Bhagavanth Kesari Collection: భగవంత్ కేసరి 14వ రోజు వసూళ్లు… నష్టాల్లోనే బాలయ్య మూవీ, ఇంకా ఎన్ని కోట్లు రావాలంటే!
భగవంత్ కేసరి విషయానికి వస్తే… టార్గెట్ కి చేరువైంది. అయితే ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదు. దసరా చిత్రాల్లో భగవంత్ కేసరి హిట్ టాక్ తెచ్చుకుంది. అలాగే విరివిగా ప్రమోషన్స్ చేశారు. దసరా సెలవులు కూడా కలిసొచ్చాయి.

Bhagavanth Kesari Collection: భగవంత్ కేసరి దసరా విన్నర్ అని చెప్పుకుంటున్నప్పటికీ ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదు. ఈ విషయంలో లియో చాలా ముందు ఉంది. దసరాకు లియో, భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు చిత్రాలు విడుదలయ్యాయి. ఒక్క లియో మాత్రమే బ్రేక్ ఈవెంట్ దాటి క్లీన్ హిట్ గా నిలిచింది. ఫస్ట్ వీక్ ముగిసే నాటికే లియో టార్గెట్ పూర్తి చేసింది. టైగర్ నాగేశ్వరరావు పర్వాలేదు అనిపించింది. టాక్ తో పోల్చుకుంటే మెరుగైన వసూళ్లు రాబట్టినట్లే లెక్క. టైగర్ నాగేశ్వరరావు రూ. 10 కోట్లకు పైగా నష్టాలు మిగల్చనుంది.
భగవంత్ కేసరి విషయానికి వస్తే… టార్గెట్ కి చేరువైంది. అయితే ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదు. దసరా చిత్రాల్లో భగవంత్ కేసరి హిట్ టాక్ తెచ్చుకుంది. అలాగే విరివిగా ప్రమోషన్స్ చేశారు. దసరా సెలవులు కూడా కలిసొచ్చాయి. దాంతో భగవంత్ కేసరి వసూళ్లు నిలకడగా సాగాయి. 5 రోజుల వరకు బాక్సాఫీస్ వద్ద భగవంత్ కేసరి సత్తా చాటింది. 6వ రోజు నుండి నెమ్మదించింది. ఇక 14వ రోజు వసూళ్లు మరింత క్షీణించాయి.
బుధవారం భగవంత్ కేసరి తెలుగు రాష్ట్రాల్లో రూ. 45 లక్షల షేర్ మాత్రమే రాబట్టింది. ఇక వరల్డ్ వైడ్ రూ. 65 లక్షల షేర్ అందుకున్నట్లు ట్రేడ్ వర్గాల అంచనా. మొత్తంగా ఇప్పటి వరకు భగవంత్ కేసరి రూ. 65 కోట్ల వరల్డ్ వైడ్ షేర్ రాబట్టినట్లు అంచనా వేస్తున్నారు. కాగా భగవంత్ కేసరి వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కులు రూ. 67.5 కోట్లకు అమ్మారు. దాదాపు రూ. 69 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగింది. రూ. 70 కోట్లు వస్తే కానీ సినిమా హిట్. కాబట్టి భగవంత్ కేసరి నష్టాల నుండి బయటపడాలంటే మరో రూ. 5 కోట్లు రాబట్టాలి.
అయితే కొన్ని ఏరియాల్లో భగవంత్ కేసరి బ్రేక్ ఈవెన్ అయ్యిందని అంటున్నారు. దసరా సీజన్ ఎంచుకొని నిర్మాతలు సేఫ్ అయ్యారు. లేదంటే భగవంత్ కేసరి ఫలితం మరోలా ఉండేది అనడంలో సందేహం లేదు. దర్శకుడు అనిల్ రావిపూడి ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందించాడు. శ్రీలీల కీలక రోల్ చేసింది. కాజల్ హీరోయిన్. తమన్ సంగీతం అందించారు. షైన్ స్క్రీన్ పతాకంలో తెరకెక్కింది.
