Bigg Boss 6 Telugu- Sri Satya: బిగ్ బాస్ సీజన్ 6 చివరి దశకి చేరుకోవడం తో నిన్న బిగ్ బాస్ ‘టికెట్ 2 ఫినాలే’ టాస్కుని నిర్వహించారు..ఈ టాస్కులో భాగంగా మొదటి రెండు లెవెల్స్ లో బిగ్ బాస్ ఇచ్చే మంచు మనిషి శరీర భాగాలను జాగ్రత్తగా ఎంచుకొని వాటిని కాపాడుకోవాలి..ఎవరి దగ్గరైతే ఎక్కువ శరీర భాగాలు ఉంటాయో వాళ్ళు ఈ టాస్కులో ముందుకి కొనసాగుతారు..ఎవరి దగ్గరైతే తక్కువ ఉంటాయో వాళ్ళు టాస్కు నుండి వైదొలుగుతారు..అలా ఈ టాస్కులో ఒక ఫైమా మినహా లేడీ కంటెస్టెంట్స్ అందరూ తొలగిపోతారు.

Bigg Boss 6 Telugu- Sri Satya
అయితే వాళ్ళని మళ్ళీ ‘టికెట్ 2 ఫినాలే’ టాస్కులో తిరిగి రావడానికి బిగ్ బాస్ ఒక అద్భుతమైన అవకాశం ఇస్తాడు..ఈ టాస్కులో ఇనాయ , శ్రీ సత్య మరియు కీర్తి నువ్వా నేనా అనే తరహాలో పోటీ పడుతారు..ఈ టాస్కులో భాగంగా ఈ ముగ్గురు తెల్ల వైట్ షర్ట్ ని ధరిస్తారు..పక్కనే ఒక ప్లేట్ లో ఎరుపు రంగు తో కూడిన పెయింట్ ఉంటుంది.
ఈ పెయింట్ ని ఈ ముగ్గురు కంటెస్టెంట్స్ చేతికి తీసుకొని ఒకరి షర్ట్ పై ఒకరు ఎరుపు రంగుతో నిండిన చేతితో తాకాలి..అలా ఎవరి షర్ట్ మీద అయితే ఎక్కువ రంగు ఉంటుందో వాళ్ళు ఈ టాస్కు నుండి తొలగిపోతారు..ఈ టాస్కు లో ముగ్గురు కంటెస్టెంట్స్ చిరుత పులులు లాగ తలపడినప్పటికీ శ్రీ సత్య షర్ట్ పై ఎక్కువ రంగు ఉండడం తో ఆమె మొదట తొలగిపోతాది..ఇక ఆ తర్వాత ఇనాయ మరియు కీర్తి ఒక రేంజ్ లో ఈ టాస్కులో తలపడుతారు..క్రింద పడిపోయి ఒకమీద ఒకరు కూర్చొని రంగులు పూసుకుంటారు.

Bigg Boss 6 Telugu- Sri Satya
వీళ్ళిద్దరిలో ఎవరు ఈ టాస్కు విజేతగా నిలిచి ‘టికెట్ 2 ఫినాలే’ టాస్కులోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనేది తెలియాలంటే ఈరోజు రాత్రి టెలికాస్ట్ వరుకు వేచి చూడాల్సిందే..విశేషం ఏమిటి అంటే ఈ టాస్కులో కీర్తి వేలు విరిగిపోయిన కూడా ప్రత్యర్థి ఇనాయ ని ఓడించే రేంజ్ లో ఆడుతుంది..దానికి సంబంధించిన ప్రోమో ని మీరు క్రింద చూడవచ్చు.