Bigg Boss 6 Telugu: ఈ సీజన్ లో ఇంతకు ముందు బిగ్ బాస్ సీజన్స్ లో ఎన్నడూ జరగని టాస్కులు జరుగుతున్నాయి..అంతే కాకుండా ఈ సీజన్ లో వచ్చిన్నాని ట్విస్టులు మిగిలిన అన్ని సీజన్స్ కలిపినా కూడా లేవు అని అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు..ముఖ్యంగా క్యాష్ ప్రైజ్ ని గేమ్ లో పెట్టడం..టాస్కులో ఓడిపోతే క్యాష్ ప్రైజ్ ని తగ్గించేయడం వంటివి కంటెస్టెంట్స్ తో పాటు ప్రేక్షకులకు కూడా షాక్ ని కలిగించిన అంశాలు..ఇదెక్కడి మోసం అంటూ సోషల్ మీడియా లో దీని గురించి ఎన్నో కథనాలు కూడా ప్రచారం అయ్యాయి.

Bigg Boss 6 Telugu
ఈ సీజన్ ఫ్లాప్ అవ్వడం వల్ల బిగ్ బాస్ టీం కి నష్టం వచ్చినందునే క్యాష్ ప్రైజ్ తగ్గించేశారంటూ వాదనలు వినిపించాయి..కానీ అక్కడే బిగ్ బాస్ మరో ట్విస్టు ఇచ్చాడు..క్యాష్ ప్రైజ్ ని ఆటలు ఆడి పెంచుకునే అద్భుతమైన అవకాశం ని కంటెస్టెంట్స్ కి మరోసారి కల్పించాడు బిగ్ బాస్..గత రెండు రోజులు గా ఈ టాస్కులు జరుగుతున్నాయి.
అయితే మొదటి రోజు కంటెస్టెంట్స్ క్యాష్ ప్రైజ్ ని పెంచడం లో విఫలం అయ్యారు..కానీ రెండవ రోజు మాత్రం టాస్కులు అద్భుతంగా ఆడి క్యాష్ ప్రైజ్ ని 38 లక్షల నుండి 41 లక్షల రూపాయలకు విజయవంతంగా పెంచగలిగారు..రేవంత్ వల్లే ఈ క్యాష్ ప్రైజ్ పెరిగింది..అతను పాల్గొన్న రెండు టాస్కులలో గెలుపొందాడు..కంటెస్టెంట్స్ అందరూ కూడా బ్యాలట్ బాక్స్ లో రేవంత్ గెలుస్తాడని అత్యధిక ఓట్లు వెయ్యడం తో క్యాష్ ప్రైజ్ పెరిగింది..ఇక ఈరోజు క్యాష్ ప్రైజ్ పెంచేందుకు గాను బిగ్ బాస్ మరింత కఠినతరమైన టాస్కులను హౌస్ మేట్స్ కి ఇచ్చాడు.

Bigg Boss 6 Telugu
నిన్నటి లాగానే ఈరోజు కూడా వీళ్ళు జాగ్రత్తగా టాస్కులు ఆడి క్యాష్ ప్రైజ్ ని 50 లక్షల రూపాయిల వైపుగా పరుగులు తీసేలా చేస్తారా లేదా అనేది చూడాలి..బిగ్ బాస్ టైటిల్ ని గెలుపొందిన ఇంటి సభ్యునికి 50 లక్షల రూపాయిల క్యాష్ ప్రైజ్ తో పాటుగా పాతిక లక్షల రూపాయిలు విలువ చేసే అందమైన ఫ్లాట్ ని కూడా ఇవ్వబోతున్నారు.