బిగ్ బాస్ హౌస్ లో దారుణం: బిగ్ బాస్ హౌస్ లో ఎనిమిదో వారానికి గాను కెప్టెన్ ను ఎన్నుకునేందుకు రంగం అంతా సిద్ధమైపోయింది. నిన్న (బుధవారం) జరిగిన కెప్టెన్సీ కంటెండర్ల టాస్క్ లో కెప్టెన్సీ పోటీదారులు ఎవరో తేలిపోయింది. అలా ఎనిమిదో వారానికి గానూ కెప్టెన్సీ పోటీదారులుగా షణ్ముఖ్, సిరి, శ్రీరామ్, అనీ మాస్టర్ , సన్నీ, మానస్‌లు ఎంపికైయ్యారు నిన్న జరిగిన ఎపిసోడ్ లో. ఇందులో భాగం గా బిగ్ బాస్ కెప్టెన్ ఎంచుకునే భాగంలో ఫైనల్ టాస్క్ లో ‘వెంటాడు వేటాడు’ అనే టాస్క్ ని ఇస్తాడు.

VJ Sunny
ఈ క్రమంలో కెప్టెన్సీ కంటెండర్లకి థర్మాకోల్ బాల్స్ కలిగిన గోనె సంచులని బిగ్ బాస్ ఇస్తాడు. బజర్ మోగేలోపు ఎవరి దగ్గర అయితే ఎక్కువ థర్మాకోల్ బాల్స్ గోనె సంచిలో ఉంటాయో వాల్లే కెప్టెన్సీ టాస్క్ లో విజేతగా నిలిచి ఎనిమిదో వారానికి కెప్టెన్ అవుతారు. ఈ టాస్క్ కి జెస్సీ సంచాలకుడు గా వ్యవహరిస్తున్నట్టు బిగ్ బాస్ విడుదల చేసిన ప్రోమో ని చూస్తేనే తెలిసిపోతుంది.
కెప్టెన్సీ టాస్క్ లో భాగం గా ప్రత్యర్ధులు యొక్క బాగ్స్ ని ఖాళీ చెయ్యడమే కెప్టెన్సీ పోటీదారుల యొక్క ముఖ్య ఉద్దేశం. ఎన్ని విధాలుగైనా ప్రయత్నించయినా సరే బాగ్స్ ని ఖాళీ చేయచ్చు అని బిగ్ బాస్ పోటీదారులకి సూచిస్తాడు. దీనితో పోటీ దారుల మధ్య రసవత్తరమయిన పోటాపోటీ నెలకొంది.
ఈ నేపథ్యం లో పోటీదారుల మధ్య పెద్ద వాగ్వాదమే నెలకొంది. కాలితో ఎందుకు కొడుతున్నావ్ అంటూ అరుస్తూ ప్రోమో లో కేకలు వేస్తూ కనిపించాడు. మరి ఏం అవుతుందో చూడాలంటే ఇవ్వాళ జరిగే ఎపిసోడ్ వరకు ఎదురు చూడాల్సిందే.