ జరుగుతుంది. రెండు వారాలు ముగించుకున్న బిగ్ బాస్ షో మూడో వారంలోకి అడుగు పెట్టింది. ఫస్ట్ వీక్ 8 మంది నామినేట్ అయ్యారు. వారి నుండి కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయ్యింది. ఇక రెండో వారం 9 మంది నామినేట్ అయ్యారు. తక్కువ ఓట్లు తెచ్చకున్న షకీలా ఎలిమినేట్ కావడమైంది. ప్రస్తుతం హౌస్లో 12 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. శివాజీ, ఆట సందీప్ పవర్ అస్త్ర గెలిచారు. కాబట్టి వీరిని నామినేట్ చేయడానికి వీల్లేదు. మిగిలిన 10 మందిని నామినేట్ చేయాల్సి ఉంటుంది.

బిగ్ బాస్ నామిషన్స్ ప్రక్రియ మొదలుపెట్టాడు. గార్డెన్ ఏరియాలోకి అందరు కంటెస్టెంట్స్ ని పిలిచారు. ప్రతి కంటెస్టెంట్ ఇద్దరిని నామినేట్ చేయాలి. కారణాలు చెప్పి నామినేట్ చేసిన కంటెస్టెంట్ ముఖానికి పోమ్ స్ప్రే చేయాలని చెప్పాడు. మొదటగా ప్రియాంక జైన్ వెళ్ళింది. ప్రిన్స్ యావర్, గౌతమ్ లను నామినేట్ చేసింది. ప్రిన్స్ యావర్ ఆటిట్యూడ్ నచ్చడం లేదని ప్రియాంక కారణం చెప్పింది.

అనంతరం పల్లవి ప్రశాంత్ వెళ్ళాడు… అతడు కారణాలు చెప్పి దామిని, తేజాలను నామినేట్ చేశాడు. తేజాను నామినేట్ చేయడానికి పల్లవి ప్రశాంత్ చెప్పిన రీజన్ సరిగా లేదని బిగ్ బాస్ కూడా అభిప్రాయపడ్డారు. నెక్స్ట్ శోభా శెట్టి… శుభశ్రీ, రతికాలను నామినేట్ చేసింది. రతికా వలన హౌస్లో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని ఆమె ఆరోపించింది. ఇక అమర్ దీప్.. గౌతమ్, శుభశ్రీ లను నామినేట్ చేశాడు. శుభశ్రీ పనులు చేయడం లేదని అతడు కారణం చెప్పాడు.

రతికా రోజ్… శుభశ్రీ, గౌతమ్ లను నామినేట్ చేసింది. ప్రిన్స్ యావర్… ప్రియాంక, దామినిలను నామినేట్ చేశాడు. దామిని… ప్రిన్స్ యావర్, శుభశ్రీలను నామినేట్ చేయడం జరిగింది. గౌతమ్ కృష్ణ… రతికా, అమర్ దీప్ లను నామినేట్ చేశాడు. శుభశ్రీ… తేజా, ప్రియాంకలను నామినేట్ చేయడమైంది. అత్యధికంగా నామినేట్ చేయబడిన శుభశ్రీ, గౌతమ్, తేజా, ప్రియాంక, దామిని, రతికా రోజ్, ప్రిన్స్ యావర్ నామినేషన్స్ లో నిలిచారు.

ఈసారి పల్లవి ప్రశాంత్ నామినేషన్స్ నుండి తప్పుకున్నాడు. అమర్ దీప్, శోభా శెట్టి కూడా నామినేషన్స్ లో లేరు. మరి ఈ ఏడుగురిలో ఎవరు హౌస్ ని వీడనున్నారనేది చూడాలి. తేజా రెండో వారం తృటిలో తప్పించుకున్నాడు. మరోవైపు వరుసగా వైల్డ్ కార్డు ఎంట్రీలు ఉంటాయని అంటున్నారు.

Read Today's Latest Pratyekam News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు