భీష్మ సాధించిన వసూళ్లపై ఓ లుక్కేయండి..

నితిన్ తాజా చిత్రం ‘భీష్మ’ ఇటీవల విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మహాశివరాత్రి కానుకగా(ఫిబ్రవరి 21) ‘భీష్మ’ మూవీ రిలీజైంది. నితిన్-రష్మిక జోడికి ప్రేక్షకులు ఫిదా అయి కలెక్షన్ల వర్షం కురిపించారు. ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ హిట్టు నిలిచిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సంక్రాంతి బరిలో నిలిచిన ‘సరిలేరునికెవ్వరు’, ‘అల..వైకుంఠపురములో’ తర్వాత భీష్మ ఆ రేంజ్ హిట్టు దక్కించుకుందన్న టాక్ విన్పిస్తుంది. భీష్మ సాధించిన పది రోజుల కలెక్షన్స్ పరిశీలిస్తే నితిన్ కెరీర్లో ఈ మూవీ […]

  • Written By: Neelambaram
  • Published On:
భీష్మ సాధించిన వసూళ్లపై ఓ లుక్కేయండి..

నితిన్ తాజా చిత్రం ‘భీష్మ’ ఇటీవల విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మహాశివరాత్రి కానుకగా(ఫిబ్రవరి 21) ‘భీష్మ’ మూవీ రిలీజైంది. నితిన్-రష్మిక జోడికి ప్రేక్షకులు ఫిదా అయి కలెక్షన్ల వర్షం కురిపించారు. ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ హిట్టు నిలిచిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సంక్రాంతి బరిలో నిలిచిన ‘సరిలేరునికెవ్వరు’, ‘అల..వైకుంఠపురములో’ తర్వాత భీష్మ ఆ రేంజ్ హిట్టు దక్కించుకుందన్న టాక్ విన్పిస్తుంది.

భీష్మ సాధించిన పది రోజుల కలెక్షన్స్ పరిశీలిస్తే నితిన్ కెరీర్లో ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచిందని చెప్పొచ్చు.

నైజాంలో రూ.8.57కోట్లు
సీడెడ్లో రూ.3.13కోట్లు
ఉత్తరాంధ్రలో రూ.2.86 కోట్లు
ఈస్ట్ రూ.1.64 కోట్లు
వెస్ట్ రూ.1.21కోట్లు
గుంటూరులో 1.73కోట్లు
నెల్లూరులో రూ.0.72 కోట్లు
కృష్ణాలో రూ.1.44 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా రూ.1.88 కోట్లు
ఓవర్సీస్ రూ.3.10 కోట్లు
ప్రపంచ వ్యాప్తంగా రూ.26.28 కోట్లు కలెక్ట్ చేసినట్లు సమాచారం. అదేవిధంగా ‘బీష్మ’ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 22.7 కోట్ల బిజినెస్ జరిగింది.

భీష్మ చిత్రం కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు మంచి లాభాల బాట పట్టినట్లు తెలుస్తోంది. నితిన్ కెరీర్లో ‘భీష్మ’ బిగ్గెస్ట్ హిట్ నిలిచింది. ఈ మూవీకి దర్శకత్వం వహించిన వెంకీ కుడుములకు మంచి గుర్తింపు తెచ్చింది. ఈ మూవీ తర్వాత వెంకీ కుడుములకు భారీ ఆఫర్లు వస్తున్నాయి. ఈ మూవీ తర్వాత నితిన్ ‘అంధాదున్’ రీమేక్లో నటిస్తున్నాడు. ఈమూవీని నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. ఇక హీరోయిన్ రష్మిక జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ నటించే మూవీల్లో ఎంపికైనట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా ‘భీష్మ’ మూవీ డిస్ట్రిబ్యూటర్లకు కాసులవర్షం కురిపించడంతోపాటు నటీనటులకు మంచి అవకాశాలను తెచ్చిపెట్టింది.

సంబంధిత వార్తలు