Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ సినిమాకు అన్ని కోట్ల బడ్జెట్.. వర్కవుట్ అవుతుందా? నిండా మునుగుతారా?
స్టార్ హీరోల సినిమాలకు తప్ప చిన్న హీరోల సినిమాలకు భారీ బడ్జెట్ పెట్టే సాహసం చేయరు దర్శకనిర్మాతలు. ఇక టైప్ 2 హీరోల విషయంలో కాస్త ఆలోచిస్తారు కానీ పెట్టడానికి వెనకాడరు. కానీ చిన్న చిన్న సినిమాలు చేసి నార్మల్ హీరోగా పేరు సంపాదించిన నటులపై బడ్జెట్ పెట్టడం అంటే సాహసమే అని చెప్పాలి.

Sudigali Sudheer: జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన సుడిగాలి సుధీర్ ఆ తర్వాత వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటుతున్నాడు. కేవలం కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి హీరోగా చేస్తూ తనదైన ముద్ర వేసుకున్నాడు. గతంలో సుధీర్ హీరోగా వచ్చిన గాలోడు సినిమా మంచి విజయాన్ని సంపాదించడంతో సుధీర్ కు మరింత పేరు వచ్చింది. సాఫ్ట్ వేర్ సుధీర్, 3 మంకీస్, వాంటెడ్ పండుగాడు వంటి సినిమాలు మంచి గుర్తింపును సంపాదించి పెట్టాయి. ఇదిలా ఉంటే ఈ నటుడు ప్రస్తుతం మరో సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
స్టార్ హీరోల సినిమాలకు తప్ప చిన్న హీరోల సినిమాలకు భారీ బడ్జెట్ పెట్టే సాహసం చేయరు దర్శకనిర్మాతలు. ఇక టైప్ 2 హీరోల విషయంలో కాస్త ఆలోచిస్తారు కానీ పెట్టడానికి వెనకాడరు. కానీ చిన్న చిన్న సినిమాలు చేసి నార్మల్ హీరోగా పేరు సంపాదించిన నటులపై బడ్జెట్ పెట్టడం అంటే సాహసమే అని చెప్పాలి. అయితే సుధీర్ సినిమాకు కూడా ఇప్పుడు ఎక్కువ బడ్జెట్ పెడుతున్నారట. ఏకంగా రూ. 15 కోట్ల బడ్జెట్ పెట్టడానికి రెడీ అయ్యారట దర్శకనిర్మాతలు. అయితే ఈ సినిమాకు డైరెక్టర్ కొత్త అని తెలుస్తోంది. ఇక సుదీర్ హీరోగా, కొత్త డైరెక్టర్ అంటే ఈ రేంజ్ బడ్జెట్ పెట్టడం అంటే రిస్క్ చేస్తున్నట్టే…
బిజినెస్ జరగాలంటే కాస్త అనుభవం ఉన్న డైరెక్టర్ అయితే బెటర్. కానీ కొత్త డైరెక్టర్ కాబట్టి ప్రొడ్యూసర్ కి నష్టం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ కాస్త సుధీర్ పైన ఉన్న నమ్మకంతోనే ఈ రేంజ్ బడ్జెట్ పెడుతున్నారనే టాక్ కూడా ఉంది. అంతే కాదు ప్రొడ్యూసర్ కూడా కొత్త అనే తెలుస్తోంది. అయితే గాలోడు సినిమా ఏకంగా 20 కోట్ల షేర్ సంపాదించడంతో ఈ బడ్జెట్ సుధీర్ పై నమ్మకంతో.. స్టోరీ బాగుండడంతోనే ఈ సాహసం చేస్తున్నారని తెలుస్తోంది. మరి చూడాలి ఈ సినిమా ఎలా ఉండబోతుందో…
