Adi Reddy – Revanth: బిగ్ బాస్ సీజన్ 6 రసకందాయంలో పడింది. ఇంకొన్ని రోజుల్లో టైటిల్ విన్నర్ ఎవరో తేలిపోతుంది. టైటిల్ అందుకునేది ఎవరనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ప్రస్తుతం హౌస్లో 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో ముగ్గురు ఎలిమినేట్ కానున్నారు. మిగిలిన ఐదుగురు సభ్యులు ఫైనల్ కి వెళతారు. ఫైనలిస్ట్స్ లో ఒకరి నేమ్ కన్ఫర్మ్ అయ్యింది. ఆదిరెడ్డి బిగ్ బాస్ తెలుగు 6 ఫస్ట్ ఫైనలిస్ట్ గా నిలిచాడు. టికెట్ టు ఫినాలే గెలుచుకొని నేరుగా ఫైనల్ కి చేరుకున్నాడు.

Adi Reddy – Revanth
మంగళవారం ఎపిసోడ్ లో బిగ్ బాస్ టికెట్ టు ఫినాలే ప్రకటించాడు. టికెట్ గెలుచుకున్న సభ్యుడు నేరుగా ఫైనల్ కి చేరుతాడని వెల్లడించాడు. దాన్ని గెలుచుకునేందుకు కంటెస్టెంట్స్ మధ్య మొదట స్నోమాన్ టాస్క్ కండక్ట్ చేశాడు. కంటెస్టెంట్స్ స్నోమాన్ బొమ్మ భాగాలు సేకరించి నిర్మించాలి. అతి తక్కువ పార్ట్స్ సేకరించి బొమ్మ నిర్మించిన కంటెస్టెంట్స్ రౌండ్ వైజ్ ఎలిమినేట్ అవుతారు. ఈ టాస్క్ లో మొదట శ్రీసత్య ఎలిమినేట్ అయ్యారు. తర్వాత రౌండ్ లో ఇనయా, కీర్తి ఎలిమినేట్ కావడం జరిగింది.
అంతటితో స్నోమాన్ టాస్క్ ముగిసిందని బిగ్ బాస్ వెల్లడించారు. అయితే ఎలిమినేటైన శ్రీసత్య, కీర్తి, ఇనయాలకు మరో ఛాన్స్ ఇచ్చాడు. వారిలో గెలిచిన ఒకరు టికెట్ టు ఫినాలే పోటీకి అర్హత సాధిస్తారని చెప్పారు. ఈ గేమ్లో ఇనయా,శ్రీసత్యలను ఓడించి కీర్తి ఫినాలే టికెట్ కోసం పోటీపడే అర్హత సాధించారు. రేవంత్, శ్రీహాన్, రోహిత్, ఆదిరెడ్డి, ఫైమా, కీర్తి టికెట్ పొందేందుకు శాయశక్తులా కృషి చేశారు. బిగ్ బాస్ నిర్వహించిన అన్ని టాస్క్ లలో గెలిచి ఆదిరెడ్డి టికెట్ టు ఫినాలే గెలుచుకున్నట్లు తెలుస్తుంది.

Adi Reddy – Revanth
ఈ క్రమంలో బిగ్ బాస్ సీజన్ 6 ఫైనల్ కి చేరిన ఫస్ట్ కంటెస్టెంట్ గా ఆదిరెడ్డి నిలిచాడు. రేవంత్ టికెట్ టు ఫినాలే కోసం చాలా కష్టపడ్డాడు. అయినా విజయం ఆదిరెడ్డిదే అయ్యింది. ఈ విషయంలో రేవంత్ చాలా నిరుత్సాహానికి గురయ్యాడు. అయితే ఇక్కడ ఒక కండీషన్ ఉంది. ఆదిరెడ్డి ఈ వారం నామినేషన్స్ లో ఉన్నాడు. ఒకవేళ అతడు ఎలిమినేట్ అయితే టికెట్ టు ఫినాలే వేస్ట్ అవుతుంది. అతడు సేవ్ అయితే మాత్రమే వచ్చే వారం ఎలిమినేషన్స్ లో లేకుండా నేరుగా ఫైనల్ లో పోటీపడతారు.