Jasmine Flowers: భార్యకు మల్లెపూలు తెస్తే జరిగేది అదే.. ప్రతీ భర్త తప్పక తెలుసుకోండి..!

అవును.. మీరు చదివింది నిజమే.. ఇంతకీ ప్రతి రోజూ భార్యకు భర్త మల్లెపూలు తీసుకెళ్లడం వలన ఏం జరుగుతుందో తెలుసా.. దాని వలన కలిగే ప్రతిఫలం ఏంటో తెలుసుకోండి.

  • Written By: Neelambaram
  • Published On:
Jasmine Flowers: భార్యకు మల్లెపూలు తెస్తే జరిగేది అదే.. ప్రతీ భర్త తప్పక తెలుసుకోండి..!

Jasmine Flowers: హిందూ సంస్కృతి, సంప్రదాయాల్లో అనేక ఆచార వ్యవహారాలు అనాదిగా వస్తున్నాయి. సనాతన ధర్మం ప్రకారం.. మనం ఆచరించే నియమాలు, విశ్వసించే నమ్మకాల వెనుక సైన్స్‌ కూడా దాగి ఉంటుంది. అందుకే చాలా మంది ఆచారాలు పాటిస్తారు. కానీ కొందరు ఈ టెక్నాలజీ కాలంలో ఆచారాలు ఏంటి అని కొంతమంది కొట్టిపారేస్తారు. కానీ చదువుకున్న అనేక మంది కూడా ఇప్పటికీ ఆచారాలు, విశ్వాసాలను పాటిస్తున్నారు.

కొన్ని నమ్మకాలు..
ఇంటి గడపపై కాళ్లు పెట్టకూడదు. ఒక వేళ అలా పెడితే మొక్కుకోవాలి. నల్లపిల్లి ఎదురైతే కీడు. ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు తుమ్మడం అపశకునం.. ఇలా ఎన్నో నమ్మకాల గురించి మన ఇళ్లల్లో నిత్యం వింటూనే ఉంటాం. వీటిని కొందరు మూఢనమ్మకాలని కొట్టిపారేసినా.. మరికొందరు ఇప్పటికి పాటిస్తూనే ఉన్నారు. అయితే వీటి వెనుక ఎంతో సైన్స్‌ దాగుంటుంది అన్నది సత్యం. ఇక అలాంటిదే ఒక నమ్మకం ఉంది. అదేమిటంటే.. భర్త తన భార్యకు రోజూ మల్లెపూలను తీసుకెళ్లడం.

ఆర్థిక సమస్యలు దూరం..
అవును.. మీరు చదివింది నిజమే.. ఇంతకీ ప్రతి రోజూ భార్యకు భర్త మల్లెపూలు తీసుకెళ్లడం వలన ఏం జరుగుతుందో తెలుసా.. దాని వలన కలిగే ప్రతిఫలం ఏంటో తెలుసుకోండి. ఇంటిని చూసి ఇల్లాలిని చూడమన్నారు పెద్దలు. నిజమే ఇంట్లో ఆడవారుంటే ఆ కళే వేరు. అలాంటి ఆడవారు ఎప్పుడూ సంతోషంగా ఉంటే ఆ కుటుంబమే సంతోషంగా ఉంటుంది. ఆడవాళ్లు ఎంత ఒద్దిగగా, అందంగా, ఆనందంగా సంసారాన్ని సాగిస్తే ఆ ఇంట్లో వారి జీవితం అంత ఆనందంగా ఉంటుంది. మనిషిని వేధించే సమస్యల్లో ఒకటి ఆర్థికసమస్యలు. అలాంటి సమస్యలు దూరం కావాలంటే ముందు మీ ఇంటి ఆడవారిని సంతోషంగా ఉంచండి. మగవారు భార్యకు రోజూ మూరెడు మల్లెపూలను కొని తీసుకువెళ్తే చాలా మంచిదట.

ఉద్యోగం, వ్యాపారంలో వృద్ధి..
మీకు ఉద్యోగంలో, వ్యాపారంలో తగినంత సంపాదన లేక పోతే ప్రతీరోజు ఆమె తలలో మల్లె పూలు సింగారించుకొంటే శుక్రుడు అనుగ్రహిస్తాడు. ఇదే కాక పరిమళ భరితమైన జాజి, విరజాజివి వంటివి కూడా ఇవ్వచ్చు. శుక్రుడు అనుగ్రహిస్తే ఉద్యోగ, వ్యాపారాలు కలిసి వచ్చి సంపద కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కనుక పురుషులు ఈ చిన్న చిట్కాను పాటిస్తే శుక్రుని అనుగ్రహం పొంది తద్వారా వ్యాపార, ఉద్యోగ రంగాల్లో రాణించవచ్చు. దాంతో డబ్బు సంపాదిస్తారు. ఆర్థిక సమస్యలు పోతాయి.

Read Today's Latest Health news News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు