Adi Reddy – Faima Elimination: బిగ్ బాస్ సీజన్ 6 ఫినాలే కి సరిగ్గా రెండు వారాలు ఉన్నాయి..ఎన్నడూ లేని విధంగా ఏకంగా 21 కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన బిగ్ బాస్ హౌస్ ఇప్పుడు 8 మందికి చేరుకుంది..ఇక రెండు వారాలు మిగిలి ఉండడం తో టాప్ 6 కంటెస్టెంట్స్ మాత్రమే ఉండాలి..అంతే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ తప్పదు..ఈ వారం నామినేషన్స్ వాడావేడి వాతావరణంలోనే జరిగింది..శ్రీహాన్ మరియు ఇనాయ మినహా మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ నామినేషన్స్ లోకి వచ్చారు.

Adi Reddy – Faima
వీరి అందరిలో ఎప్పటి లాగానే రేవంత్ అత్యధిక ఓట్లతో నెంబర్ స్థానం లో కొనసాగుతున్నాడు..ఇక అతని తర్వాత రోహిత్ అత్యధిక ఓట్లతో కొనసాగుతుండగా మూడవ స్థానం లో కీర్తి..నాల్గవ స్థానం లో శ్రీ సత్య, ఐదవ స్థానం లో ఆది రెడ్డి మరియు ఆరవ స్థానం లో ఫైమా కొనసాగుతున్నారు..వీరిలో ఆది రెడ్డి మరియు ఫైమా డేంజర్ జోన్ లో ఉన్నట్టు తెలుస్తుంది..ఈ వారం నామినేషన్స్ వీళ్లిద్దరు రేవంత్ పై విరుచుపడింది సంగతి తెలిసిందే.
రేవంత్ ని టార్గెట్ చేసిన కంటెస్టెంట్స్ చాలామంది గతం లో ఎలిమినేట్ అయ్యారు..ఈసారి కూడా అలాంటి పరిస్థితే రాబోతోందా అంటే అవుననే చెప్తున్నారు విశ్లేషకులు..అయితే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ‘టికెట్ 2 ఫినాలే’ టాస్కు జరుగుతుంది..ఈ టాస్కులో ఆది రెడ్డి అద్భుతంగా రాణిస్తూ ప్రస్తుతం అత్యధిక పాయింట్స్ తో నెంబర్ 1 స్థానం లో కొనసాగుతున్నారు..అతనే కనుక ఈ టాస్కు చివరి నిమిషం వరుకు ఇదే డామినేషన్ ని కొనసాగిస్తే ఎలిమినేషన్ ని తప్పించుకొని గ్రాండ్ ఫినాలే వీక్ కి వెళ్ళిపోతాడు.

Adi Reddy
ఇక అతని బదులు శ్రీ సత్య మరియు ఫైమా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంటుంది..మరి ఆది రెడ్డి టికెట్ తో ఫినాలే టాస్కులో విన్ అయ్యి, టాప్ 5 లిస్ట్ లోకి వచ్చిన ఏకైక సామాన్య కంటెస్టెంట్ గా నిలుస్తాడా..లేదా దురదృష్టంకొద్దీ ఎలిమినేట్ అవుతాడా అనేది చూడాలి..ఈ వారం ఎలిమినేషన్ కూడా చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది.