‘Bhola Mania’ lyrical song : పాత సాంగ్ ని రీమిక్స్ చేసిన కొట్టినట్టు అనిపిస్తున్న ‘భోళా మానియా’ లిరికల్ వీడియో సాంగ్
లిరిక్స్ కూడా బాగున్నాయి, కానీ మహతి సాగర్ అందించిన ట్యూన్ మాత్రం చాలా యావరేజి గా ఉంది. ఈ ట్యూన్ వినగానే ఇంతకు ముందు ఎక్కడో విన్నట్టుగా అనిపిస్తుందే అనేలాగా ఉంది. ఫ్యాన్స్ ఈ పాటకి బాగా నిరాశకి గురయ్యారు.

‘Bhola Mania’ Lyrical Song : మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటిస్తున్న ‘భోళా శంకర్’ మూవీ ఆగష్టు 11 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతున్న సందర్భంగా, ఇప్పటి నుండే ఈ సినిమాకి సంబంధించిన ప్రొమోషన్స్ ని ప్రారంభించారు. ఈ సినిమాకి సంభందించిన ‘భోళా మానియా’ అనే లిరికల్ వీడియో సాంగ్ ని కాసేపటి క్రితమే విడుదల చేసింది మూవీ టీం. మెలోడీ బ్రహ్మ మణిశర్మ కొడుకు ‘మహతి సాగర్’ సంగీత దర్శకత్వం వహించాడు.
ఇక మొదటి పాట ‘భోళా మానియా’ సాంగ్ ని ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ చేత విడుదల చేయించింది మూవీ టీం. ఈ సాంగ్ విడుదల చేసినందుకు గాను మెగాస్టార్ చిరంజీవి దేవిశ్రీప్రసాద్ కి కృతఙ్ఞతలు తెలియచేసాడు. ఇక ఈ సాంగ్ ఎలా ఉంది అనే విశ్లేషణకి వస్తే, చిరంజీవి తన అద్భుతమైన గ్రేస్ స్టెప్పులతో పాటకి వన్నె తెచ్చాడు.
లిరిక్స్ కూడా బాగున్నాయి, కానీ మహతి సాగర్ అందించిన ట్యూన్ మాత్రం చాలా యావరేజి గా ఉంది. ఈ ట్యూన్ వినగానే ఇంతకు ముందు ఎక్కడో విన్నట్టుగా అనిపిస్తుందే అనేలాగా ఉంది. ఫ్యాన్స్ ఈ పాటకి బాగా నిరాశకి గురయ్యారు. కొద్దిరోజుల క్రితమే ఈ సినిమాలోని పాటలు బాగున్నాయి, మూడు పాటలు మహతి సాగర్ దంచి కొట్టేసాడు, ఫ్యాన్స్ కి ఇక పండగే అంటూ ఇండస్ట్రీ లో ఒక టాక్ నడించింది.
ఆ మూడు సాంగ్స్ లో ఈరోజు విడుదల చేసినా సాంగ్ ఒకటి కాదుకదా అని ఫ్యాన్స్ సోషల్ మీడియా లో వెటకారంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రం లో తమన్నా హీరోయిన్ గా నటించగా, కీర్తి సురేష్ చిరంజీవి కి సోదరిగా నటిస్తుంది. తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన ‘వేదలమ్’ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా ఫ్యాన్స్ ని అలరిస్తుందో లేదో తెలియాలంటే ఆగష్టు వరకు వేచి చూడాల్సిందే.
