Bigg Boss 7 Telugu: ప్రియాంక-శోభా కుమ్మక్కు… ప్రిన్స్ యావర్ కి ఝలక్!

ప్రియాంక జుట్టు కట్టించుకుంది. అమర్ దీప్ మాత్రం నిరాకరించాడు. దీంతో అమర్ దీప్ స్థానంలో ప్రియాంక కంటెండర్ స్థానం కోసం పోటీ పడుతుంది. రెండో రౌండ్ కి చేరిన ప్రియాంక, ప్రిన్స్ యావర్, శోభా శెట్టి మధ్య బిగ్ బాస్ ఫిట్టింగ్ పెట్టాడు.

  • Written By: Shiva
  • Published On:
Bigg Boss 7 Telugu: ప్రియాంక-శోభా కుమ్మక్కు… ప్రిన్స్ యావర్ కి ఝలక్!

Bigg Boss 7 Telugu: మూడో కంటెండర్ కోసం బిగ్ బోస్ హౌస్లో పోటీ జరుగుతున్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ స్వయంగా అమర్ దీప్, శోభా శెట్టి, ప్రిన్స్ యావర్ కి కంటెండర్ అయ్యేందుకు పోటీపడే ఛాన్స్ ఇచ్చాడు. ప్రిన్స్ యావర్ తన టాస్క్ లో గెలిచి రెండో రౌండ్ కి వెళ్ళాడు. కారంతో కూడిన చికెన్ తినే టాస్క్ లో శోభా శెట్టి గెలిచి రెండో రౌండ్ కి వెళ్ళింది. రేసులో ఉన్న మూడో కంటెండర్ అమర్ దీప్ మాత్రం ఓడిపోయాడు. ప్రియాంక, అమర్ దీప్ మధ్య పోటీ జరిగిన నేపథ్యంలో జుట్టు కత్తిరించుకున్న కంటెస్టెంట్ కంటెండర్ రేసులో ముందుకు వెళతారని చెప్పారు.

ప్రియాంక జుట్టు కట్టించుకుంది. అమర్ దీప్ మాత్రం నిరాకరించాడు. దీంతో అమర్ దీప్ స్థానంలో ప్రియాంక కంటెండర్ స్థానం కోసం పోటీ పడుతుంది. రెండో రౌండ్ కి చేరిన ప్రియాంక, ప్రిన్స్ యావర్, శోభా శెట్టి మధ్య బిగ్ బాస్ ఫిట్టింగ్ పెట్టాడు. ముగ్గురు సభ్యుల్లో మెజారిటీ సభ్యులు వీకెస్ట్ కంటెస్టెంట్ అని నిర్ణయించిన వ్యక్తి రేసు నుండి తప్పుకోవాలి. అంటే ఇద్దరు కలిసి ఒకరిని ఎలిమినేట్ చేయాలి.

మేము ఇద్దరం అమ్మాయిలం కాబట్టి పోటీ సమ ఉజ్జీల మధ్య జరిగినట్లు అవుతుంది. అందుకే ప్రిన్స్ యావర్ వీక్ అని చెబుతున్నాం అన్నారు. దాంతో ప్రిన్స్ ఫైర్ అయ్యాడు. స్ట్రాంగ్ అని చెప్పుకునే మీరు నాతో ఎందుకు పోటీ పడలేకపోతున్నారు. నేను అమ్మాయిని అమ్మాయితోనే పోటీ పడతాను అంటే మీరు స్ట్రాంగ్ ఎలా అవుతారని ఇద్దరితో వాగ్వాదానికి దిగాడు.

ఎవరు వీక్ అనేది ఇంటి సభ్యులు నిర్ణయించినా బాగుంటుంది. అక్కడ ముగ్గురు ఉంటే వాళ్లలో ఇద్దరిని ఒకర్ని రేసు నుండి తప్పించాలని చెప్పడం దారుణంగా ఉంది. ఇలాంటి నిర్ణయాలు బిగ్ బాస్ షోపై నెగిటివిటీకి కారణం అవుతున్నాయి. ఒకవేళ ప్రిన్స్ యావర్ స్ట్రాంగ్ అనుకుంటే ముగ్గురి మధ్య మైండ్ గేమ్ పెడితే బాగుంటుంది. గెలిచినవాళ్లు ముందుకు వెళతారు. అక్కడ శోభా శెట్టి, ప్రియాంక ఉన్నప్పుడు కచ్చితంగా వాళ్ళు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు. మొత్తంగా ప్రిన్స్ మరోసారి బలి అయ్యాడు.

 

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు