Bigg Boss 7 Telugu: రతికాలో ఊహించని షేడ్స్ యావర్ కి వెన్నుపోటు… ఆ ముగ్గురికి బిగ్ బాస్ బంపర్ ఛాన్స్!
పవర్ అస్త్ర గెలుచుకుని మూడో కంటెండర్ అయ్యే ఛాన్స్ అమర్ దీప్, శోభా శెట్టి, ప్రిన్స్ యావర్ లకు ఇచ్చాడు. ఈ ముగ్గురు గతవారం రణధీర టీమ్ సభ్యులు కావడం విశేషం.

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ తెలుగు 7 రసవత్తరంగా సాగుతుంది. సోమవారం నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. మూడో వారానికి గాను అమర్ దీప్, ప్రియాంక, గౌతమ్ కృష్ణ, శుభశ్రీ, ప్రిన్స్ యావర్, దామిని, రతికా రోజ్ నామినేట్ అయ్యారు. వీరిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు. మంగళవారం హౌస్లో వినాయక చవితి వేడుకలు జరిగాయి. కంటెస్టెంట్స్ అందరూ వినాయకునికి పూజలు చేశారు. అనంతరం బిగ్ బాస్ భారీ ట్విస్ట్ ఇచ్చాడు.
పవర్ అస్త్ర గెలుచుకుని మూడో కంటెండర్ అయ్యే ఛాన్స్ అమర్ దీప్, శోభా శెట్టి, ప్రిన్స్ యావర్ లకు ఇచ్చాడు. ఈ ముగ్గురు గతవారం రణధీర టీమ్ సభ్యులు కావడం విశేషం. మొదటి పవర్ అస్త్ర సందీప్, రెండో పవర్ అస్త్ర శివాజీ గెలుచుకున్న విషయం తెలిసిందే. మూడో పవర్ అస్త్ర పొందినవారికి మూడు వారాల ఇమ్యూనిటీ ఉంటుందని బిగ్ బాస్ చెప్పాడు. పవర్ అస్త్ర పొందే ఛాన్స్ ఆ ముగ్గురికే ఇవ్వడంతో మిగతా కంటెస్టెంట్స్ లో అసహనం మొదలైంది.
వారి అసహనాన్ని బిగ్ బాస్ తెలుసుకోవాలి అనుకున్నాడు. ఒక్కొక్కరినీ కన్ఫెషన్ రూమ్ కి పిలిచి… అమర్ దీప్, శోభా శెట్టి, ప్రిన్స్ యావర్ లలో ఎవరికి అర్హత లేదని భావిస్తున్నారో ఒకరి పేరు చెప్పాలని బిగ్ బాస్ ఆదేశించాడు… మొదటిగా ప్రశాంత్… శోభా శెట్టి పేరు చెప్పాడు. ప్రియాంక… అమర్ దీప్ పేరు చెప్పింది. నిజానికి సీరియల్ బ్యాచ్ అంటూ అమర్ దీప్, ప్రియాంక, శోభా శెట్టికి పేరు పడింది. ఈ క్రమంలో అమర్ దీప్ పేరును ప్రియాంక చెప్పడం విశేషంగా మారింది.
శుభశ్రీ… శోభా శెట్టి పేరు చెప్పింది. తేజ… యావర్ పేరు చెప్పాడు. దామిని కూడా యావర్ పేరు చెప్పింది. గౌతమ్… శోభా శెట్టి పేరు చెప్పాడు. రతికా… యావర్ పేరు చెప్పింది. అత్యధికంగా యావర్, శోభా శెట్టికి 3 వ్యతిరేక ఓట్లు పడ్డాయి. యావర్ తో నవ్వుతూ మాట్లాడుతున్న రతికా కీలక సమయంలో వెన్నుపోటు పొడిచింది. కన్ఫెషన్ రూమ్ లో రహస్యంగా జరిగిన ఈ వీడియోలు బిగ్ బాస్ ప్లే చేయడంతో లొల్లి మొదలైంది. తనను అనర్హుడని చెప్పిన తేజా మీద యావర్ ఫైర్ అయ్యాడు. రచ్చ రచ్చ చేశాడు.
అమర్ దీప్ శివాజీ గెలిచిన పవర్ అస్త్ర కొట్టేశాడు. పల్లవి ప్రశాంత్ ని అనుమానించిన రతికా రోజ్ అతనితో గొడవ పడింది. ఆమెను తాకుతూ నా ముందు నుండి వెళ్ళిపో అని పల్లవి ప్రశాంత్ అన్నాడు. మీద చెయ్యేస్తే బాగోదని రతికా వార్నింగ్ ఇచ్చింది. ఇలాంటి ఆసక్తికర విషయాలతో మంగళవారం ఎపిసోడ్ ముగిసింది…
