Benefits of Cardamom (Elaichi) : ఆ వ్యాధులు ఉన్నవాళ్లకు యాలకులు బెస్ట్.. సులువుగా చెక్!
Benefits of Cardamom (Elaichi) : మన దేశంలోని వంటశాలలో వినియోగించే మసాలా దినుసుల వల్ల మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగాలతో అనేక ఆరోగ్య సమస్యలకు సులభంగా చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. యాలకుల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. డయాబెటిస్, ఆస్తమా, గుండె సంబంధిత సమస్యలతో బాధ పడేవాళ్లకు యాలకులు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. దగ్గు, జలుబు సమస్యలతో బాధ పడేవాళ్లు యాలకులు వాడితే మంచిది. […]

Benefits of Cardamom (Elaichi) : మన దేశంలోని వంటశాలలో వినియోగించే మసాలా దినుసుల వల్ల మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగాలతో అనేక ఆరోగ్య సమస్యలకు సులభంగా చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. యాలకుల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. డయాబెటిస్, ఆస్తమా, గుండె సంబంధిత సమస్యలతో బాధ పడేవాళ్లకు యాలకులు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.
దగ్గు, జలుబు సమస్యలతో బాధ పడేవాళ్లు యాలకులు వాడితే మంచిది. ఆందోళన, వికారం సమస్యలకు కూడా యాలకులతో సులువుగా చెక్ పెట్టవచ్చు. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను యాలకులు కలిగి ఉంటాయి. యాలకుల ఆయిల్ శరీరంలోని యాంటీ బాక్టీరియల్ కు వ్యతిరేకంగా పని చేస్తుంది. ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్ సమస్యలతో బాధ పడేవాళ్లు యాలకులను తరచుగా వినియోగిస్తే మంచిది.
భోజనం తర్వాత నోటి దుర్వాసనకు చెక్ పెట్టడంలో యాలకులు సహాయపడతాయి. కావిటీస్, చిగుళ్ల వ్యాధులకు యాలకులు సులభంగా చెక్ పెడతాయి. శృంగార సామర్థ్యం పెరగాలంటే రోజూ యాలకులను తినాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. సంతాన సాఫల్యత అవకాశాలను పెంచడంలో యాలకులు తోడ్పడతాయి. నిద్రపోయే సమయంలో రెండు యాలకులను తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.
శరీరంలో రక్త ప్రసరణను పెంచడంలో యాలకులు తోడ్పడతాయి. ఆయుర్వేద నిపుణులు సైతం యాలకులను ఎక్కువగా వినియోగిస్తే మంచిదని చెబుతున్నారు. నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలని అనుకునే వాళ్లు యాలకులను రోజూ తీసుకుంటే మంచిది.
