Bigg Boss 7 Telugu Day 1: బిగ్ బాస్ 7 : మొదటి రోజే ఊహించని షాక్
నిజానికి బిగ్ బాస్ హౌస్ లోకి 20 మంది కంటెస్టెంట్స్ రాబోతున్నట్లు తెలిసింది. కానీ చివరికి కేవలం 14 మందిని మాత్రమే హౌస్ లోకి పంపించాడు నాగార్జున. గత సీజన్స్ లో శనివారం, ఆదివారం కలిపి కంటెస్టెంట్స్ ను హౌస్ లోకి పంపించే వాళ్ళు.

Bigg Boss 7 Telugu Day 1: తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 ఈ ఆదివారం అట్టహాసంగా ప్రారంభం అయ్యింది. ఈ వేడుకకు విజయ్ దేవరకొండ, నవీన్ పోలిశెట్టి స్పెషల్ గెస్ట్ లుగా వచ్చి సందడి చేశారు. ఇక మొదటి నుంచి చెపుతున్నట్లు ఈ సీజన్ సరికొత్తగా ఉండబోతుందని ఉల్టా – పల్టా గా సందడి చేయబోతోందని మొదటి నుంచి వినిపిస్తున్న మాటలు వాటికి తగ్గట్లే మొదటి రోజు సాగింది.
నిజానికి బిగ్ బాస్ హౌస్ లోకి 20 మంది కంటెస్టెంట్స్ రాబోతున్నట్లు తెలిసింది. కానీ చివరికి కేవలం 14 మందిని మాత్రమే హౌస్ లోకి పంపించాడు నాగార్జున. గత సీజన్స్ లో శనివారం, ఆదివారం కలిపి కంటెస్టెంట్స్ ను హౌస్ లోకి పంపించే వాళ్ళు. కానీ ఈ సీజన్ మాత్రం కేవలం ఆదివారం 14 మందిని హౌస్ లోకి పంపించి క్లోజ్ చేశారు. దీంతో మిగిలిన వాళ్ళ సంగతేంటి అనే అనుమానాలు కలుగుతున్నాయి.
ఏడో సీజన్‌లోకి సీరియల్ హీరో అమరదీప్,నటుడు గౌతమ్ కృష్ణ, నటి షకీలా, హీరో శివాజీ, సింగర్ దామిని,నటి రతికా రోజ్, నటుడు ప్రిన్స్ యావర్, యంగ్ హీరోయిన్ శుభ శ్రీ,రైతు పల్లవి ప్రశాంత్, కొరియోగ్రాఫర్ సందీప్, సీరియల్ నటి శోభా శెట్టి,సీరియల్ నటి ప్రియాంక జైన్, యూట్యూబర్ టేస్టీ తేజ, నటి కిరణ్ రాథోడ్ లు కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు.
ఇక మిగిలిన ఆరుగురు కంటెస్టెంట్స్ ను వారం మధ్యలో కానీ లేదా వచ్చే శని, ఆదివారాల్లో కానీ హౌస్ లోకి పంపించే అవకాశం లేకపోలేదని తెలుస్తుంది. మొదటి రోజే సరికొత్తగా స్టార్ట్ అయ్యింది బిగ్ బాస్. స్టేజి మీదకు వచ్చిన కంటెస్టెంట్స్ కు నాగార్జున 20 లక్షల మనీ ఆఫర్ చేస్తూ, ఇప్పుడే వెళ్ళాలి అనుకుంటే ఈ డబ్బులు తీసుకొని పోవచ్చు అంటూ ఆఫర్ ఇచ్చాడు. ఎవరు కూడా ముందుకు రాకపోవడం తో ఐదు, ఐదు లక్షలు పెంచుకుంటూ 35 లక్షల దాకా వెళ్ళాడు.
ఆ టైం లో హీరో శివాజీ ఆ డబ్బులు తీసుకుని వెనక్కి వెళ్ళడానికి సిద్దమైన కానీ మళ్ళీ ఎందుకో ఆగిపోయాడు. దీనిని బట్టి చూస్తే ఈ సీజన్ మాత్రం నెక్స్ట్ రేంజ్ లో ఉండబోతుందని తెలుస్తుంది. నిజానికి గత సీజన్ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. ఆ సీజన్ లో ఇచ్చిన టాస్క్ లు కూడా ఏమాత్రం ఆసక్తి గా లేవనే అభిప్రాయం వ్యక్తం అయ్యింది. దీంతో బిగ్ బాస్ టీం ఈ సీజన్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టి మరి డిజైన్ చేసినట్లు అర్థం అవుతుంది.
