Director and Producer on ATM: స్టార్ డైరెక్టర్లు అంతా ఈ మధ్య నిర్మాతలుగా మారిపోతున్నారు. తాజాగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు సహాయ సహకారాలతో స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్ కూడా నిర్మాణంలోకి దిగబోతున్నారు. దిల్ రాజు – హరీష్ శంకర్ సంయుక్త నిర్మాణంలో రూపొందుతున్న వెబ్ సిరీస్ “ఏటీఎమ్”. జీ5 సంస్థ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది.

Director and Producer on ATM
దిల్ రాజు కుటుంబం నుంచి హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి ఈ వెబ్ సిరీస్ తో నిర్మాతలుగా మారుతున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై దర్శకుడు సి చంద్ర మోహన్ “ఏటీఎమ్” వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో బిగ్ బాస్ విన్నర్ వీజే సన్నీ, దివి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గతంలో ఈ సిరీస్ గురించి గ్రాండ్ గా చేసిన ప్రకటన టాలీవుడ్ ను ఆకర్షించింది.
తాజాగా ఈ వెబ్ సిరీస్ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. థ్రిల్లర్ కథతో “ఏటీఎమ్” వెబ్ సిరీస్ రూపొందనుంది. ప్రశాంత్ విహారీ సంగీతాన్ని అందిస్తుండగా…పీజీ విందా సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. త్వరలో ఈ వెబ్ సిరీస్ పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. నటీనటులు విషయానికి వస్తే.. వీజే సన్నీ, దివి తదితరులతో పాటు ఓ సీనియర్ నటి కూడా కీలక పాత్రలో నటిస్తోందట.
Also Read: భర్త విషయంలో అదే నా బాధ అంటున్న తీన్మార్ సావిత్రి.. వీడియోలు చూస్తాడంటూ?
ఇక సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫీ – పీజీ విందా, సంగీతం – ప్రశాంత్ విహారి, నిర్మాతలు – హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, దర్శకత్వం – సి చంద్ర మోహన్. ఇక ప్రస్తతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో హరీశ్ శంకర్ ఓ సినిమా చేస్తున్నాడు.
గత కొన్ని నెలలుగా ఈ సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ లేకపోయినా.. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయింది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించబోతుంది. ఇక ఈ సినిమాకు ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు.
Also Read: ‘దిల్ రాజు’ను సర్వ నాశనం చేస్తా.. మంటలు రేపుతున్న మాటలు !