అమ్మాయికోసం గొడవ.. బిగ్ బాస్ 3 విన్నర్ కి తీవ్ర గాయాలు
బిగ్ బాస్ 3 విన్నర్, రాహుల్ సిప్లిగంజ్ పై కొంత మంది వ్యక్తులు దాడి చేశారు. గచ్చిబౌలీలోని ప్రిజం పబ్ లో బుధవారం అర్థరాత్రి ఈ దాడి జరిగింది. బీరుబాటిళ్లతో రాహుల్ పై దాడి చేశారు. ఆయన తలపై బీరు సీసాతో కొట్టడంతో రాహుల్ తీవ్ర రక్తస్రావంతో కింద పడిపోయాడు. పక్కనే ఉన్న తన ఫ్రెండ్స్ రాహుల్ ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. దాడి చేసిన వ్యక్తులను సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు గుర్తించారు. ప్రముఖ తెరాస […]

బిగ్ బాస్ 3 విన్నర్, రాహుల్ సిప్లిగంజ్ పై కొంత మంది వ్యక్తులు దాడి చేశారు. గచ్చిబౌలీలోని ప్రిజం పబ్ లో బుధవారం అర్థరాత్రి ఈ దాడి జరిగింది. బీరుబాటిళ్లతో రాహుల్ పై దాడి చేశారు. ఆయన తలపై బీరు సీసాతో కొట్టడంతో రాహుల్ తీవ్ర రక్తస్రావంతో కింద పడిపోయాడు. పక్కనే ఉన్న తన ఫ్రెండ్స్ రాహుల్ ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
దాడి చేసిన వ్యక్తులను సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు గుర్తించారు. ప్రముఖ తెరాస ఎమ్మెల్యే బంధువులు ఈ దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇంకా పూర్తివివరాలను సేకరిస్తున్నట్లు తెలియజేసారు. ఒక అమ్మాయి విషయంలో రాహుల్ స్నేహితులకు ఎమ్మెల్యే బంధువులకు మధ్య గొడవ జరిగిందని, అయితే ఆ అమ్మాయి ఎవరు అనేది పోలీసులు తెలపలేదు.
ప్రస్తుతం రాహుల్ సిప్లిగంజ్ గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ గొడవ గురించి రాహుల్ నుంచి పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని, తనకు చిన్న గాయం మాత్రమే అయిందని ఆయన పోలీసులకు తెలిపారు.