India Olympics Host: 2036 ఒలంపిక్ క్రీడలు భారత్లో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లోని అహ్మదాబాద్ నగరం ఆతిథ్యం ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది.. అహ్మదాబాద్ నగరంలో క్రీడా సౌకర్యాలు మెరుగ్గా ఉండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ చెబుతున్నారు. అంతేకాదు వచ్చే ఏడాది సెప్టెంబర్లో ముంబైలో జరిగే ఒలంపిక్ సెషన్ షెడ్యూల్లో అంతర్జాతీయ కమిటీ సభ్యుల ముందు సమర్పించేందుకు ముసాయిదా కూడా సిద్ధం చేశారు.. మొన్న జరిగిన గుజరాత్ ఎన్నికల్లో కూడా బిజెపి తన మేనిఫెస్టోలో ఈ ఒలంపిక్ క్రీడల నిర్వహణ విషయాన్ని చేర్చింది.. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, రాష్ట్ర క్రీడల మంత్రి హర్ష సంఘవి ఇటీవల కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. ప్రధానంగా ఒలంపిక్ క్రీడల నిర్వహణపై చర్చించారు. అంతేకాదు క్రీడలకు అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వాలనే రాష్ట్ర ఆకాంక్షను ఆయన ముందు బలంగా చెప్పారు.

India Olympics Host
ఎంపిక ప్రక్రియ ఇలా ఉంటుంది
అంతర్జాతీయ ఒలంపిక్ కమిటీ ఆతిధ్య నగరం ఎంపికను పర్యవేక్షిస్తుంది.. గతంలో అవినీతి, మితిమీరిన ఖర్చుల ఆరోపణల నేపథ్యంలో ఓటింగ్ ఆధారిత ఎంపిక విధానాన్ని సమీక్షించింది.. 2019లో ఈ ప్రక్రియను రెండు కమిషన్లు పర్యవేక్షించాయి. దీనికి సంబంధించిన నివేదికను అంతర్జాతీయ ఒలంపిక్ కమిషన్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ కు సమర్పించింది.. ఇక అప్పటినుంచి ఎంపిక ప్రక్రియ పూర్తిగా మార్చేసింది.. క్రీడల నిర్వహణకు సంబంధించి దేశాల బిడ్, వాటి ఆర్థిక పరిస్థితి చూసిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకుంటుంది.. అంతేకాకుండా క్రీడల నిర్వహణకు సంబంధించి పోలింగ్ నిర్వహిస్తుంది.. ఇందులో భాగంగా 2025, 2029, 2036 ఒలంపిక్ క్రీడలకు ఆతిధ్య నగరాలను ఎంపిక చేసింది.. ఇక భారత్ విషయానికి వస్తే ఒలంపిక్ క్రీడలకు సంబంధించి అహ్మదాబాద్ నగరం అన్ని విధాలా అర్హతలు కలిగి ఉందని, ఇప్పటికే భారత ప్రభుత్వం కమిషన్ దృష్టికి తీసుకువచ్చింది.. అయితే గతంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మహారాష్ట్ర అప్పటి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కూడా హోస్టింగ్ హక్కుల కోసం వేలం వేయాలని అంతర్జాతీయ ఒలంపిక్ క్రీడా సమాఖ్యను కోరినట్లు సమాచారం.

India Olympics Host
ఎంపిక అయితే ఏమవుతుంది
ఒలంపిక్ క్రీడలకు సంబంధించి హక్కులు దక్కితే ఆతిథ్య నగరంలో పర్యాటకం పెరుగుతుంది.. ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది.. ప్రపంచంలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.. అంతే కాదు ఆ దేశానికి సంబంధించిన సంస్కృతిని పరివ్యాప్తం చేసేందుకు దోహదపడుతుంది.ఇక తదుపరి మూడు ఒలంపిక్స్ గేమ్స్ 2024 లో ఫ్రాన్స్, 2028 లో లాస్ ఏంజిల్స్, 2032 లో ఆస్ట్రేలియాలోని బ్రిస్బెన్ లో జరుగుతాయి. కాగా అహ్మదాబాద్ ను ఆతిథ్య నగరంగా ఎంపిక చేయడం పట్ల పలు విమర్శలు వ్యక్తమయ్యే అవకాశం కనిపిస్తోంది. మరీ దీనిపై బిజెపి నాయకులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.