Bigg Boss 7 Promo: బిగ్ బాస్ 7 ప్రోమో వచ్చేసింది… హోస్ట్ ఎవరంటే?
కంటెస్టెంట్స్ ని కూడా పేరున్న తెలిసిన ముఖాలను ఎంపిక చేశారట. సరికొత్త గేమ్స్ తో సరికొత్తగా షోని ప్లాన్ చేశారట. సీజన్ 7 ని భారీగా సక్సెస్ చేయాలనే ప్రణాళికలో ఉన్నారట. ఒకవేళ నాగార్జున హోస్టింగ్ నుండి తప్పుకుంటే ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారు? అంతటి సమర్థులు ఎవరు? అనే ఊహాగానాలు మొదలయ్యాయి.

Bigg Boss 7 Promo: బిగ్ బాస్ షోకి ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. గత ఆరు సీజన్స్ గా సక్సెస్ ఫుల్ గా సాగుతుంది. బిగ్ బాస్ సీజన్ 7 కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా బిగ్ బాస్ లేటెస్ట్ సీజన్ కి రంగం సిద్ధమైంది. ఫస్ట్ ప్రోమో విడుదల చేశారు. అయితే ఈ ప్రోమోలో ఎలాంటి డిటైల్స్ ఇవ్వలేదు. కేవలం లోగో చూపించారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ పూర్తయ్యింది. ఫైనల్ లిస్ట్ కూడా ప్రిపేర్ చేశారు. జులై చివరి వారం లేదా ఆగస్టు మొదటివారంలో సీజన్ మొదలుకానుంది.
ఇక హోస్ట్ ఎవరనే సందిగ్ధత కొనసాగుతుంది. గత నాలుగు సీజన్స్ గా నాగార్జున ఆ బాధ్యత నెరవేరుస్తున్నారు. అయితే సీజన్ 6 విషయంలో నాగార్జున విమర్శలపాలయ్యారు. నాగార్జున పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయారనే అభిప్రాయం ప్రేక్షకులు వెల్లడించారు. మొత్తంగా కూడా సీజన్ 6 అట్టర్ ప్లాప్. కనీస టీఆర్పీ రాలేదు. ఈ క్రమంలో హోస్ట్ నాగార్జునకు గుడ్ బై చెప్పనున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
కంటెస్టెంట్స్ ని కూడా పేరున్న తెలిసిన ముఖాలను ఎంపిక చేశారట. సరికొత్త గేమ్స్ తో సరికొత్తగా షోని ప్లాన్ చేశారట. సీజన్ 7 ని భారీగా సక్సెస్ చేయాలనే ప్రణాళికలో ఉన్నారట. ఒకవేళ నాగార్జున హోస్టింగ్ నుండి తప్పుకుంటే ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారు? అంతటి సమర్థులు ఎవరు? అనే ఊహాగానాలు మొదలయ్యాయి. ముందుగా దగ్గుబాటి రానా పేరు వినిపిస్తుంది రానా గొప్ప వ్యాఖ్యాత. గతంలో కొన్ని షోస్ కి హోస్ట్ చేసి ఉన్నాడు.
ఆయన ఒప్పుకుంటే బిగ్ బాస్ నిర్వాహకుల ఫస్ట్ ఛాయిస్ రానా అవుతాడు. తాజాగా బాలకృష్ణ పేరు తెరపైకి వచ్చింది. ఆన్ స్క్రీన్ లో తప్ప ఆఫ్ స్క్రీన్ లో బాలయ్య మాట్లాడలేడనే అపవాదు ఉండేది. అన్ స్టాపబుల్ షోతో దాన్ని పటాపంచలు చేశాడు. అన్ స్టాపబుల్ ఊహించని రెస్పాన్స్ దక్కించుకుంది. కాబట్టి బాలయ్య యాటిట్యూడ్ కి బిగ్ బాస్ హోస్టింగ్ బాగా సెట్ అవుతుందని పలువురి అభిప్రాయం. బిగ్ బాస్ 7 ప్రోమో వదిలారంటే హోస్ట్ ఫిక్స్ అయినట్లే. త్వరలో అది తేలనుంది.
