
Bharat Gaurav Train AP
Bharat Gaurav Train AP: తెలుగు రాష్ట్రాలపై బీజేపీ ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. ఇక్కడి ప్రజలను ఆకట్టుకునేందుకు వివిధ పథకాలను ప్రారంభిస్తోంది. రైల్వే విభాగం నుంచి ఇప్పటికే వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను అందించి రెండు రాష్ట్రాల ప్రజల మన్నలను పొందింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ‘భారత్ గౌరవ్’ రైలును తెలుగు రాష్ట్రాలకు అందించారు. ఈ రైలును శనివారం దక్షిణ మధ్య రైల్వే మేనేజర్ అరుణ్ కుమార్ సికింద్రాబాద్ స్టేషన్లో ప్రయాణించారు. ఇక్కడి నుంచి ఈ రైలు పూరీ, కాశీ, అయోధ్య మీదుగా ప్రయాగ వరకు వెళ్తుంది. 18న ప్రారంభమైన ఈ రైలు 26వ తేదీ వరకు అంటే 8 రాత్రుళ్లు, 9 పగళ్లు నడుస్తుంది.
భారత్ గౌరవ రైలు ప్రారంభం సందర్భంగా రైలులో ప్రయాణించేవారికి కూచిపూడి నృత్యంతో స్వాగతం పలికారు. అనంతరం ఐఆర్ సీటీసీ చైర్మన్, ఎండీ రజనీ హసీజా, ఇతర అధికారులతో కలిసి జీఎం అరుణ్ కుమార్ జైన్ యాత్రికులను స్వాగత కిట్ లు అందజేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన స్టేషన్లలోనే ‘గౌరవ్’ రైలు ఆగుతుంది. ఆ తరువాత పూరి, కోణార్క్, గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగ్ రాజ్ వంటి పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ వెళ్తుంది. పర్యాటకుల ఆసక్తితో పాటు పుణ్య క్షేత్రప్రదేశాల ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని మొత్తం పర్యటన ప్రయాణ ప్రణాళిక ను రూపొందించినట్లు దక్షిణ మధ్య రైల్వే మేనేజర్ అరుణ్ కుమార్ తెలిపారు.

Bharat Gaurav Train AP
‘గౌరవ్ రైలు’లో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరింగ్ కార్పొరేషన్ నిర్వహిస్తోంది. ఈ పర్యాటక రైలులో ప్రయాణించేవారికి అనేక సౌకర్యాలు కల్పిస్తున్నారు. రైలు, రోడ్డు రవాణాతో సహా వసతి, క్యాటరింగ్ సౌకర్యాలు కల్పించారు. వీటిలో భాగంగా ఉదయం టీ, అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం అందిస్తారు. అనుభవం కలిగిన వారితో అందరికీ నచ్చే లా స్నేహపూర్వక సేవలు అందిస్తారు. అన్ని కోచ్ లల్లో పబ్లిక్ అనౌన్స్ మెంట్ సౌకర్యాన్ని అందిస్తున్నారు. అంతేకాకుండా యాత్రికులకు ప్రయాణ బీమాను ఏర్పాటు చేయనున్నారు.
పుణ్యక్షేత్రాలను సందర్శించే ఈ రైలు పూరీ, కోణార్క్, గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగలోని ముఖ్యమైన, చారిత్రక కట్టడాలను సందర్శిస్తుంది. ఇలా 8 రాత్రలు 9 పగలు ప్రయాణిస్తుంది. ఈ రైలులోని ప్రయాణికుల డిమాండ్లకు అనుగుణంగా ఏసీ, నాన్ ఏసీ, కోచ్ లను కూడా ఏర్పాటు చేసింది. తొలి రైలులో ఎక్కేందుకు తెలుగువారు ఉత్సాహంగా ముందుకు వచ్చారు. రైలులో ఉన్న 700 సీట్లను ముందే బుక్ చేసుకున్నారు.
ఇక దక్షిణాదిలో పాగా వేయడానికి బీజేపీ అనేక పథకాలను ప్రవేశపెడుతోంది. ఇప్పటికే సికింద్రాబాద్, వైజాగ్ ల మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రవేశపెట్టి ఆకట్టుకుంది. తాజాగా ఏపీ నుంచి ఉత్తరాధి పుణ్యక్షేత్రాలు, చారిత్రక కట్టడాలను సందర్శించేందుకు ‘గౌరవ్’ రైలును ప్రవేశపెట్టడంతో ప్రధాని మోదీపై కొంతమంది ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎన్నికల వరకు మరిన్ని పథకాలు వస్తాయని తెలుగు రాష్ట్రాల బీజేపీ నాయకులు చెబుతున్నారు.