Bigg Boss 7 Telugu: శత్రువులు మిత్రులుగా విడిపోయిన బిగ్ బాస్ హౌస్… నామినేషన్స్ లో మైకులు బద్దలేనా!

మామూలుగా అయితే సండే.. ఫండే అనే వాడిని కానీ ఫైనల్ దగ్గరకు వస్తుంది కదా అందుకని మీకు ఒక టాస్క్ అని నాగార్జున చెప్పారు. ” యాడ్ ఏ ఫ్రెండ్ .. బ్లాక్ ఏ హౌస్ మేట్ ” హౌస్ లో కొత్తగా ఎవరిని ఫ్రెండ్ చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్లకు ఫ్రెండ్షిప్ బ్యాండ్ వేయాలి ..

  • Written By: Neelambaram
  • Published On:
Bigg Boss 7 Telugu: శత్రువులు మిత్రులుగా విడిపోయిన బిగ్ బాస్ హౌస్… నామినేషన్స్ లో మైకులు బద్దలేనా!

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 ఇప్పటికే పదకొండు వారాలు పూర్తి చేసుకుంది. ఇక మిగిలింది నాలుగు వారాలు మాత్రమే. దీంతో ఆటను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు బిగ్ బాస్ ప్రయత్నం చేస్తున్నారు. నిన్న వీకెండ్ కావడంతో ”ఆట కావాలా … పాట కావాలా” అంటూ హుషారైన పాటతో ఎంట్రీ ఇచ్చాడు హోస్ట్ నాగార్జున. ఇక కంటెస్టెంట్స్ ని చూసి శోభా నువ్వు మైక్ వేసుకోవాలమ్మా అని నాగార్జున అన్నారు. మేకప్ వేసుకుని మైక్ మర్చిపోయావా అంటూ పంచ్ వేశారు. ఇక శోభా వెళ్లి మైక్ తెచ్చుకుంది.

మామూలుగా అయితే సండే.. ఫండే అనే వాడిని కానీ ఫైనల్ దగ్గరకు వస్తుంది కదా అందుకని మీకు ఒక టాస్క్ అని నాగార్జున చెప్పారు. ” యాడ్ ఏ ఫ్రెండ్ .. బ్లాక్ ఏ హౌస్ మేట్ ” హౌస్ లో కొత్తగా ఎవరిని ఫ్రెండ్ చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్లకు ఫ్రెండ్షిప్ బ్యాండ్ వేయాలి .. ఒకరిని బ్లాక్ చెయ్యాలి అని చెప్పారు. ముందుగా గౌతమ్ ప్రశాంత్ కి వేసాడు. రెండు వారాలుగా నాతో బాగుంటున్నాడు సార్. నామినేషన్స్ లో కూడా నార్మల్ గానే ఉంటున్నాం అంటూ గౌతమ్ చెప్పాడు.

తర్వాత శోభా.. గౌతమ్ బుగ్గ పై స్టాంప్ వేసి ‘ ప్రియాంక అవడం నీకు ఇష్టం లేదా చెప్పు .. లేదని చెప్పు ఆపేస్తానంటూ గేమ్ లో అమర్ దీప్ తో గౌతమ్ అనడం నాకు నచ్చలేదు సార్ అని చెప్పి బ్లాక్ చేసింది. ‘ ఇక నుంచి ప్రశాంత్ నా ఫ్రెండ్ అంటూ ఫ్రెండ్ బ్యాండ్ వేసాడు అమర్. తర్వాత గౌతమ్ కి స్టాంప్ వేసి బ్లాక్ చేసింది అశ్విని. ‘ ఆ రోజు అమర్ అంత బాధపడుతుంటే .. టార్గెట్ చేసి కొట్టడం నాకు నచ్చలేదు సార్ అంటూ రీజన్ చెప్పింది.

ఇక శివాజీ ‘ హౌస్ లోకి వచ్చినప్పటి నుంచి అర్జున్ చాలా జన్యున్ అనిపించాడు’ అని చెప్పాడు. చివరిగా అర్జున్ ‘ తెలిసో తెలియకో మిస్టేక్ చేశాడు’ అంటూ యావర్ కి స్టాంప్ వేశాడు. ఇలా ప్రతి కంటెస్టెంట్ ఒకరిని మిత్రుడిగా మరొకరిని శత్రువుగా ప్రకటించారు. ఈ పరిణామం నేడు నామినేషన్స్ లో రిప్లెక్ట్ కావడం ఖాయం. బ్లాక్ చేసిన హౌస్ మేట్స్ ని అది పాయింట్ గా తీసుకుని నామినేట్ చేయవచ్చు.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు