Bhagavanth Kesari Collection: బాలయ్య స్టామినా ఏదీ.. పడిపోయిన భగవంత్ కేసరి కలెక్షన్స్.. ఇంకా ఎన్ని వస్తే బ్రేక్ ఈవెన్ అంటే

నందమూరి బాలకృష్ణ ఓ సినిమాను ఒప్పుకున్నారు అంటే అందులో కచ్చితంగా మంచి పాయింట్స్ ఉంటాయి. స్టోరీ పక్కా ఉంటుంది. అదే విధంగా భగవంత్ కేసరి సినిమా కూడా ఎమోషనల్ స్టోరీతో ప్రేక్షకుల ముందకు వచ్చింది.

  • Written By: Suresh
  • Published On:
Bhagavanth Kesari Collection: బాలయ్య స్టామినా ఏదీ.. పడిపోయిన భగవంత్ కేసరి కలెక్షన్స్.. ఇంకా ఎన్ని వస్తే బ్రేక్ ఈవెన్ అంటే

Bhagavanth Kesari Collection: బాలయ్య సినిమా వస్తుందంటే చాలు థియేటర్లు మారు మోగాల్సిందే. అభిమానులు క్యూ కట్టాల్సిందే. అందరి అంచనాలను కొనసాగిస్తూ ఫుల్ ఫామ్ లో ఉన్నారు బాలకృష్ణ. ఇదే ఊపుతో మరిన్ని సినిమాలకు కూడా సంతకం చేశారు నందమూరి హీరో. కానీ ప్రస్తుతం విడుదలైన భగవంత్ కేసరి సినిమా కాస్త ఇబ్బంది పెట్టేట్టుగానే ఉందట. ఇంకా అంచనాలను మించి కలెక్షన్లు రాలేదని సమాచారం. ఆరంభంలో పాజిటివ్ టాక్ తో దూసుకొని పోయిన ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించింది. కానీ ప్రస్తుతం డౌన్ ఫాల్ నడుస్తుంది. మరి ఇన్ని రోజుల్లో ఈ సినిమా సాధించిన కలెక్షన్లు ఎంత? అసలు బడ్జెట్ ను క్రాస్ చేసిందా లేదా అనే వివరాలు మీకోసం..

నందమూరి బాలకృష్ణ ఓ సినిమాను ఒప్పుకున్నారు అంటే అందులో కచ్చితంగా మంచి పాయింట్స్ ఉంటాయి. స్టోరీ పక్కా ఉంటుంది. అదే విధంగా భగవంత్ కేసరి సినిమా కూడా ఎమోషనల్ స్టోరీతో ప్రేక్షకుల ముందకు వచ్చింది. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తే.. బాలకృష్ణ చెల్లెలి పాత్రలో శ్రీలీల నటించింది. చెల్లెలి కోసం ప్రాణం ఇచ్చే అన్నయ్య అనే కాన్సెప్ట్ తో నడిచింది సినిమా. బాలయ్య అభిమానులకు మంచి కంటెంట్ సినిమా వచ్చిందని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఈ సినిమాలో థమన్ సంగీతం మరో అద్భుతం.

ఇక ఎమోషనల్ కంటెంట్ తో వచ్చిన భగవంత్ కేసరి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 67.35 కోట్ల మేర బిజినెస్ చేసుకుందని టాక్. అంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 68.50 కోట్లుగా నమోదైంది. ఇక ఈ సినిమా రిలీజై 13 రోజులు కావస్తుండడంతో ఇప్పటి వరకు 64.60 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 3.90 కోట్లు రాబడితే సినిమా క్లీన్ హిట్ స్టేటస్ ను సంపాదిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా హవా క్రమంగా తగ్గుతుంది. థియేటర్లకు వచ్చే వారి సంఖ్య కూడా తగ్గడంతో మిగిలిన డబ్బులు రాబట్టడం ఎలా అనే సందేహం కలుగుతుందట చిత్ర యూనిట్ లో.. అయినా బాలయ్య, శ్రీలీల, కాజల్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కు 3.90 కోట్లు రావడం పెద్ద కష్టం కాదు అంటున్నారు అభిమానులు. మరి చూడాలి వీక్ డేస్ లో కష్టమైనా.. వీకెండ్ లో మాత్రం మళ్లీ పుంజుకునే అవకాశం ఎక్కువే ఉంటుంది.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు